సందేహాలు - సమాధానాలు
1 ప్రశ్న:
మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా?
జవాబు:
జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాలపై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.
2 ప్రశ్న:
పాస్ పోర్టు కోసం no objection certificate ఎవరి నుండి తీసుకోవాలి?
జవాబు:
DSE కార్యాలయం నుండి NOC తీసుకోవాలి.నిర్ణీత నమూనాలో HM/MEO ల నుండి DEO ద్వారా DSE కి దరఖాస్తు చేసుకోవాలి.నమూనా దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయి.
3 ప్రశ్న:
నేను sgt గా చేస్తున్నాను. తర్వాత ssc, డిగ్రీ పూర్తి చేశాను. నాకు SA గా పదోన్నతి ఇస్తారా?
జవాబు:
జీఓ.38 తేదీ:19.11.14 ప్రకారం ఉన్నత అర్హతలు పొందిన తరువాత ssc పాస్ అయితే పదోన్నతి కి అర్హత ఉండదు.
4 ప్రశ్న:
ఐటీ లో విరాళాలు కింద ఆదాయం నుంచి ఎంత మినహాయించుకోవచ్చు?
జవాబు:
సీఎం/పీఎం సహాయనిది కి చెల్లించే మొత్తం 100% కు, అనుమతించిన మత/స్వచ్ఛంద సంస్థలకి ఇచ్చిన విరాళాలు లో 50% వరకు 80G కింద ఆదాయం నుండి మినహాయింపు లభిస్తుంది.
5 ప్రశ్న:
నేను SA క్యాడర్ లో 24 సంవత్సరంలు సర్వీసు పూర్తి చేసాను. నేను HM పదోన్నతి రిలింక్విష్ చేయలేదు. నేను 24 ఇయర్స్ స్కేల్ పొందవచ్చా?
జవాబు:
డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ ఐతే 24 ఇయర్స్ స్కేల్ పొందవచ్చు.
6 ప్రశ్న:
నేను SA ను.నేను ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ కింద సంస్కృతం చేసాను. డిగ్రీ లో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు చదివాను. నేను HM గా పదోన్నతి పొందాలి అంటే లాంగ్వేజ్ టెస్టులు పాస్ కావాలా?
జవాబు:
జీఓ.10 తేదీ:23.01.2009 ప్రకారం లాంగ్వేజ్ టెస్టులు పాస్ కావాల్సిన అవసరం లేదు.
7 ప్రశ్న:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా?
జవాబు:
వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.
8 ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా?
జవాబు:
అవకాశం లేదు.
9 ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి?
జవాబు:
CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
10 ప్రశ్న:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహించటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి?
జవాబు:
ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.
11 ప్రశ్న:
నేను, మరొక టీచర్ ఇద్దరం ఒకేసారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము. HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్?
జవాబు:
Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు. వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.
12 ప్రశ్న:
కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా?
జవాబు:
ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.
13 ప్రశ్న:
ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు. అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు. ఇస్తారా?
జవాబు:
ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవులో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.
14 ప్రశ్న:
అర్ధ జీతపు సెలవు ఎన్ కాష్ మెంట్ ఎలా?
జవాబు:
జీఓ.148 తేదీ:21.8.2017 న ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రిటైర్మెంట్ అనంతరం ఎరెoడ్ లీవ్ మరియు అర్ధ జీతపు సెలవు కలిపి 300 రోజులకి ఎన్ క్యాష్ చేసుకోవచ్చు.