సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
ఒక DDO ఇంతవరకు తన Complex పరిధి లోని SGT teachers యొక్క PRC Arrears Bill చేయలేదు రేపు చేస్తా మాపు చేస్తా అని కాలం గడుపుతున్నాడు.. కానీ తను పనిచేసే High school వారివి ఎప్పుడో చేశాడు వాళ్లకు న్యూ scale kuda update అయింది. ఇటువంటి వారి మీద complaint చేయవచ్చా?
జవాబు:
తప్పకుండా పై అధికారులకు కంప్లైంట్ చేయవచ్చును. మరి మీరు ఎం.ఈ.వో గారికి రిటర్న్ గా PRC ఎరియర్స్ చేయలేదని ఇప్పటి వరకు ఇవ్వలేదా? ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిన బాద్యత ఆయనదే, వారు స్పందించకపోవడం విచారకరం. వారు కూడా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో బిల్ చేసేలా చూడాలి కదా! ఇప్పటికైనా ఎం.ఈ.వో కు వ్రాతపూర్వకంగా PRC ఎరియర్స్ చేయుటకు తగువిధంగా సహకరించమని. లేనట్లయితే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎం.ఈ.వో గార్లపై జిల్లా అధికారిగారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వవచ్చు
2. ప్రశ్న:
నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడను. గత నెలలో కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాను. అ ఆసుపత్రి రిఫరల్ కాదు. నాకు మెడికల్ రియ్మేంబెస్మెంట్ కి అవకాశం ఉందో లేదో దయచేసి తెలుపగలరు.
జవాబు:
Unrecognized hospital లో చికిత్స చేసుకుంటే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. జనవరి నెలలో ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలుకావడం లేదు. కనుక మీకు మెడికల్ రీయింబర్స్మెంట్ రాకపోవచ్చు.
3. ప్రశ్న:
నమస్తే నేనొక గవర్నమెంటు ఉద్యోగిని నాకంటూ ఎవ్వరూ లేరు వారసులు. కాలక్రమేణా నాకు ఏమైనా జరిగితే నా ఉద్యోగమో నాకు రావలసిన డబ్బు ఇవన్నీ ఎవరికి పోతాయి నా దూరపు బంధువులు నా తోడబుట్టినవాళ్లు పేరు పెట్టవచ్చా? వాళ్లకు వర్తిస్తుందా? ఇవన్నీ వాళ్లకు వస్తాయా? నామినీ మా అక్క పిల్లల పేరు పెట్టొచ్చా? మా అక్క పేరు పెట్టొచ్చా? దయవుంచి తెలుపగలరు
జవాబు:
ముందుగా మీరు చట్టప్రకారం దత్తత తీసుకొని తరువాత వారి పేరు సర్వీస్ రిజిస్టర్ లో మీ కుటుంబ సభ్యుడుగా నమోదు చేయించాలి. అపుడు అన్ని రకాల బెనిఫిట్స్ కు నామినీగా వారి పేరు చేయిస్తే మీ తదంతరం వారికి అన్ని వస్తాయి.
4. ప్రశ్న:
నమస్తే sir నా wife చనిపోతే నాకు కంపసేనటేవ్ ground's లో జాబ్ వచ్చింది ఇప్పటికి 5years completed, asper G.O.Ms-209 ను 2016 women's కి మాత్రమే 90days child care leaves ఉన్నాయి, But నాలాంటి single parent కి ఈలాంటి leaves ఏమయినా ఉంటాయా నాకు below 12years ఇద్దరు girls ఉన్నారు. ఏదయినా Go కానీ ఉంటే తెలుపగలరు.
జవాబు:
మగవారి అటువంటి సెలవులకు సంబంధించి ఏరకమైన జీవోలు లేవు. అర్హత గల హాఫ్ పే/ కమిటెడ్ సెలవులను వాడుకోవచ్చు.