17, ఏప్రిల్ 2021, శనివారం
15, ఏప్రిల్ 2021, గురువారం
సందేహాలు - సమాధానాలు
సందేహాలు - సమాధానాలు -
1. ప్రశ్న
ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా?
జవాబు:
అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేయించుకోవచ్చు.
2. ప్రశ్న
చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?
జవాబు:
G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.
3. ప్రశ్న
స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?
జవాబు:
డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది: 27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.
4. ప్రశ్న
ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?
జవాబు:
G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి
5. ప్రశ్న
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?
జవాబు:
ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.
6 ప్రశ్న
ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?
జవాబు:
G.O.Ms.No.52 Fin తేది: 1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు. అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.
7. ప్రశ్న
నేను SA గా పదోన్నతి పొందాను. నాకు ప్రస్తుతం 56 ఇయర్స్. GOT పాస్ అయ్యాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?
జవాబు:
మెమో.21073 తేదీ: 21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
8. ప్రశ్న
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?
జవాబు:
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ: 24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
9. ప్రశ్న
11 రోజులను కూడా సరెండర్ చేసుకోవచ్చా?
జవాబు:
జీఓ.334 తేదీ: 28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
10. ప్రశ్న
సరెండర్ కాలానికి IR చెల్లించబడతాయా?
జవాబు:
IR మాత్రం చెల్లించబడదు.