సందేహం - సమాధానాలు
ప్రశ్న:
సార్ ఒక టీచర్ కి సంవత్సరకాలానికి 6 సంపాదిత సెలవులు ఇస్తాము. అతను డెప్యుటేషన్ పై అడల్ట్ ఎడ్యుకేషన్ లో పనిచేశారు. 30 రోజులు సంపాదిత సెలవు నమోదు చేయాలంటే సదరు డిపార్ట్మెంట్ వారు విడిగా ప్రొసీడింగ్స్ ఇవ్వాలా, లేక డైరెక్టుగా 30 రోజులు మేము నమోదు చేయవచ్చునా?
సమాధానం:
మీ నాన్ టీచింగ్ స్టాఫ్ సెలవుల్లో పని చేస్తే ఏ విధానాన్ని ఫాలో అవుతారో అదే మీరు ఫాలో అవడమే. జీతం ఎవరు ఇచ్చారో, వారే SR లో నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి డిప్యుటేషన్ లో ఉన్న అడల్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొసీడింగ్స్ తెచ్చుకుని (prevention summer holidays) ఇక్కడ సాలరీ DDO HM/MEO తో నమోదు చేయించుకోవాలి
ప్రశ్న:
సర్ ఎవరయినా CPS గురించి క్లియర్ గా చెప్పండి. కొత్తగా ఉద్యోగం వచ్చి పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు తెలియదు. ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్పటం లేదు. అసలు CPS విధానం లేక ముందు ఎలా ఉండేది? CPS ఎప్పుడు తీసుకు వచ్చారు? CPS విధానం వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కాస్త వివరంగా చెప్పగలరు? మేము కూడా ఈ పోరాటంలో బాగస్వాములం అవుతాం
సమాధానం:
CPS విధానంపై అవగాహన-1
మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అమలౌతున్న సర్వీస్ పెన్షన్ లు 2 రకాలు
1.1980 పెన్షన్ రూల్స్ (ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్)
ఈ విధానం 2004 ఆగస్ట్ 31 వరకు ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అయిన వారికి వర్తిస్తుంది.
Note: ఈ విధానంలో ఉద్యోగి జీతం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది
2.CPS(Contributory pension scheme)
ఈ విధానం 2004 సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అయిన వారికి వర్తిస్తుంది.
ఈ విధానంలో ఉద్యోగి జీతంలో (PAY+DA) లో 10% జీతాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి వచ్చిన లాభాన్ని పెన్షన్ గా ప్రభుత్వేతర సంస్థలు* ఉద్యోగికి పెన్షన్ ఇస్తాయి.
CPS విధానం పై అవగాహన -2
1. ఉద్యోగి తను ప్రతీ నెలా (Pay+DA) లో 10% జీతానికి సమానమైన వాటాను కలిపి ట్రస్టీ బ్యాంక్ (Axis bank)కు పంపి ఫండ్ మేనేజర్లు (SBI, LIC, UTI) ద్వారా ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్ లో NAV లను కొని పెట్టుబడి పెడుతుంది. *మనకు నచ్చిన లాభాన్ని ఇచ్చే NAV (నెట్ అసెట్ వేల్యూ) లను కొనే అవకాశం ఉద్యోగికి లేదు*. ఫండ్ మనేజేర్స్ వారికి నచ్చిన ఫండ్స్ లో మన డబ్బుని పెట్టుబడి పెడతారు.
Note: Chapter 6 లో 20(2)(g) ప్రకారం షేర్ మార్కెట్ లో ఉన్న మన సొమ్ముకు ఎటువంటి గ్యారెంటీ లేదని చెప్పటం జరిగింది. అంటే మనకు నష్టం వచ్చిన ప్రభుత్వానికి గానీ ఫండ్ మనేజర్స్ కు గానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతా రాహిత్యం.
గతంలో YES బ్యాంక్ దివాలా తీయటం మనం చూసే ఉన్నాం. Axis Bank ఈ పరిస్థితికి రాదని గ్యారెంటీ లేదు.
ప్రభుత్వం GO Ms No 655, Ft:22/09/2004 ఇప్పుడు ఇస్తున్న 10% మాచింగ్ గ్రాంట్ ను భవిష్యత్ లో ఒక కొత్త GO ఇవ్వటం ద్వారా 5% లేదా2% తగ్గించ వచ్చు లేదా పూర్తిగా తీసివేయవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది.
సింపుల్ గా చెప్పాలంటే....
ఇప్పుడు రిటైర్ అయిన ఒక ఉద్యోగి కి పాత పద్ధతిలో పెన్షన్ అయితే 50000 వస్తుంది అనుకుంటే, NPS లో 20000 వస్తుంది.
పాత విధానంలో మొత్తం 50000 ప్రభుత్వమే ఇస్తే, NPS లో వచ్చే 20000 లో సగం వాటా ఉద్యోగులది.
పాత విధానంలో 50000 DA, PRC లు పెరిగినపుడల్లా పెరిగి 20 ఏళ్ళ తరువాత 1 లక్ష వరకు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
NPS లో 20 ఏళ్ల తరువాత కూడా అదే ఇరవై వేలు ఉంటుంది.
కనీసం చెప్పిన 20000 కూడా గ్యారంటీ ఏమీ ఉండదు. స్టాక్ మార్కెట్ పై ఆధారపడి అది 15000 కావచ్చు, 25000 కావచ్చు.
(సిపిఎస్ పై నాకు ఉన్న అవగాహన మాత్రమే. ఇంకా అనుభవజ్ఞులైన వారిని కూడా అడగండి)
ప్రశ్న:
నేను 2 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు నల్గొండ జిల్లాలో చదివాను. తర్వాత ప్రైవేట్ గా పదవ తరగతి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ గా చదివినట్టు ప్రైవేట్ పాఠశాల వారు దగ్గరలో గల గవర్నమెంట్ హైస్కూల్ లో ప్రైవేట్ సర్టిఫికెట్ ద్వారా ఎస్ఎస్సి రాయించారు. మరి ఇప్పుడు ఖమ్మం జిల్లాకి నేను లోకల్ అవుతాను కదా!? వీలైతే వివరంగా చెప్పగలరు
సమాధానం:
4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే అది లోకల్ గా ట్రీట్ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా కొన్ని తరగతులు ఒకచోట, మరికొన్ని వేరొక చోట చదివిన సందర్భంలో ఎక్కువ కాలం ఎక్కడ చదివి యున్నారో అదే లోకల్ గా ట్రీట్ చేస్తారు. కనుక ఇప్పుడు మీకు నల్గొండ లోకల్ అవుతుందే కానీ ఖమ్మం జిల్లా కాదు