LATEST UPDATES
12, జూన్ 2021, శనివారం
11, జూన్ 2021, శుక్రవారం
సందేహాలు - సమాధానాలు
6, జూన్ 2021, ఆదివారం
మున్నాళ్ళ ముచ్చట - షేక్ రంజాన్
4, జూన్ 2021, శుక్రవారం
మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి.
3, జూన్ 2021, గురువారం
*గణిత పదనిసలు.... 🧮*
2, జూన్ 2021, బుధవారం
** ఏం మిగిలింది ? - శ్రీ గంజి దుర్గాప్రసాద్ **
1, జూన్ 2021, మంగళవారం
సందేహం - సమాధానం
29, మే 2021, శనివారం
ఏంచేయను...! - శ్రీ గంజి దుర్గాప్రసాద్
23, మే 2021, ఆదివారం
భూమి కొలతలు పదాలు వివరణ
1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 Syd
3) ఒక ఎకరాకు = 43,560 Sft
4) ఒక గుంటకు = 121 Syd
5) ఒక గుంటకు = 1089 Sft
6) ఒక Square yard కు 3 x 3 = 09 sft
7) 121 x 09 = 1089 Sft
8) 4840 Syd x 09 = 43,560 Sft
9) ఒక సెంట్ కి = 48.4 Syd
10) ఒక సెంటు కి = 435.6 Sft
గ్రామ కంఠం :
గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు.
ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.
అసైన్డ్‌భూమి :
భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు,, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి.
దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.
ఆయకట్టు :
ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.
బంజరు_భూమి (బంచరామి) :
గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేకమైన గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం :
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు...
దేవళ్ ఇనాం :
దేవాలయ ఇనాం భూమి.. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి ఇది...
అడంగల్ (పహాణీ) :
గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్ అనీ, తెలంగాణలో పహాణీ అని కూడా పిలుస్తారు..
భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు,, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికి అప్పుడు ఇందులో నమోదు చేస్తారు..
తరి :
సాగు భూమి.
ఖుష్కీ :
మెట్ట ప్రాంతం.
గెట్టు :
పొలం హద్దు
కౌల్దార్ :
భూమిని కౌలుకు తీసకునేవాడు.
కమతం :
భూమి విస్తీర్ణం
ఇలాకా :
ప్రాంతం
ఇనాం :
సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి.
బాలోతా ఇనాం :
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి.
సర్ఫేఖాస్ :
నిజాం నవాబు సొంత భూమి.
సీలింగ్ :
భూ గరిష్ఠ పరిమితి
సర్వే నంబర్ :
భూముల గుర్తింపు కోసం కేటాయించేది.
నక్షా :
భూముల వివరాలు తెలిపే చిత్రపటం.
కబ్జాదార్ :
భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి.
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) :
భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం.
32 సం,, ల లోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని EC అంటారు.
ఫీల్డ్ మెజర్‌మెంట్ (FMB) బుక్ :
దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.
బందోబస్తు :
వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.
బీ మెమో :
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.
పోరంబోకు :
భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.
ఫైసల్ పట్టీ :
బదిలీ రిజిస్టర్
చౌఫస్లా :
ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.
డైగ్లాట్ :
తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత రిజిస్టర్.
విరాసత్/ఫౌతి :
భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.
కాస్తు :
సాగు చేయడం
మింజుములే :
మొత్తం భూమి.
మార్ట్‌గేజ్ :
రుణం కోసం భూమిని కుదవపెట్టడం.
మోకా :
క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్).
పట్టాదారు పాస్ పుస్తకం :
రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.
టైటిల్ డీడ్ :
భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.
*ROR (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) :
భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్.
RSR :
రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్.
పర్మినెంట్ రిజిస్టర్ :
సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్.
సేత్వార్ :
రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు,, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్.
ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది..
సాదాబైనామా :
భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.
దస్తావేజు :
భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.
ఎకరం :
భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.
అబి :
వానకాలం పంట.
ఆబాది :
గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు.
అసైన్‌మెంట్ :
ప్రత్యేకంగాకేటాయంచిన భూమి.
శిఖం :
చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం.
బేవార్స్ :
హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు.
దో ఫసల్ :
రెండు పంటలు పండే భూమి.
ఫసలీ :
జులై 1నుంచి 12 నెలల కాలాన్ని ఫసలీ అంటారు.
నాలా :
వ్యవసాయేతర భూమి.
ఇస్తిఫా భూమి :
పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వ పరం చేసిన భూమి.
ఇనాం దస్తర్‌దాన్ :
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి.
ఖాస్రాపహానీ :
ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.
గైరాన్ :
సామాజిక పోరంబోకు
యేక్‌రార్‌నామా :
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం....
20, మే 2021, గురువారం
దవాఖానాలు దగాఖానాలాయా
సందేహాలు - సమాధానాలు
19, మే 2021, బుధవారం
సందేహాలు - సమాధానాలు
16, మే 2021, ఆదివారం
ఓ దశ పురోగమనం - మరో దశ తిరోగమనం
మనదే కదా! - రచన శ్రీ గంజి దుర్గాప్రసాద్
సందేహాలు - సమాధానాలు
15, మే 2021, శనివారం
సందేహం:- పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?
14, మే 2021, శుక్రవారం
భయం - రచన గంజి దుర్గాప్రసాద్
12, మే 2021, బుధవారం
ఆరోగ్యం ఎంత బాగుండెను
11, మే 2021, మంగళవారం
అదొక విషాదం-సంక్షోభం-పోరాటం
అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)
సందేహం - సమాధానం
భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?
10, మే 2021, సోమవారం
వందనాలు - అభివందనాలు
9, మే 2021, ఆదివారం
అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)
అమ్మ - అవని
పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ ఏ రోజు వరకు చెల్లిస్తారు?
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?
కారుణ్య నియామకాలకు అర్హులెవరు?
8, మే 2021, శనివారం
ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న టాప్ 5 నగదు లావాదేవీలు:
భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.
సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:
విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections
INCREMENTS -ఇంక్రిమెంట్లు - వివరణ
సరెండరు లీవు - కొన్ని వివరణలు
FAC అలవెను గురించి వివరణ.
అనుమతిలేని గైర్‌హాజరు - FR.18 కు సవరణలు
6, మే 2021, గురువారం
అసాధారణ సెలవు - ఇంక్రిమెంట్లు
5, మే 2021, బుధవారం
సందేహాలు - సమాధానాలు - పెన్షన్
సందేహాలు - సమాధానాలు
సందేహాలు - సమాధానాలు
27, ఏప్రిల్ 2021, మంగళవారం
సందేహాలు - సమాధానాలు
17, ఏప్రిల్ 2021, శనివారం
గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!
15, ఏప్రిల్ 2021, గురువారం
సందేహాలు - సమాధానాలు
సందేహాలు - సమాధానాలు -
1. ప్రశ్న
ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా?
జవాబు:
అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేయించుకోవచ్చు.
2. ప్రశ్న
చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?
జవాబు:
G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.
3. ప్రశ్న
స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?
జవాబు:
డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది: 27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.
4. ప్రశ్న
ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?
జవాబు:
G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి
5. ప్రశ్న
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?
జవాబు:
ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.
6 ప్రశ్న
ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?
జవాబు:
G.O.Ms.No.52 Fin తేది: 1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు. అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.
7. ప్రశ్న
నేను SA గా పదోన్నతి పొందాను. నాకు ప్రస్తుతం 56 ఇయర్స్. GOT పాస్ అయ్యాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?
జవాబు:
మెమో.21073 తేదీ: 21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
8. ప్రశ్న
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?
జవాబు:
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ: 24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
9. ప్రశ్న
11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా?
జవాబు:
జీఓ.334 తేదీ: 28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
10. ప్రశ్న
సరెండర్ కాలానికి IR చెల్లించబడతాయా?
జవాబు:
IR మాత్రం చెల్లించబడదు.