LATEST UPDATES

20, జూన్ 2020, శనివారం

ఏమంటిరి ఏమిచేసితిరి - రచన షేక్ రంజాన్

ఏమంటిరి ఏమిచేసితిరి - రచన షేక్ రంజాన్

ఏమంటిరి ఏమిచేసితిరి
     ................ ...............
ఉద్యోగులు స్నేహితులంటిరి
కాంట్రాక్టు    ఉండదంటిరి
RTC     ప్రభుత్వమంటిరి
కాళ్లలో ముళ్ళు పళ్లతో తీసుడే నంటిరి 

        ఏమంటిరి ఏమిచేసితిరి

లక్షల  ఉద్యోగాలంటిరి
నిరుద్యోగం  ఉండదంటిరి
కార్మికులకు అండనంటిరి
కన్నీళ్లు   ఉండవంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి

విద్య   ఉచితమంటిరి
ఊరూరా   వైద్యమంటిరి
ఇంటింటికి  నల్లానంటిరి
రైతు ఆత్మహత్యలు ఉండవంటిరి

       ఏమంటిరి ఏమిచేసితిరి

మూడెకరాల భూమంటిరి
దున్నేవానిదే    భూమంటిరి
లక్షల    నాగళ్లంటిరి
లక్షలమందికి  ఉపాధి అంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి

ఆంధ్రోడి    పాలనంటిరి
మన భూములు మనవంటిరి
మన నీళ్లు   మనవంటిరి
సస్య   శ్యామలమంటిరి

         ఏమంటిరి ఏమిచేసితిరి

కాగితపు  ముక్కనంటిరి
ఫైరవీలు  ఉండవంటిరి
రోడ్లు   ఎక్కనీయనంటిరి
ధర్నాలు   ఉండవంటిరి
మన హక్కులు మనవంటిరి

        ఏమంటిరి ఏమిచేసితిరి


రచయిత :-షేక్ రంజాన్

17, జూన్ 2020, బుధవారం

సైనికులకు జోహార్లు - రచన శ్రీ తాటిపాముల రమేష్

సైనికులకు జోహార్లు - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴  సైనికులకు జోహార్లు 🌴

1.  సాయుధ పోరాట పౌరుషం
నాన్న నూరిపోసిన దేశభక్తి
తెలంగాణ తెగువను పుణికిపుచ్చుకొని
కలల స్వప్నం కోసం సైన్యంలో చేరి
కరేజ్ ని చూపించి కల్నల్  గా ఎదిగిన
 సంతోష్ బాబు నీకు జోహార్లు
2.   శత్రువులకు సింహ స్వప్నమై
పగోని గుండెల్లో                                 
రైల్లు పరిగెత్తించిన యోధుడా
జగడానికి జంకని ధీరుడా
అనుకున్నోళ్ళకు ఆప్త మిత్రుడా
కరోనా ను వదిలి ప్రపంచాన్ని
కష్టాల పాల్జేసిన చిలిపి చైనా
కుహానా రాజకీయాలతో
డ్రాగన్ దొంగ దెబ్బ కు ఎదురొడ్డి
పోరు సల్పిన సైనికుడా
భారతమాత ఒడిలో ఒరిగిన
వీరుడా జోహార్లు
3.  బార్డర్ లో బాధ్యతలతో తరించి
దేశం కోసం , భరత జాతి కోసం
కంటికి నిద్ర లేక, కాలికి విశ్రాంతి లేక
నిరంతరం శ్రమించిన వీరులు
జాతి మొత్తం ప్రణమిల్లు తుంది
మీ తెగువ ముందర
మీ కీర్తి, యువతకు స్ఫూర్తి
భౌతికంగా దూరమైనా
మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతరు
వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు
(తూర్పు లద్దాఖ్ లో మరణించిన భారత సైనికులకు నివాళి తో)
------------------‐-------------------------
✍✍✍తాటిపాముల రమేష్ (టీచర్)
ZPHS WARDHANNAPET
WGL(R)

15, జూన్ 2020, సోమవారం

పదండి ముందుకు పదండి - రచయిత షేక్ రంజాన్

పదండి ముందుకు పదండి - రచయిత షేక్ రంజాన్

పదండి ముందుకు పదండి
...................................

పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

భగత్ సింగ్ వలె
పిడికిలి బిగించి
అల్లూరి సీతారామరాజు వలె
గుండెను చూపి
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

ఆజాద్ చంద్రశేఖర్ వలె
మీసం  తిప్పి
కొమరం భీం  వలె
తుపాకీ ఎక్కుపెట్టి
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

రుద్రమదేవి వలె
ఖడ్గం చేబూని
చాకలి ఐలమ్మ వలె
రోకలి బండ పట్టి
రజియా సుల్తానా వలె
సై అంటూ
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

అసిఫుల్లాఖాన్ వలె
ధీరత్వమును చూపుతూ
మంగళ్ పాండే వలె
పౌరుషం చూపుతూ
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

జ్యోతి రావ్ పూలె వలె
సామజిక ఉద్యమకారుడిగా
భీమ్ రామ్ అంబేద్కర్ వలె
విప్లవ యోధుడిగా వేగుచుక్క లాగా
పుచ్చలపల్లి సుందరయ్య వలె
పోరాట యోధులుగా ప్రజాసేవే పరమావధిగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం


ఝాన్సీ  లక్ష్మీ బాయి వలె
ఖడ్గం తిప్పుతూ
అరుణా అసఫ్ అలీ వలె
నాయకత్వంతో, ప్రగతి పథంతో
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

సావిత్రి బాయి పూలె వలె మడమ తిప్పని ధీశాలిగా 
బేగం  హజ్రత్ మహల్ వలె
యోధురాలుగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

కాళోజి నారాయణ వలె
ధిక్కార స్వరంతో
శ్రీ రంగం శ్రీనివాసరావు వలె
చెమట చుక్కవై మరో ప్రపంచపు దిశగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

దాశరధి కృష్ణమాచార్యులు వలె
కలంకు పదును పెట్టి
మగ్దూం మొహిద్దీన్ వలె
కలమే పోరాటం లాగా
సురవరం ప్రతాప్ రెడ్డి వలె
కలమే ఆయుధంగా
పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

పదండి ముందుకు పదండి
నియంతృత్వ పాలన విముక్తి కోసం

పదండి ముందుకు పదండి


రచయిత :-షేక్ రంజాన్

8, జూన్ 2020, సోమవారం

ఆశల అలలు ఆవిరైనయ్ - రచన శ్రీ తాటిపాముల రమేష్

ఆశల అలలు ఆవిరైనయ్ - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴ఆశల అలలు ఆవిరైనయ్ 🌴
1 .స్వరాష్ట్రం కై
ఆటనైనం, పాటనైనం
దరువు వేసే డప్పు నైనం
సడక్ బంద్ నుండి
సకల జనుల సమ్మె వరకు
పిడికిలేత్తినం
దిక్కులు పిక్కటిల్లేలా గర్జించినం
2. బంగారు తెలంగాణలో
ఉద్యోగుల బతుకులు
బాగుంటయ్ అనుకుంటే
ఆశల అలలు ఆవిరైనయ్
ఇచ్చిన హామీలన్నీ అటకెక్కినయ్
చేసిన బాసలన్నీ నీటిమీద రాత లైనయ్
3. కరోనా కల్లోలం తో
సంచిలోకి సగం జీతం రాబట్టే
EMI, ఇంటి ఖర్చులకు సరిపోక బట్టే
అమ్మ హార్ట్  పేషెంట్,                         నాన్న కు కాళ్ళనొప్పులు
మందులకు మనీ లేక తిప్పలైతాంది
తెచ్చిన అప్పులు కుప్ప లై
బతుకు సుడిగుండమై
సరస్వతి పూలు రాల బట్టే
4.    సబ్బండ వర్గాలను
సంబర పెడుతున్న సర్కారు
సంక్షేమ పథకాలను              సామాన్యులకు చేరవేసే చిరుద్యోగుల వైపు
కన్నెత్తి చూడట్లేదు, పల్లెత్తి మాట్లాడట్లే
5.  మర్లబడటం  మరిచిపోయినం
పౌరుషాలన్నీ లాకర్ల పెట్టినం
నమ్ముకున్న సంఘనాయకులు
సొంత పనులను చూసుకుంటున్రు
సమస్యల తోరణాన్ని సాధించడానికి
సిద్దాంతాలను సిగలో చెక్కి
యూనియన్ల విభేదాలను  గట్టునపెట్టి
వేతన జీవులు మరొక్కసారి రోడ్డెక్కాలి
మన ఐక్యతను ఎరక జెయాలే
----------------------‐-----------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

4, జూన్ 2020, గురువారం

మారిందన్నారు ఏం మారింది - రచన షేక్ రంజాన్

మారిందన్నారు ఏం మారింది - రచన షేక్ రంజాన్

మారిందన్నారు ఏం మారింది
........................................

మన మట్టి గొప్పదన్నాడు సోక్రటీస్
మనం మట్టి కాదోయ్
మనుషుల మన్నాడు గురజాడ
మట్టిని మతముతో అలుకుతుంటిరి

     మారిందన్నారు ఏం మారింది

రాజ్యాంగమును రచించిన
ప్రపంచ మేధావిని ఒక వర్గ మంటిరి
బ్రిటిష్ వారి తొత్తులను
మహాత్ముని చంపిన వాడిని
దేశ భక్తులంటుంటిరి

      మారిందన్నారు ఏం మారింది

గో మూత్రం  అమృతమంటిరి
ఎవరు  త్రాగరైతిరి
మాంసం  తిననంటిరి
వ్యాపారం  చేస్తుంటిరి
మతాలు మధ్య చిచ్చు పెడితిరి


      మారిందన్నారు ఏం మారింది

నీతి నిజాయితీ ధర్మం  న్యాయం
పాటించిన   వాడిని
దేశ    ద్రోహులంటిరి
ఎమి  పాటించని వాడిని
దేశ   భక్తులంటిరి

మారిందన్నారు ఏం మారింది

మతంగురించి  మాట్లాడేవాడిని
దేశ       భక్తుడంటిరి 
ప్రజల గురించి మాట్లాడేవాడిని
దేశ   ద్రోహులంటిరి


మారిందన్నారు ఏం మారింది

రచయత :-షేక్ రంజాన్

29, మే 2020, శుక్రవారం

ఐనా నాకేంటి - రచన షేక్ రంజాన్

ఐనా నాకేంటి - రచన షేక్ రంజాన్

ఐనా నాకేంటి
--------------------
కార్మిక చట్టాలు  రద్దు చేసిన
పని గంటలు    పెంచిన
వలస కూలీలు   నడిచిన
ఆకలితో       మరణించిన
             
                 ఐనా నాకేంటి

PRC   మాటెత్తకపోయిన
IR        రాకపోయినా
ప్రమోషన్స్  ఇవ్వకపోయినా
DA        లేకపోయినా
CPS    రద్దు కాకపోయినా
సగం   జీతాలు ఇచ్చినా
    
              ఐనా నాకేంటి

విద్యార్థులు  ఆహుతి ఐనా
యూనివర్సిటీలు  ప్రైవేట్ పరమైన
క్యాంపస్ లో   దాడులు జరిగిన
నిరుద్యోగులు రోడ్డున పడినా
 
            ఐనా నాకేంటి

నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన
పెట్రోల్ డీజిల్ రేట్లు  పెంచిన
రైతు పంటకు  ధర లేకపోయినా
ఆత్మ హత్యలు చేసుకున్న

           ఐనా నాకేంటి

రక్షణ రంగం   విదేశీలకు
రైల్వే  విమానాలు ప్రైవేట్ పరం
విద్య వైద్యం  కార్పొరేటర్లకు
బ్యాంకులు   విలీనాలు

              ఐనా నాకేంటి

జడ్జీలకు   పదవులు
అధికార్లకు  కోట్లు
పారిశ్రామిక వేత్తలకు  కోట్లు రద్దు
డబ్బు  దోచుకున్నోడు  పరదేశి

             ఐనా నాకేంటి

రచయత :-షేక్ రంజాన్
✊️✊️✊️✊️🙏🙏🙏🙏🌹🌹🌹

సుందర బృందావన - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

సుందర బృందావన - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

సుందర బృందావన మధ్యమున,/ సుందరి గోపిక సర్వం మరచి, మైమరచి!/ రమణీయ పూబాలలతో అతి రమ్యముగా,/ మనోమందిరంలో కొలువైన మోహనాంగుడి,/ ఊసులు లీలలు మనోహరంగా సన్నుతించు వేళ,/ మధుర మురళీగానం అలకింప!/ వేంచేసేను వేగిరముగా మోహనకృష్ణ!!/ సమ్మోహనా గానంతో సకలం పరవశింప!/ ముదిత కన్నులు ప్రేమకాంతులు ప్రసరించగా!/ చెక్కిలి లేలేత భానుడిలా ఎరుపెక్కగా!/ కోమలి ముదముతోడ మురిపెంగా!/ మధురభక్తిని కమనీయంగా సమర్పించెను!!!   - ప్రవీణ్ కుమార్ వేముగంటి.   26/05/2020, 13:25, మంగళవారం.

సమరభేరిని మోగించాలి - రచన శ్రీ తాటిపాముల రమేష్

సమరభేరిని మోగించాలి - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴సమరభేరిని మోగించాలి🌴
1. జగతిలో సగమై
    సృష్టికి మూలమై
    ఎవరెస్టు శిఖరం ఎక్కినా
    అంతరిక్షంలో అడుగుపెట్టినా
    అన్ని రంగాల్లో రాణించినా
    ఏమిటీ గృహహింస
.   ఎందుకీ చిత్రహింస
2. నాగరిక సమాజంలో
     అనాగరిక చేష్టలతో
     చిగురుటాకులా వణుకుతుంది
     మానవ మృగాల చేతిలో
     చిన్ని జీవితం చితుకుతుంది
3.  పురుషాధిక్యత   పడగ నీడలో
      చీదరింపులు, బెదిరింపులతో
      సమానత్వం కరువాయె
       మనసంతా బరువాయే
       ప్రజాస్వామ్యంలో పవరొస్తే
       పేరేమో నీదాయే
       అధికారం వాల్లదాయే
       అమ్మ కాల కోసం    
       ఆట బొమ్మను చేయడంతో 
       మగువ ప్రతిష్ట మసక బారుతుంది.
4.    ఉవ్వెత్తున ఉప్పెనై
        సముద్రంలో కెరటమై
        చీకట్లను చీల్చే సూర్య కిరణమై
        స్వేచ్ఛ వాయువుల కోసం
        వివౕక్ష సంకెళ్లను తెంపడం కోసం
        చీమల దండులా కదిలి
        సమర శంఖం  పూరించాలి
        సమరభేరీ ని మోగించాలి
----------‐-‐---‐------‐----------‐-'
✍✍✍ తాటిపాముల రమేష్ ,
      ZPHS  వర్ధన్నపేట .

26, మే 2020, మంగళవారం

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

కార్టూనికి కవిత - శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

లాక్డౌన్ కాలాన లక్షల సమస్యలాయే!
ఇంటి నుంచి పనాయే, ఇంట్లోనూ పనేనాయే!!
 కరోనా కాలంలో పనిమనిషి  రాకపోయే!
అర్థాంగి ఎన్నెన్నో ఆర్డర్లు వేసుడాయే!
షార్టులతోనే సాగిపొమ్మని హుకుం జారీచేసే!!
ముక్కు మూతి మూసుకొని భార్య  మాట వింటినాయే!
కాలమహిమ అని అట్లనే చేయబడితిని!!
బాసునుండి మెయిలాయే ఆఫీసుకు రమ్మని!
లాకుడవును కాలాన అలవాటైన ప్రాణమాయే!!
ఆఫీసులోన పాతపాట పాడితి హాయిగాఉందని!
హడావుడిగా బాసు వచ్చి కస్సుబుస్సులాడే !!
ఆఫీసనుకున్నావా? ఇల్లనుకున్నవా? అని చెడామడ వాయగొట్టే!
ఇటు బాసు ఆర్డరాయే, అటు భార్య హుకుమాయే!!
ముందు చూస్తే   గొయ్యాయే, వెనక చూస్తే నుయ్యాయే!
ఏమి పాలుపోక వాట్సప్పులోన మెస్సేజు పంపితినాయే!!
ప్రాణమిత్రుడొకడు వెంటనే బావురుమనే!
డోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నదని వాపోయే!!

(కార్టూనికి  కవిత)

-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
23/05/2020, 12:10, శనివారం.

25, మే 2020, సోమవారం

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా - రచన శ్రీ డా. గూటం స్వామి

☺️ మరణానికి కొంచెం దూరంగా - కొంచెం దగ్గరగా ☺️

(లాక్ డౌన్ అరవై రోజులు పూర్తైన సందర్భంగా)

ప్రభుత్వాలు చేతులెత్తేసాయ్!
ఎవరి ప్రాణం వారు కాపాడుకోవలసిందే!
"తాంబూలం ఇచ్చేసాం తన్నుకు చావండి"
ఇది నాటి అగ్నిహోత్రవదాన్ల మాట!
"లాక్ డౌన్ ఎత్తేసాం మీ చావు మీరు చావండి"
ఇది నేటి పాలకుల అంతరంగం!

కరోనాకు తాళాలు ఇచ్చేసారు
ఇక తన్నుకు చావవలసిందే!
ప్రభుత్వాలు ఆధాయాన్వేషణలో పడ్డాయి!
రైల్లు,బస్సులు, కార్లు,ఆటోలు
ఎప్పటిలాగే రోడ్లెక్కాయి!
కరోనా తో కాపురం వేగవంతమయ్యింది!

ఆహారం దొరకని పులి
ఆబగా పొంచి చూసినట్టు
మీ కోసం కార్పొరేట్ ఆసుపత్రులు
గ్రీన్ కార్పెట్ పరచి ఎదురుచూస్తున్నాయ్!
దొరికితే సున్నంలోకి
ఎముకలు కూడ మిగలవు!
మరికొన్నిరోజులుపోతే
ఆసుపత్రులేవి ఖాళీ ఉండకపోవచ్చు!

ఇకనుంచి అందరివి
అనుమానపు బ్రతుకులే!
ఇక అనుమానించడమే
నీ జన్మహక్కు అవుతుంది!
ఎవరికి కరోనా ఉందో తెలియక
సతమతమైపోవలసిందే!
నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి!

ఇకపై హెల్త్ బులెటిన్ లు ఉండకపోవచ్చు!
ప్రసారమాధ్యమాలు మన్నుతిన్న పాములౌతాయి!
నాయకుల మాటలు కోటలు దాటతాయి!

ప్రాణంపోతే తేలేము!
అప్రమత్తంగా లేకపోతే మనలేము!
చావో బ్రతుకో మీ చేతిలోనే!
మరణానికి కొంచెం దూరంగా
మరి కొంచెం దగ్గరగా అంతే!

ఇది కరోనా కాలం!
మీ తలరాతలు మారి'పోయేకాలం'!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️☺️

24, మే 2020, ఆదివారం

వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


వలస కూలీల వెతలు - రచన శ్రీ తాటిపాముల రమేష్🌴 వలస కూలీల వెతలు 🌴
1. పేదరికమే శాపమై
బతుకే జీవిత పోరాటమై
పనినెతుక్కుంటూ పట్నం పోయి
రెక్కలు ముక్కలు గా చేసి
ఆకాశ హార్మ్యాలను నిర్మించినం
రోడ్లన్నీ అద్దాలు గా మార్చినం.
2. ఇప్పుడు నగరం నడిబొడ్డున మీరు
మురుగు కాలువ పక్కన మేము
ఏసీ గదుల్లో  మీ విలాసాలు
దొడ్డు దోమలు దద్దుర్ల తో మా జీవితాలు
సెంటు బట్టలు మీవాయే
చినిగిన బట్టలు మావాయే
పరమన్నాలు మీవాయే
పాశిఅన్నం, పచ్చడి మెతుకులు మావాయే
3.  మా చెమట చుక్కలు చిందించి
 మీ వీధులన్నీ వెలుగుపూలను పూయించాము.
కరెంటు కాంతులు మీకాయే
గుడ్డి దీపం మాకాయే
మా రక్తాన్నంతా దారవోసి
మీ అభివృద్ధిలో అరిగిపోయినం.
4.  కరోనా కల్లోలం తో
రెక్కలు తెగిన పక్షులైనం
చేద్దామంటే పని లేక
చేతిలో పరక లేక
కాళ్ళు కాళ్ళు కొట్టుకుంటూ
ఎర్రటెండలో పల్లె బాట పట్టినం
మీకు కనికరం లేదు
తొంగి కూడా చూడట్లే  తోపుగాళ్ళు
కన్నెత్తి చూడట్లే  కోట్లున్నోళ్ళు
పల్లెత్తి మాట్లాడట్లే పాలకులు
పాస్ పోర్ట్, వీసాల తో
పెద్దోళ్లు తెచ్చిన రోగానికి
పేదోళ్ళం బలైనం.
--------------------------------------‐-------
✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

23, మే 2020, శనివారం

ఆటవెలది పద్యం - 5 - రచన శ్రీమతి యం. రమ

ఆటవెలది పద్యం:

చెంతచేరనీకు చెడ్డయాలోచనా
చేరుగమ్యమందు చేటుచేయు
ఆకులలములన్ని యడ్డుగావచ్చినా
సవ్యమార్గమెంచి సాగునదులు.
 -యం. రమ


నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

నాకొక పాట కావాలి - రచన శ్రీ డా. గూటం స్వామి

💐 నాకొక పాట కావాలి  💐
*********

నేను పాడుకునేందుకు
ఒక పాటకావాలి!
ఆ పాటలో కథం తొక్కించే
భాష ఉండాలి!
ఆ పాటలో ఉత్తేజపరిచే
పదాలు ఉండాలి!
యుగళ గీతంలా కాదు
యువకుల నెత్తురు మండేలా ఉండాలి!

నేను పాడుకునేందుకు
 ఒక పాట కావాలి!
ఆ పాటలో ఉప్పెంగే
సముద్రముండాలి!
వసంత కాల మేఘగర్జన ఉండాలి!
పర్వత శిఖరాల్ని తాకే
జలపాతాలుండాలి!
నెలవంకను తెంపుకొచ్చే తెగువుండాలి!

నేను పాడే పాటలో చరణాలు
జనరక్తంలో తడిసిన ఎర్రగులాబీలు!
ప్రజాస్వామ్య ముసుగులో
భ్రమలకు గురిచేస్తున్న భావాలు!
.అసత్యాలతో పబ్బం గడుపుతున్న
పాలకుల నీతిబాహ్యా చర్యలు!
దోపిడీ జలతారు ముసుగులో
సామాన్యుల కన్నీళ్ళను తాగే చర్యలు!
ఇవి మాత్రమే ప్రస్ఫుటించాలి!

పాటతోపాటు ఒక
ఆయుధం కూడా కావాలి!
ఆయుధం తో పాటు
ఉక్కులాంటి గుండె కూడా కావాలి!
రాజ్యాధికార కుంభస్తలంపై కొట్టాలి!

కష్టాలు కడతేర్చి కన్నీళ్లు తుడిచేసి
బాటసారులకు నేను భరోసా నవ్వాలి!
నెత్తురోడుతున్న రోడ్ల పై నిలబడి
మృత్యువు దాడిచేయకుండా రక్షణైపోవాలి!

నేను పాడుకునేందుకు
ఒకపాటకావాలి!
పసిపాపల మోములో
మొగ్గనై విరియాలి!
వలస బ్రతుకులకు
నేను రాగమైపోవాలి!
అనురాగమై మురియాలి!!

డా.గూటం స్వామి.
(9441092870)
👍👍👍👍👍👍👍👍

22, మే 2020, శుక్రవారం

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

ఆమె - రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴ఆమె  🌴
1.  మూడు ముళ్ళు, ఏడడుగుల
 బంధంతో ఒక్కటైన జంట
 పట్టుమని పది వసంతాలు గడవకుండానే
 మద్యం మహమ్మారి
  పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది
2.  ఇంటి పని ,వంట పనితో
నడుము వాల్చకుండా
రాత్రి దాకా మిషన్ లాగా
ఇకమత్ గా ఇంటినంత ఈడ్చు కొస్తుంటే
తాగొచ్చి తందనాలు ఆడుతుంటే
ఆమె ఆత్మాభిమానం ఆవిరై
కలలన్నీ కరిగి పోయి
దిగులు పక్షిలా దిగాలుగా చూస్తుంది
3.   సిక్స్ అయితే సీనే మారిపోయి
ఇరుకు ఇంట్లో వీరంగం మొదలెడితే
ఇంటి గుట్టు రట్టు కాకుండా
 పదిమందిలో పలచన కాకుండా
 కండ్లల్లో ఉబికి వచ్చిన ఊటను
 పైట కొంగుతో తూడ్చుకుంటూ
 పిల్లల కోసం బతుకుతుంది
4.  కాయకష్టం చేసుకొచ్చి
కంచం లోకి అందించి
ప్రేమనంతా గంపల కొద్దీ కుమ్మరించినా
సూటీ పోటి మాటలతో
శూలాలను మనసులో గుచ్చుతుంటే
ఆమే పస్తులున్న రాత్రులెన్నో
నిద్రపోని రోజులెన్నో
5. పని లేదని ఒకరు
ఊసుపోత లేదని మరొకరు
కాటన్ల కొద్దీ గుంజుతున్రు
సర్కారీ ఖజానా నింపుతున్రు
రాబడికి మరిగిన పాలకులు
ప్రజల పాణాలను గాలికొదిలిన్రు
6. చట్టాలెన్ని తెచ్చినా
హెల్ప్ లైన్లు ఎన్ని వచ్చినా
ఆమె రాత మారట్లేదు
ఆమెను కష్టపడితే కాళిమాతై
కన్నెర్ర జేస్తుంది
 లవ్ లీ గా చూసుకుంటే
లక్ష్మీ దేవతై వరములిస్తది
---‐-‐----------------------------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHSWARDHANNAPET.

21, మే 2020, గురువారం

ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ


ఆటవెలది పద్యం - 4 - రచన శ్రీమతి యం. రమ
ఆ.వె
మెచ్చలేనినెయ్య మేలనిల్వగలదు?
స్వార్ధగుణమెయున్న సాయమగున?
కార్యదోషమున్న కలుగునాఫలితమ్ము
సత్యమరసిమెరుగు నిత్యముగను!
                     యం.రమ🙏

20, మే 2020, బుధవారం

ఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమ
ఆటవెలది పద్యం
చదువునేర్చకూడా సంస్కారమును లేక
సార్థకంబుకాదు సాధనెపుడు
విద్యవినయమున్న విద్యార్థివిలసిల్లు
విజయపథమునందు వెలుగులీను.
     - రచన శ్రీమతి యం. రమ

19, మే 2020, మంగళవారం

ఆటవెలది పద్యం - 2 - రచన శ్రీమతి యం. రమ

ఆ.వె. పద్యం:
కల్మషమ్ములేక కమనీయమవు మాట
యెంతవారినైన శాంతపరచు
కఠినమాటలాడు కర్కశులమదికి
వందనములెవేయు బంధనములు
-శ్రీమతి ముంజ రమ.

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

శ్రీరామ భక్తాగ్రేసరా రామదూత హనుమా!!
మా ప్రార్థనలను ప్రీతితో స్వీకరించుమా!
మా మొరలను ముదముతో ఆలకింపుమా!
అంజనీపుత్ర అమేయ గుణసంపన్న హనుమా!!
మాకు సద్భుద్ధి సతతం ప్రసాదింపుమా!
మాకు సన్మార్గం సత్వరమే చూపుమా!
వాయునందనా మహాబలశాలీ హనుమా!!
మా ఆరోగ్యాలను సదా రక్షింపుమా!
మా భయక్రోధాలను నిత్యం నివారింపుమా!
సుగ్రీవమిత్ర వినయవిధేయ హనుమా!!
మా శోకకారకాలను శీఘ్రముగా నివారించుమా!
మా మనోవ్యాకులతను మమతతో మట్టుబెట్టుమా!
భక్త సులభానుగ్రహ భక్తశ్రేష్ఠ హనుమా!!
మాకు సద్గుణాలను సదా సిద్దింపజేయుమా!
మాకు లక్ష్యసాధనా మార్గమ్మును హితముతో బోధింపుమా!
లక్ష్మణ ప్రాణరక్షకా లంకపురి దహన హనుమా!!
మా విజయాతిశయములను  మమతతో త్రుంచుమా!
మాకు వినయ విధేయతలను విస్తృతంగా అందింపుమా!
రుద్రాంశ సంభూత భవిష్యత్తు బ్రహ్మా హనుమా!!
నీదు కీర్తనములే  మా సకల సంకట హరణం హరణం!!
నీదు నామమే అనవరతము మాకు శరణం శరణం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
(వైశాఖ బహుళ దశమి, హనుమజ్జయంతి సందర్భంగా)
17/05/2020, 13:20, ఆదివారం.

18, మే 2020, సోమవారం

కార్మికుడా ఓ కార్మికుడా - రచన షేక్ రంజాన్


కార్మికుడా  ఓ  కార్మికుడా - రచన  షేక్  రంజాన్
🚩కార్మికుడా  ఓ  కార్మికుడా🚩
................................

బ్రతుకు దెరువు కోసము
ఊరూరు  తిరుగుతావు
కాయ కష్టము చేసి
నాలుగు పైసలు సంపాదించి
పూట పూటను గడుపుతావు
               ~కార్మికుడా ఓ కార్మికుడా ..

పిల్ల పాపలను చంకనేసుకొని
పొట్ట కూటి కోసం  వలస వెళ్ళితివి
ప్యాక్టరీలు పరిశ్రములు నడిపించి
రైతన్నకు తోడైతరి
దేశాభిరుద్దిలో భాగమైతిరి
        ~ కార్మికుడా ఓ కార్మికుడా ..

విత్తు విత్తేది  పంటకోసేది
లోడు ఎత్తేది  లోడు దించేది
రోడ్లు వేసేది  బిల్డింగ్ కట్టేది
రాళ్లు కొట్టేది  శిల్పం చెక్కేది
ఇనుమును కరిగించేది  ఆయుధం తయారు చేసేది
ఐన నీవు పేదవాడివి
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

పని మనిషివి  తోటమాలివి
జీతగాడివి గుమస్తవి
పారిశుద్దివి  కాపలాదారుడివి
రోజు కూలివి  సహాయకారివి
ఇంటి నుండి గెంటివేసిరి
       ~కార్మికుడా ఓ కార్మికుడా..

ఉండటానికి ఇల్లు లేదు
తింటానికి  తిండిలేదు
త్రాగటానికి నీళ్లు లేవు
కట్టుకోవటానికి బట్ట లేదు
కాళ్లకు చెప్పులు లేవు
నిద్రవస్తే బండరాయినీకు పరుపు
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

యజమానులు  పెత్తందార్లు
కాంట్రాక్టర్లు  కమిషన్లదార్లు
MLA లు    MP లు
మంత్రులు , ముఖ్యమంత్రులు ,
ప్రధానమంత్రి ,రాష్ట్రపతి
మీదెగ్గరకు  రాకపాయ
మీ గోస వినరాయా చూడరాయ
        ~కార్మికుడా ఓ కార్మికుడా ...

నీ నడకకు  నీ కన్నీటికి
నీ దాహంకు  నీ ఆకలికి
నీ కష్టాలకు  నీ హింసకు
నీ చావుకు  కారకులెవరు
కారకులెవరు  కారకులెవరు
        ~కార్మికుడా ఓ కార్మికుడా ..

నీలో ఉన్నది   ఆయుధం 
ఆ ఆయుధమే   ఓటు
నీ ఓటే   నీ జీవితాన్ని మారుస్తుంది  మారుస్తుంది
మారుస్తుంది  మారుస్తుంది
       ~ కార్మికుడా ఓ కార్మికుడా ..
✊️✊️✊️✊️✊️✊️✊️    

రచయిత.....
     షేక్  రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

ఆటవెలది పద్యం- 1 - రచన శ్రీమతి యం. రమ

ఆ.వె
కాయకష్టమోర్చి కన్నబిడ్డలపెంచి
చదువుసంధ్యలందు చక్కదిద్ది
వెలుగునీడలయ్యి వెన్నంటిగెలిపించె
తల్లిదండ్రిమనకు దైవమిలన.🙏
                   శ్రీమతి   యం.రమ.

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

ఇక అదేగా మిగిలింది! - రచన శ్రీ డా.గూటం స్వామి

☺️ ఇక అదేగా మిగిలింది! ☺️
*********
ఇప్పుడు రాత్రి పగలు
ఒక్కలాగే కనిపిస్తున్నాయి!
జీవితంలో ఒక మెరుపూ లేదు!
భవిష్యత్తు ను గూర్చిన భరోసా లేదు!
ఆలోచనలు చుట్టుముడుతున్నవేళ
అనునిత్యం అన్వేషిస్తున్న సమయాన
విహ్వలత తప్ప విహారాలు కొరవడ్డాయి!

ఏభైమూడురోజులు
లాక్ డౌన్ నేర్పిన పాఠంలో
తిరిగి చూసుకుంటే సాదించిందేమి లేదు!
అన్నీ సాధించానని కాలరెగరేసిన మనిషి
కరోనా ముందు బోర్లపడ్డాడు!

ఈ సమస్యకు పరిష్కారం దొరకని పాలకులు
రాయితీల రొట్టెముక్కలు విసిరి
పంచుకోమంటూ తమాషా చూస్తున్నారు!

అవి తమవరకు రావని తెలిసినా ప్రజలు
గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారు!
చేవ చచ్చిన యువత
సెల్ ఫోన్, ల్యాప్ టేప్లతో
కాలక్షేపం చేసేస్తున్నారు!
రేపటికి ఉంటామో,లేమో తెలియని మనిషి
కలల లోకం లో విహరిస్తున్నాడు!

రాజకీయ ఆటలో జోకరౌతున్న మనిషి
కరోనా కాటుతోనైనా బుద్ధి తెచ్చుకుంటే సరి...!
లేకపోతే కాలమే సమాధానం చెబుతుంది!
ఇక అదేగా మిగిలింది!!

డా.గూటం స్వామి
(9441092870)
☺️☺️☺️☺️☺️☺️☺️

17, మే 2020, ఆదివారం

మనిషి నువ్వు మారాలి - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

 మనిషి నువ్వు మారాలి - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
* మనిషి నువ్వు మారాలి*
ఆవు సాధుత్వం, పులి క్రూరత్వం!
నక్క కపటత్వం, కుక్క నమ్మకత్వం!
మరి మనిషి గుణం చెప్పగలమా!?
పుస్తకం మీద శీర్షికను చూస్తే జ్ఞానం వస్తుందా?
వండిన పాయసం చూస్తే రుచి తెలుస్తుందా?
అవసరం వచ్చినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు!
మనస్సు పొరల్లో దాగున్న రాక్షసత్వం,
లావా లాగా పైకి విరజిమ్ముతుంది!
నకారాత్మక భావాలు, వికృత ఆలోచనలు,
అణు విస్ఫోటనం లాగా ఎగిసిపడుతున్నాయి!!
బుద్ధి పెడదారి పట్టమని పదే పదే ప్రోత్సహిస్తుంటాయి!
ఫలితంగా నేరాలు, ఘోరాలు, దారుణాలు, అకృత్యాలు!
దోపిడీలు, దొంగతనాలు బలాత్కారాలు, తీవ్రవాదాలు!
మోసాలు, కుటిల రాజకీయ కుతంత్రాలు!
పైగా ప్రసార మాధ్యమాలలో చర్చలు!
విపరీత ధోరణులు! విశ్లేషణలు, విరుద్ధ భావాలు!
మనిషి దుర్భుద్ధి పై సిద్ధాంతాలు, సూత్రీకరణాలు!
 ఇవేవీ జరుగుతున్న దారుణాలను అడ్డుకోలేవు, ఆపలేవు!
సమాజంలో నిత్యకృత్యాలుగా, సెల్ఫీల సంబరంగా సాగుతున్నాయి!
సమసమాజ నిర్మాణానికి, శాంతిసమాజ స్థాపనకు!
మనిషిగా నువ్వు మారాలి, నీ ప్రతికూల భావాల్ని తుంచాలి!
నీ మదిలో అనుకూలభావాలకు అంకురార్పణ జరగాలి!
నువ్వు అమ్మలాగా మారాలి, అలా ఆలోచించాలి!
అందరినీ ఆదరించాలి, ప్రేమించాలి!
ప్రతివ్యక్తిని అమ్మ మనస్సుతో చూడాలి!
పలువిధాల దారుణాలకు ముగింపు పలకాలి!
అప్పుడే మనిషిలో ప్రశాంత చిత్తం!
అప్పుడే లోకంలో శాంతి సుస్థిరత్వం!!
అప్పుడే లోకంలో సమసమాజ స్థాపనం!
అప్పుడే సమస్త జగత్తు సుఖవంతం!!
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
16/05/2020, 11:20, శనివారం.

15, మే 2020, శుక్రవారం

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

వైశాఖ మాసం సందర్భంగా - రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

మాధవ, మధుసూధన, నారాయణ!
నీ దర్శన భాగ్యఫలం చేత,
నా అజ్ఞాన పొరలు అంతరించే.
నీదు నామజప మహిమ తోడ,
నా పాపములన్నీ పటాపంచలయ్యే.
అనవరతము నిను కొలుస్తూ,
నీ రూపమే అపురూపంగా హృదిలో నిలుపుతూ
నీ అర్చనే నా జీవనముగా భావిస్తూ,
నా జీవితానికి నీవే దిక్కని నమ్ముతూ,
సదా నీ నామ స్మరణే నాకు శరణం!
నన్ను సంస్కరింప రావా!
అచ్యుతా, కేశవా, జనర్ధన!!
(వైశాఖ మాసం సందర్భంగా)

-శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
25/04/2020, 19:25

ఉత్తరాల తీగ - రచన శ్రీ డా.గూటం స్వామి


ఉత్తరాల తీగ - శ్రీ డా.గూటం స్వామి
💐 ఉత్తరాల తీగ 💐
********

ఇది ఇనుప వస్తువు కాదు
అదొక జ్ఞాపకాల మాల!
తలపుల దొంతర్లను
తన గుండెల్లో గుచ్చుకునే
అపురూప చెలికాడు!

గతంలో ప్రతి ఇంట ఉత్తరాల తీగకు
ఉత్తరాలు గుత్తులుగా పూసేవి!
ఆప్యాయతా పరిమళాలు వెదజల్లేవి!
అందంగా పలకరించేవి!
బంధుత్వాలను పెంచేవి!
స్నేహితులను కలిపేవి!
ఓదార్పును కలిగించేవి!
గతాన్ని కళ్ళముందు పరిచేవి

ఉత్తరాల తీగ ఒక గ్రంథాలయమే!
తాత అమ్మకు రాసిన ఉత్తరం
నాన్న నాయనమ్మకు రాసిన ఉత్తరం
అమ్మ నాన్న ల పెళ్ళికార్డు
ఉత్తరాల తీగలో పదిలం!!

అదొక పురాతన ఆత్మీయ నిధి!
ఒంటరి జీవుల పాలిట పెన్నిధి!
గత చరిత్రకు సాక్షీభూతి!

నేడు ఉత్తరాలు లేవు
ఉత్తరాల తీగలు లేవు!
రాసే తీరుబడి లేదు
చదివే ఓపిక లేదు!
సెల్ ఫోన్ సవ్వడులమధ్య
ప్రాణం లేని పలకరింపుల మధ్య
ఉత్తరాల తీగకు చోటెక్కడిది?
సంబంధాలు వ్యాపారమైన రోజుల్లో
ఉత్తరాలు రాసే అలవాటు ఎక్కడిది!

ఎన్ని సమాచార విప్లవాలు వచ్చినా
సామాన్యుని సమాచార సౌకర్యం ఉత్తరమే కదా!

ఈసారి మా ఊరెళ్ళినప్పుడు
అటకమీద పాత మానుపెట్టెలో
మా తాత భద్రంగా దాచిపెట్టిన
ఉత్తరాలతీగను తెచ్చుకోవాలి!
నా మూలలను ఒకసారి తడుముకోవాలి!!

డా.గూటం స్వామి
(9441092870)
💐💐💐💐💐💐💐

14, మే 2020, గురువారం

కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్


కష్టాల గుట్టలు - రచన శ్రీ తాటిపాముల రమేష్
🌴కష్టాల గుట్టలు 🌴
1. కరోనా  దెబ్బ
    బడుగు  బతుకుల మీద                                                
    పిడుగు దెబ్బ  
    ఉన్న ఉపాధి ఊడి
    చేద్దామంటే పని లేక
    చేతిలో కాని లేక
    వ్యవస్థ అవస్థ గా మారడంతో
    చేసేది  లేక ఉసురు పోసిన
    ఊరి వైపు కదులుతుండ్రు
2. చంకలో చంటి పిల్ల
    నెత్తి  మీద మూట ముల్లె
    సూర్యుడు నిప్పుల
    వర్షం  కురిపిస్తుంటే                 
    ధరణి నూనే కాగిన                            
    గంగాళంలా కాలుతుంటే                                       
    పాదాలకు పాదరక్షకాలు లేక
    కొందామంటే కొత్తలు లేక                    
    కాలిన బొబ్బలతో   
    పాదాలు అరిగే దాక 
    గమ్యం ముద్దాడే దాక
    మారథాన్ ను  సాగిస్తుండ్రు
    స్వేద  సముద్రంలో ఈదుతూ   
    అనుకోకుండా మార్గ మధ్యలోనే
    యముడి ఒడిలో  ఒరుగుతుండ్రు      
3. వాళ్లకు ఢాంబికాలు,                           
    దందాలు తెలియదు
    మాటల మధుర గుళికలు తెలుసు
    కడుపులో కల్మషాలు తెలియదు
    కాయకష్టం తెలుసు
    జేబులకు చిల్లులు పెట్టడం తెలియదు
    పెదవిపై చిరునవ్వు తెలుసు.
4.ఏడు దశాబ్దాల కాలంలో ఏలికలు
   పేదరికంపై ఎత్తిన కత్తి మొండిదైంది
   ఉపాధిపై గురి పెట్టిన                                
   బాణం ఉత్తదయింది
   బడుగుల రాత మారట్లేదు
   కష్టాల గుట్టలు కరగట్లేదు
   ఓట్లేసుకున్నోళ్ళు ఒడ్డెక్కుతుండ్రు          
   ఓట్లేసినోళ్ళు గడ్లెకలుస్తుండ్రు
   ఓటు ఆయుధం తియ్యాలి
   బడుగులను మరిచినోళ్ళకు
   వాత పెట్టాలి.
 ------------------------------‐---
 ✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

13, మే 2020, బుధవారం

ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి


ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా -శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి
ఆధునిక తత్వవేత్తలకు ఆద్యులు!
జిడ్డు కృష్ణమూర్తి తత్వ ఆధ్యాత్మికవేత్తగా విఖ్యాతులు!!
దివ్యజ్ఞాన సమాజ జగద్గురువుగా ప్రఖ్యాతి!
పలు దేశాల్లో అధ్యాత్మిక ప్రసంగాలతో ప్రశస్తి!!
జగద్గురువుగా పొందిన గౌరవాలకు ముగింపు,
అసాధారణ రీతిలో సాధారణవ్యక్తిగా జీవితం కొనసాగింపు!!
హృదయంతరాళంలో విప్లవ మథనం,
మనిషిలో సంపూర్ణ పరివర్తనా సాధనం!!
రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలు!
మానవునిలో సమూల మార్పులు తేలేని ఉపకరణలు!!
సరికొత్త ఆదర్శాలు, మతాత్మక ఆశయాలు!
మనిషి మనస్సును సంపూర్తిగా మార్చని విషయాలు!!
ఇలా ఎన్నెన్నో తత్వాలు ఎన్నెన్నో తర్కాలు,
సమస్త మానవాళిని మార్చగలిగే బోధనలు!!

అనిబీసెంటు మార్గనిర్దేశంలో ఎదిగిన పరమ జ్ఞానులు!
ప్రసిద్ధ రిషి వ్యాలీ పాఠశాల వ్యవస్థాపకులు!
తెలుగునేలపై ఉద్భవించిన ఉషస్సు!
భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన తేజస్సు!!
ప్రపంచవ్యాప్తంగా తన తత్వాలలో చిరంజీవిగా యశస్సు!!!
(ప్రముఖ తత్వవేత్త , అధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
12/05/2020, 18:30, మంగళవారం.

పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది! - రచన శ్రీ డా.గూటం స్వామి

😢పట్నం పొమ్మంది!పల్లె రమ్మంది!😢
********

ఎర్రని తూర్పు వాకిలి‌లో నిలబడి చూస్తే
పచ్చని మా పల్లె కనబడుతోంది!
మా పల్లె పక్కనే ఏరు కనబడుతోంది!
ఏటిఒడ్డన మా వాళ్ళ పాట వినబడతోంది!
మమ్మల్ని పంపండి సారూ!మేముండలేం ఇక్కడ!
ఎన్నాళ్ళు మాకీ చిత్రహింస!

బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన వాళ్ళం!
ఇప్పుడు మా బ్రతుకులు చిధ్రం అయ్యాయి!
తింటానికి తిండి కరువయ్యాక
ఇక్కడెలా ఉత్తినే ఉంటాము సారూ!
మమ్మల్ని మా ఊరికి పంపేయండి!
ఎన్నాళ్ళు మాకీ గుండెకోత!

ఇప్పుడు మా బతుకులు
నెత్తురు ముడుగులు!
ఇప్పుడు మా జీవనం
కన్నీటి కడలి తరంగం!
ఇప్పుడు మా ఆలోచన లు
గురితప్పిన గుళకరాళ్ళు!
ఇప్పుడు మా ముందున్నదంతా రక్తసిక్త జీవితం!
ఇప్పుడు మా మార్గమంతా అపజయాల వ్రణాలే!
ఇప్పుడు మా పోరాటమంతా
రేపటిని లోతుగా తవ్వుకోవడం కోసమే!

కాలం ప్రవహిస్తూనే ఉంటుంది!
కాలం పురోగమిస్తూనే ఉంటుంది!
మా వలసకూలీలు మాత్రం
ఇక్కడే ఆవిరైపోవాలా సారూ!

సూర్యాస్తమయాలు ఎప్పుడూ
ఎర్రగానే ఉంటాయి!
ఈ మధ్య సమయంలోనే
జనం పదునెక్కుతారు!
ఎర్రటి తూర్పు వాకిట్లో నిలబడి చూస్తే
పల్లె దిక్కు కనబడుతోంది!
ఇక తెగించటమే తరువాయి!

(లాక్ డౌన్ నేపథ్యంలో వలసకూలీల పాట్లు టి.వి లో చూసి వారి మనో వేదనను కవిత్వీకరించే ప్రయత్నం లో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢😢😢

12, మే 2020, మంగళవారం

వలస విలాపం! - రచన డా.గూటం స్వామి

😢  వలస విలాపం! 😢
**********************
వలసకూలీల
సర్కాస్ ఫీట్లు చూసి
మానవత్వం సిగ్గుతో చచ్చిపోయింది!
తినడానికి బుక్కెడు బువ్వ
ఉండటానికి రవ్వంత చోటు
సొంతూరు కి వెళ్ళడానికి
కావలసిన ఏర్పాట్లు
ఇవేమి చేయలేని పాలకుల తీరుకు
భరతమాత భోరున విలపిస్తోంది!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను
విమానాల్లో తరలిస్తున్న పాలకులు
దేశాభివృద్ధి లో పాలుపంపులున్న
వలసకూలీల ను 
గాలికొదిలేయడం ఏమిటని
మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు!

వాళ్ళు మణులడిగారా?
మాన్యాలు అడిగారా?
మా ఊళ్ళకి మమ్మల్ని పంపండి అంటుంటే
మీనమేషాలు లెక్కిస్తారెందుకు?

కరోనా తెచ్చింది విదేశాలనుంచి వచ్చినవారే!
దేశ పరిస్థితి ని చిధ్రంచేసిందీ వారే!
అయినా వలసకూలీలంటే
ఎందుకో పాలకులకు అంత అలుసు?

పాలకులారా!నాయకులారా!
వారి కోపం కట్టలు తెంచుకోకముందే
వాళ్ళు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి!
వారి ఉసురు మీకు తగలకముందే
వాళ్ళ ఇంటికి వాళ్ళు ను చేర్చండి!
దేశం మీ రొక్కరిదే కాదు!
దేశమంటే ఇలాంటి వారితో కలిపే!!

(లారీలెక్కి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తున్న వలసకూలీల ఫోటో చూసి బాధతో)

డా.గూటం స్వామి
(9441092870)
😢😢😢😢😢😢

మాతృదేవోభవ-రచన శ్రీ ప్రవీణ్ కుమార్ వేముగంటి

మనం తీసుకునే ప్రతి శ్వాస,
అమ్మ ప్రేమతో వేసిన భిక్ష!
మన జన్మ అమ్మకు అదో పునర్జన్మ!!
తన ప్రాణానికి ప్రాణం అడ్డువేసి,
మనకు ప్రాణం పోసేది అమ్మ!!
అమ్మ లేనిదే జీవం లేదు!
అమ్మ లేనిదే సృష్టే లేదు!!
సృష్టికి సృష్టే అమ్మ!
దైవానికి దైవం అమ్మ!!
లోకం లోకి తెచ్చేది అమ్మ!
లోకాన్ని చూపేది అమ్మ!!
తన రుధిరం మనకు మధుర ఆహారం!
తన అనురాగం, మనకు అనుబంధం!
తన ఒద్దికైనా ఒడి, మనకు ఇంపైన గుడి!!
అనుక్షణం మన గురించి తన విచారం!
ప్రతిక్షణం మన బాగోగులు తన ఆచారం!!
గోరంత ముద్దలతో కొండంత బలం ఇస్తుంది!
చిరు కోపంతో క్రమశిక్షణ కలిగిస్తుంది!!
బుడిబుడి అడుగులు వడివడి పరుగులు,
అన్ని తానై, అన్నింటా తానై!
నడకతో పాటు నడతను నేర్పిస్తుంది!!
మనమే అమ్మకు శ్వాస! మనమే అమ్మకు ధ్యాస!!
అమ్మ మనసు వెన్న, అవనిలో మిన్న!!
అమ్మకు అమ్మగా తన రుణం తీర్చగలమా!??
అమ్మ ప్రేమకు అనంతకోటి వందనాలు!
(ప్రతిరోజూ అమ్మ పూజనీయం!
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా)
-ప్రవీణ్ కుమార్ వేముగంటి.
10/05/2020, 18:30, ఆదివారం.

5, మే 2020, మంగళవారం

టీ కప్పులో సునామీ, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴 టీ కప్పులో సునామీ 🌴
 మానవుడు ఉప్పెనలు , ఉపద్రవాలను
ఎన్నో చూశాడు
క్రిములు కొత్త కాదు,                  
క్వారంటైన్ లు కొత్త కాదు
ఎన్నో బీమారులను బార్డర్ దాటించాడు
ఇది టీ కప్పులో సునామీ లాంటిది
దీనికి అదరవద్దు, బెదరవద్దు
గాంధీ, నెహ్రూలు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని
మనం ఆయుధంగా  చేసుకుందాం
నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్ అందించిన
వీరత్వాన్ని ఒంటి నిండా నింపుకుందాం
క్విట్ ఇండియా ఉద్యమంలో సామాన్యులు చూపించిన
ధైర్యాన్ని దైవంగా మార్చుకుందాం
కార్గిల్ వార్ లో సైనికులు చూపించిన
కరేజ్ ను మన ఒంపు కుందాం
వరదలు వచ్చినప్పుడు వంగిపోవడం
ప్రవాహం తగ్గినప్పుడు లేచి నిలబడే
గడ్డిపోస మనకు ఆదర్శం
మీడియాలో వచ్చే ఆరోహణ, అవరోహణ అంకెల పై ఆందోళన వద్దు
జగతి అంతరించదు, ఆరాటం వద్దు
 నిరాశ కు నిప్పు పెడదాం
ధైర్య పు గుండెలకు దండలు వేద్దాం
ఇంటిని ఒక బంకర్ గా మార్చుకుందాం
సరదాల సందళ్ళతో స్వర్గధామం చేసుకుందాం
కష్టాల కడలి ఎన్నో రోజులుండవు
ఉషోదయం వస్తుంది
జీవితంలో వెలుగు రేఖలు తెస్తుంది
ప్రకృతిని శాసించడం మానుకుందాం
మానవుడు ప్రకృతికి వచ్చిన
అతిధి మాత్రమేనని తెలుసుకుందాం .
-----‐-------------'------------------
✍✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET.

1, మే 2020, శుక్రవారం

స్టీరింగ్ తిప్పలు, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴 స్టీరింగ్ తిప్పలు🌴   
చేతులతో స్టీరింగ్ తిప్పకుంటే
బతుకు బండి కదలని వాళ్ళు
రయ్యి రయ్యి మంటూ
సరిహద్దుల్ని చెరుపుకుంటూ
రాష్ట్రాల్ని  దాటుకుంటూ
వాయువేగంతో కదులుతుంటే
విషపురుగు విశ్వరూపం తో
లాక్ డౌన్ బ్రేకులు పడి
కరోనా  పంజరంలో చిక్కుకున్నారు
నిలువ నీడ లేక
ఊరి బయట ఉండిపోయారు
లారీ నే  క్వారంటై న్ గా మార్చుకుని
కాలం  ఎళ్లదీస్తున్రు
చేతిలో ఉన్న పదీ పరక వడిశినయ్
తిండి గింజలు లేక తిప్పలు మొదలైనయ్
ఊరి వైపు చూస్తే అనుమానపు
అడ్డుగోడలు ఎక్కువై అడుగు పెట్టనీయట్లే
దొరికినప్పుడు తిని
లేని నాడు నీళ్లతోనే కడుపు నింపుతున్రు
వాళ్లు మన ఇంటికి ఇనుప చువ్వలు
మన రూఫ్ కు కాంక్రీటును
పప్పులు ,ఉప్పులు, కూరగాయలు
సకలం అందించి సాదిన్రు
మన ఐశ్వర్యం వెనక వాళ్ల
చెమట చుక్కలు దాగున్నాయి
వాళ్లకిప్పుడు కష్టమొచ్చింది
కండ్లల్ల పెట్టుకొని కాపాడాలి
ఆర బెట్టిన కడుపులను
బుక్కెడు బువ్వ తో నింపాలి
ఏ తల్లి  కన్న బిడ్డలో
 మన బిడ్డల్లా చూసుకోవాలి
వారి గమ్యాలకు చేరేవరకు 
మానత్వాన్ని  చిలకరిస్తూ
వాడిపోకుండా చూడాలి

( లాక్ డౌన్ వలన పొరుగు రాష్ట్రాల లారీ డ్రైవర్లు, క్లీనర్లు పడుతున్న కష్టాలు
ఈనాడులో వచ్చిన కథనంపై స్పందన)
-----------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET

29, ఏప్రిల్ 2020, బుధవారం

అంతర్మథనం, రచన శ్రీ తాటిపాముల రమేష్

🌴అంతర్మథనం 🌴
గ్లోబలైజేషన్ ఊడలు దిగి
ప్రపంచమే కుగ్రామంగా మారడంతో
సోషల్ స్టేటస్ కోసం
ఉన్న ఊరును, కన్నతల్లిని వదిలేసి
ఆశల అలలతో అమెరికాలో వాలిపోయా
నేర్చుకున్న చదువుకు
న్యూయార్క్ లో కొలువు కొట్టేశా
భుజంపై తెల్లకోటు, చేతిలో స్టేతస్కోప్
సెకండ్ల ముళ్ళుతో పరిగెత్తి
పేరు ప్రతిష్టలు మూటగట్ఠా
ఐశ్వర్యాన్ని కూడ బెట్టా
హార్డిల్స్ లేని జీవితం
ఆహ్లాదంగా సాగుతుంటే
అపరిచితుడు లెక్క
మాయ పురుగు మంది లో చేరి
ఆకు పురుగు లెక్క ఆరగిస్తుంటే
డే అండ్ నైట్ కరోనా పై
జమ్మి చెట్టు మీద దాచిన
ఆయుధాలన్నీ తీసి వాడినా
కంట్రోల్  కాకపోవడంతో
పక్కనున్న పేషట్లు ప్యాక్ కట్టేస్తుంటే
చివరకు కలిగ్స్ కూడా కరోనా కాటుతో
మృత్యువు  కుహరంలోకి  జారుతుంటే
 ఆస్పత్రులన్నీ మరుభూమిగా మారి శవాల గుట్టలుగా దర్శనమిస్తుంటే            
కాలు కదలట్లేదు, చేతులు మెదలట్లేదు
ఒళ్లంతా వైబ్రేషన్,మనసంతా ఎమోషన్
భారంతో గుండె బరువెక్కుతుంది
ఎక్కడి నుండి ఏ వార్త వస్తుందో
ఏ గాలి ఏ దుర్వార్త మోసుకొస్తుందో
అని ఆందోళన , ఆ మహమ్మారి
ఎప్పుడు కబళిస్తొందోనని ఒకటే ఆవేదన
ధైర్యం ఆవిరై,జీవితం చీకట్లు కమ్ముకుంది
లాక్ డౌన్ కు లాక్ తీసేస్తే
సొంతగడ్డపై వాలిపోతా
అమ్మ ఒడిలో వొదిగి పోతా
జన్మభూమి రుణం తీర్చుకుంటా.
( అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యుల
మరణాలకు నివాళి తో )
--‐----‐-------------------------
✍✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET .

26, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 18 తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

నీతి కథలు - 18

తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది.

‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క.

మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.

మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

అక్బర్-బీర్బల్ కథలు - 11 బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్-బీర్బల్ కథలు - 11

బీర్బల్‌ కు ఆస్థానంలో ఉన్నత పదవి

అక్బర్‌ చక్రవర్తి సభలో కొలువుదీరి వున్నప్పుడు ఒక యువకుడు మెల్లగా లోపలికి ప్రవేశించాడు. అక్బర్‌ చూపులు తనమీద పడగానే అతడు వంగి సలాం చేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు?' అని అడిగాడు అక్బర్‌ చక్రవర్తి. ప్రభూ! నా పేరు మహేశ్‌దాస్‌. ఆగ్రాకు నాలుగామడల దూరంలో వున్న కుగ్రామం మాది.
ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాను,'' అన్నాడు ఆ యువకుడు. ``నీకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని ఎవరు చెప్పారు?'' అని అడిగాడు అక్బర్‌. ``నా తెలివితేటల్ని చూసి, `నువ్వు చక్రవర్తి దగ్గరికి వెళ్లు, నీకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది,' అని మా పంతులే చెప్పారు. ఆయన మాటవిని అంతదూరం కాలినడకనే వచ్చి, అతి ప్రయత్నం మీద తమ దర్శనం చేసుకోగలిగాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌.

``ప్రతి ఉపాధ్యాయుడూ, తన విద్యార్థుల గురించి అలాగే గొప్పగా అంచనా వేస్తాడు. ఉత్తమ అర్హతలు గలవారికి మాత్రమే మేము ఇక్కడ ఉద్యోగలిస్తాం,'' అన్నాడు అక్బర్‌. "నేను ఉత్తముల్లోకెల్లా ఉత్తముడినని రుజువు చేయగలను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో. "చేసి చూపు మరి. ఆలస్యం దేనికి?'' అన్నాడు అక్బర్‌.
``అందుకు ప్రభువులు ఒక చిన్న కానుకను దయచేయాలి,'' అన్నాడు మహేశ్‌. ``మొదట ప్రతిభను నిరూపించుకుంటే తప్ప కానుకలు ఇవ్వరు,'' అన్నాడు అక్బర్‌. ``నేను అడిగే కానుకకు దమ్మిడీ ఖర్చుకాదు ప్రభూ!'' అన్నాడు మహేశ్‌. ``అలాగా? ఏమిటది?'' అని అడిగాడు అక్బర్‌. 30 కొరడా దెబ్బలు, ప్రభూ! అన్నాడు మహేశ్‌. అతడి కోరిక విని చక్రవర్తితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
``నీకేమైనా పిచ్చి పట్టిందా?'' అన్నాడు అక్బర్‌ అసహనంగా. ``ఆ సంగతి తరవాత తెలుస్తుంది. మొదట నేను అడిగింది దయచేసి ఇప్పించండి ప్రభూ,'' అన్నాడు మహేశ్‌ వినయంగా. అక్బర్‌ వెంటనే కొరడా తెప్పించి, దాన్ని తెచ్చిన వాణ్ణి దగ్గరికి పిలిచి, "కొరడాతో వాణ్ణి నిజంగానే కొట్టొద్దు. కొడుతున్నట్టు అభినయిస్తూ, మెల్లగా తాకించు,'' అని చెవిలో చెప్పాడు. భటుడు వెళ్ళి అలా ఝళిపిస్తూంటే, ముందుకు వంగిన మహేశ్‌, ఒకటి, రెండూ... అంటూ లెక్కించి, పది రాగానే, "ఆగు!'' అని అరిచి తలెత్తి అక్బర్‌ చక్రవర్తిని చూస్తూ, "ప్రభూ, కానుకలో నా వాటా నేను పుచ్చుకున్నాను.

ఇక మిగిలిన దాన్ని తమ ఉద్యోగుల్లో ఇద్దరు సమంగా పంచుకుంటారు,'' అన్నాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు అక్బర్‌ అతడు చెబుతున్నది అంతుబట్టక. "అవును ప్రభూ! భవన ద్వారం వద్ద నిలబడ్డ ఇద్దరు కాపలా భటులు ఏదైనా ఇస్తే తప్ప నన్ను లోపలికి వదలనన్నారు. `నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువిచ్చే కానుకను మీతో సమానంగా పంచుకుంటాను,' అని మాట ఇచ్చి లోపలికి వచ్చాను ప్రభూ,'' అన్నాడు మహేశ్‌. ``అలాగా!'' అన్నాడు అక్బర్‌ కోపంతో. "వాళ్ళను పిలిపిస్తే అంతా తమకు తెలుస్తుంది,'' అన్నాడు మహేశ్‌. అక్బర్‌ తల పంకించాడు.కొంతసేపటికి ఆ ఇద్దరు భటులూ అక్కడికి రాగానే, ``మిత్రులారా, మీరు నాకెంతో సాయపడ్డారని ప్రభువులకు విన్నవించాను. మీ దయ లేకుంటే నాకు ప్రభువుల దర్శన భాగ్యం లభించేదికాదని చెప్పాను. ఆయన దయచేసిన కానుకలో మీకు తలా ఒక వాటా ఇవ్వాలి కదా. ప్రభువులు ఇప్పిస్తారు. పుచ్చుకోండి,'' అన్నాడు మహేశ్‌.

ఇద్దరు భటులూ, సంతోషంగా తలలూపారు. ఒక భటుణ్ణి ముందుకు రమ్మని, కొరడా పట్టుకున్న వ్యక్తి పది దెబ్బలు కొట్టాడు. ఆ తరవాత రెండవ కాపలాభటుడు కుయ్యో మొర్రో అంటూ మిగిలిన పది కొరడాదెబ్బలూ తిన్నాడు. "ఈ క్షణమే, లంచగొండులైన మిమ్మల్ని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాను,'' అన్న అక్బర్‌ చక్రవర్తి, మహేశ్‌ కేసి తిరిగి, "నువ్వు చాలా తెలివైనవాడివి.మీ బడిపంతులు చెప్పింది నిజం. నీ సమర్థత నిరూపించుకున్నావు. ఇప్పుడే నిన్నుపేరుతో నా ఆస్థానంలో ఉన్నత పదవిలో నియమిస్తున్నాను,'' అన్నాడు చిన్నగా నవ్వు తూ.

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

ప్రశ్న: రైలు వేగంగా వెళుతున్నా రాత్రి వేళల్లో రైలు పెట్టెలోపలి లైట్ల చుట్టూ తిరుగుతున్న పురుగులు అక్కడే ఎలా ఎగరగలుగుతాయి?

జవాబు: స్టేషనులో ఆగి ఉన్న రైలులో మనం కూర్చొని ఒక బంతినిపైకి విసిరితే, అది తిరిగి మన చేతిలోకే పడుతుంది. అదే వేగంగా వెళుతున్న రైలు పెట్టెలో కూర్చొని బంతిని పైకి విసిరినా అది కూడా మన చేతిలోనే పడుతుంది. బంతి పైకి వెళ్లి తిరిగి వచ్చేలోగా రైలు ముందుకు కదులుతుంది కాబట్టి అది వెనక్కి ఎందుకు పడదనే సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం రైలు సమ వేగంతో ముందుకు వెళుతుండడమే. మనం బంతిని పైకి విసిరినపుడు మన చేతిలోంచి పైకి గాలిలోకి లేచిన బంతికి కూడా రైలు వేగమే ఉంటుంది. అంటే సమవేగంతో వెళుతున్న రైలుకు ఉండే ధర్మాలన్నీ ఆ రైలులో ఉన్న ప్రయాణికులకు, వస్తువులకు కూడా ఉంటాయన్నమాట. అదే సూత్రం రైలులో లైటు చుట్టూ తిరుగుతున్న పురుగులకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ పురుగులు కూడా రైలు వేగాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే పురుగులు రైలు నిలకడగా ఉన్నప్పుడు, వేగంగా ఉన్నప్పుడు ఒకే రకంగా లైటు చుట్టూ తిరుగుతుంటాయి.

కరోనా రంగస్థలం

🌴 కరోనా రంగస్థలం🌴
1. నిన్నటి వరకు పిల్లల గుంపుతో
   తల్లి కోడిలా స్కూల్ మైదానమంతా
   తనివితీరా తిరిగి నాను
   సకల నైపుణ్యాలతో బోర్డుపై బోధించి
   కరుణ, దయ, జాలి, ప్రేమ అనే
   పిల్లర్ల పాదులను తవ్వి
   భవిష్యత్ తరాల ను నిర్మించాను
2. నేడు నేను జీవం పోసిన
   పాత్రలు కరోనా రంగస్థలంలో
   అద్భుతంగా నటించి
   అందరి మన్ననలను పొందుతుంటే
   నేను ఆనంద సాగరంలో మునిగి                                   
   పోతున్నాను.
3. లాఠీ పట్టిన చేతులు
   నవరసాలను పండిస్తుంటే
   రోడ్లన్నీ నిశ్శబ్ద రాగాలు ఆలపిస్తుంటే
   ఖాకీల పై జనం పూల వర్షం కురిపిస్తుంటే
   నేను ఆనంద డోలికల్లో తేలిపోతున్నాను
4. తెల్లకోటు వేసినోళ్ళు
   బతికించాలనే ఆరాటం ఒకవైపు
   బతకాలనే పోరాటం మరోవైపు
   మరణాల సంఖ్యను మైనస్ లోకి
   రావడానికి ఊపిర్లు ఊదుతూ
   కరోనా క్లైంట్ లకు
   ఆశల అమృతాన్ని తాగిస్తుంటే
   సబ్బండ వర్గాల నుండి
   ప్రశంసల జల్లుకు తడిసి ముద్దవుతుంటే
   నా కండ్ల నుండి ఆనంద భాష్పాలు
   రాలుతున్నాయి.
5. చీకట్లో లేచి, చీపుర్లను చేతబట్టి
   రోడ్లను నిద్ర లేపి, మలినాలను
   కడిగిపారేస్తున్న సఫాయి కర్మచారులను
   పాలకులు పాదాలు కడుగుతుంటే
   నేను పొంగిపోతున్నాను
6. కరెన్సీ కట్టలను గుట్టలుగా పేర్చి నోళ్లు
   ఘనీభవింఛిన దాతృత్వాన్నికరిగించుకొని
   ముడుచుకున్న మనసులను విప్పుకొని
   రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరి వచ్చి
   సహాయపు కుసుమాలను పంచుతుంటే
   రంతి దేవుడికి వారసులయ్యారని
   నేను మురిసి పోతున్నాను
7. పుడమిపై పుడుతున్న
   రాచపుండు లను
   భవిష్యత్ తరాలకు తాకకుండా
   మరింతమంది వైజ్ఞానికులను
   తయారుచేయడానికి
   ఫ్యూచర్ కోసం కరికులం ఫ్రేమ్ ను
   మార్చుకొని నవ్య వ్యూహాలతో
   బోధిస్తూ నవ సమాజాన్ని నిర్మిస్తాను.
--------------------------------------------
✍✍✍✍✍✍✍✍✍
         తాటిపాముల రమేష్
       జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.

25, ఏప్రిల్ 2020, శనివారం

ఆహా ఎంతమార్పు -రచయిత షేక్ రంజాన్

ఆహా ఎంతమార్పు
            ......................
కాలుష్యము  తొలగిపోయ్యాను
చెట్టు కొమ్మ  చిగురించెను
ఆకుపైన  సీతాకోకచిలుక
రెమ్మ నుండి  మొగ్గలెన్నో
పూల నుండి   కాయలెన్నో
కాయ రంగు   మారిపొయ్యాను
           ~ఆహా ఎంతమార్పు

ఫ్యాక్టరీలు  మూతపడ్డవి
పర్వతాలు బయటపడినవి
నది జలాలు  రంగుమారేను
నెమలి  నాట్యమాడుతున్నది
కోకిల   పాటపాడుతున్నది
జింక  పరుగులెడుతున్నది
పిచ్చుక   గూడుకడుతున్నది
           ~ఆహా ఎంతమార్పు

జనసాంద్రత  తక్కువయా
శబ్ద కాలుష్యము       తగ్గిపోయి                          
 నీటి కలుషితము కాకపోయా
కలుషిత ఆహారము  లేకపోయా
డ్రైనేజీలు  శుభ్రమయా
దోమలు ఈగలు  లేకపోయా రోగాలు   రాకపాయా
        ~ఆహా ఎంతమార్పు

ఇంటికి   పరిమితమై
ఇల్లు    శుభ్రత చేయచుంటిరి
పాత రోలు  బయట పడే
రోకలి  చేత బూని
మానిసన కారం  దంచుతుంటిరి
గొడ్డు కారం  నూరుతుంటిరి
           ~ఆహా ఎంతమార్పు        
 మూలనున్న   చల్ల కవం
కడవలోన   పెరుగును
చిలికి చిలికి  వెన్నెతీసి
నేయిని  చేస్తుంటిరి
           ~ఆహా ఎంతమార్పు

రచయిత.......
షేక్  రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఏం మాయ చేసావే కరోనా

🌴 ఏం మాయ చేసావే కరోనా 🌴

1. పెన్ను పేపర్ ముట్ట లేదు
    ఫైనల్ పరీక్షలు రాయలేదు
    కరోనా కంగారుతో
    పొట్టే గాండ్లను  పై తరగతులకు
    ప్రమోట్  చేయడం తో
    ఎగిరి గంతేసి సెల్ ఫోన్లు, టీవీలతో
    తీన్మార్ జేస్తుండ్రు.
2 . బాటిల్ లో సుక్క లేక
     ప్లేట్లో లో ముక్క లేక
     బార్ షాపులు తెరుచుకోక
     దోస్త్ గాళ్ళు ఇంటికి రాకా
     రోజంతా పొద్దు పోక
     అలవాటుపడ్డ పాణాలు
     గాయి గాయి  అయితున్నయి.
3. లాక్ టౌన్ కాలం ఎక్కువై
    అత్తా కోడళ్ళ మధ్య
    ఆలుమొగల్ల మధ్య
    చిటపటలు,చిందులు ఎక్కువై
    ఓపిక సహనం తక్కువై
    ఫిర్యాదుల కేసులు
     పరేషాన్ జేస్తున్నయి
4. కూలి నాలి కులవృత్తోల్లకు
    పని లేక కరెన్సీ కష్టాలతో
    శ్రమజీవుల బతుకు సమరం
    దిన దిన గండం తో
    బతుకు సుడిగుండం లా మారింది
5. మందిర్, మసీద్,
    చర్చిలను మూత పెట్టి
    చరిత్రను తిరగబెట్టి
    భగవంతున్ని ఇంటికి తెచ్చి
    మందిరంలో కాదు దేవుడు
    మదిలోనే ఉండాలని నేర్పింది
6.  అమెరికా నీ దెబ్బతో అల్లాడుతుంది
     అందమైన ఐరోపా ఆగమౌతుంది
     విశ్వమంతా ఇసురుకొని
    పసికూనల నుండి పండుటాకుల వరకు
    ఆకు తినే పురుగు లాగా ఆరగిస్తుంది.
7. శాస్త్రీయతకు సవాల్ విసిరి
    ప్రగతి నంతా ప్రశ్నార్ధకం చేసి
    ప్రకృతిని మరిచిన మనిషికి
    జ్ఞానోదయం కలిగించింది.
-------------------------------
✍✍✍ తాటిపాాముల రమేష్
 జడ్.పి.హెచ్.ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 17 చిట్టెలుక ఉపకారం

నీతి కథలు - 17

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

అక్బర్-బీర్బల్ కథలు - 9నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

అక్బర్-బీర్బల్ కథలు - 9

నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

ఒకసారి అక్బర్ చక్రవర్తి.. తన మందీ మార్బలంతోపాటు బీర్బల్‌ను కూడా వెంటబెట్టుకుని వినోదం కోసం అడవికి వెళ్లాడు. అయితే తన గుర్రం తాను కోరుకున్నంత వేగంగా పరిగెత్తక పోవటంతో అక్బర్‌కు చాలా కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకుని దాన్ని కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

అది చూసిన బీర్బల్ వెంటనే "మహారాజా.. దయచేసి దాన్ని కొట్టకండి" అంటూ అడ్డుపడ్డాడు. "నా తిండి తింటుంది కాబట్టి అది చచ్చినట్లు కా కోసం పని చెయ్యాల్సిందే. అదలా చేయకపోతే దాన్ని కొట్టే హక్కు నాకుంద"ని బదులిచ్చాడు అక్బర్. అయినప్పటికీ.. "దయచేసి తమరు ఆ గుర్రంమీద జాలి చూపించండ"ని పదే పదే వేడుకున్నాడు బీర్బల్.

"అది సరేగానీ.. నేను నువ్వు చెప్పినట్లుగానే వింటాను. కానీ నా తిండి తిన్న వాళ్లెవరైనా సరే నా పని చేయాల్సిందే" అన్నాడు మొండిగా అక్బర్. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తరువాత వారికి జింక ఒకటి కనిపించింది. దాన్ని వేటాడి చంపేసి కోటకు తీసుకెళ్దామని అన్నాడు అక్బర్.

అలా ఆ జింకను వేటాడుతూ అక్బర్, బీర్బల్‌లు ఇద్దరూ మిగతా మందీ మార్బలం నుంచి వేరుగా అయిపోయారు. కాసేపటి తరువాత అక్బర్‌కు బాగా ఆకలి వేసింది. మన ఆహార పదార్థాలన్నీ మన వాళ్లవద్దనే ఉండిపోయాయి. ఇప్పుడెలా మహాప్రభూ..? అని అన్నాడు బీర్బల్. అయితే ప్రస్తుతం మనవద్ద గుర్రం తినే దాణా తప్ప మరింకేమీ తినేందుకు లేవని చెప్పాడు బీర్బల్.

"ఏమీ లేని దానికన్నా గుర్రం దాణా అయినా నయమే కదా..? అదే ఇవ్వు" అన్నాడు అక్బర్. దాంతో ఇద్దరూ గుర్రం మెడకు వేళాడుతున్న సంచిలోని గుగ్గిళ్లు తీసుకుని గుప్పిళ్లకొద్దీ తిన్నారు. ఆకలి తీరిన తరువాత అక్బర్.. "ఇక మనవాళ్ల కోసం వెతుకుదాం పదా..?!" అంటూ గుర్రం ఎక్కబోయాడు.

అయితే అసలే ఆకలిగా ఉన్న ఆ గుర్రం అక్బర్‌ను వెనుక కాళ్లతో తన్నింది. కోపంతో ఊగిపోయిన అక్బర్ కొరడాతో దాన్ని బాదేందుకు సిద్ధపడగా బీర్బల్ అడ్డుకున్నాడు. "ఎంత పొగరు, దాన్ని చంపేస్తానంటూ" గుర్రం మీదికి ఉరికాడు అక్బర్. "అయ్యా మీరు అలా చేయలేరు" అన్నాడు బీర్బల్

"ఏం ఎందుకు చేయలేను? నన్ను ఆపవద్ద"ని చెప్పి గుర్రం మీది మీదికి వెళ్లాడు అక్బర్. "అలా చేయటం సరికాదు ప్రభూ..! ఎందుకంటే మీరు ఇప్పుడే దాని తిండి తినేశారు. మీరే దాని పని చేయాలి" అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలకు అక్బర్‌కు కోపం స్థానంలో నవ్వు పలుకరించింది.

"ఏంటి బీర్బల్..? గుర్రంపని నేను చేయటమా..? ఏం చెయ్యాలేంటి..?" నవ్వుతూనే అడిగాడు. మరేం లేదు మహారాజా..! మీరు దాని తిండి తినేశారు కాబట్టి దాని పని చేయాలి. దాని అది పని చేయాలంటే.. దాన్ని మీమీద ఎక్కి స్వారీ చేయనివ్వండి అన్నాడు. దాంతో బీర్బల్ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అక్బర్.. తన పొరపాటును గ్రహించాడు. ఆ తరువాత బీర్బల్‌ను వెంటబెట్టుకుని ఆ అడవిలో కనిపించకుండా పోయిన తమవాళ్లకోసం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

జవాబు:
నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్‌'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్‌ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.

23, ఏప్రిల్ 2020, గురువారం

మాయ రోగం మమ్మల్నేం జేస్తది

🌴మాయ రోగం మమ్మల్నేం జేస్తది 🌴
1. పలుగు పార పట్టేటోళ్ళం
     మేడి పట్టి దుక్కి దున్నేటోళ్ళం 
     నాటు, కలుపు,కోత కోసేటోళ్లం
     పుట్ల కొద్దీ తూర్పార బట్టి
     ఎడ్ల బండ్ల కు ఎత్తేటోళ్ళం
     మాయ రోగం మమ్మల్నేం జేస్తది
2.  కొండలను పిండి చేసి
      బండలను చిట్లగొట్టి
      ఫూటు రౌతు ఎత్తెటోళ్ళం
      ఇటుక ఇటుకను పేర్చి
      ఇండ్లను కట్టెటోళ్ళం
      మాయరోగం మమ్ముల్నేం జేస్తది.
3.    పోగు పోగు పేర్చి
       కన్నీళ్లతో కండెలను చుట్టి
       అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి
       ప్రపంచాన్ని అబ్బురపరచినోళ్ళం
       మోకు ముస్తాదు చేతబట్టి
       కత్తి పట్టి కల్లును గీసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
4.   మట్టిలో కెమిస్ట్రీని మిక్స్ చేసి
       చక్రంతో మనసు దోచే
       మట్టి పాత్రలు చేసేటోళ్ళం
       కత్తి, బ్లేడు ను చేతబట్టి
        స్టైల్ గా కటింగ్ చేసేటోళ్ళం
       మాయ రోగం మమ్ముల్నేం జేస్తది
5.    డప్పు కొట్టి దరువు వేసేటోళ్ళం
       మేడ మిద్దెలకు రంగులద్దెటోళ్ళం
       కష్టాల కావడిని మోస్తూ
       కలవరం చెందకుండా
       సబ్బండ వర్గాలు
       సవాల్ గా తీసుకుంటాం
      కరోనా అంతమే
      మా పంతంగా కదులుదాం.
6.   కాలు బయట పెట్టకుండా
      నీ గొలుసును కత్తిరిస్తం
     సానిటైజర్లను వాడి
     నీకు సమాధి కడతాం
     పిడికిలెత్తి పోరు సల్పి
     నిన్ను పొలిమేర దాటిస్తాం.
------------------------------------------
✍✍✍ తాటిపాముల రమేష్
 జడ్పీహెచ్ఎస్ వర్ధన్నపేట.

నీతి కథలు - 15 కుందేలుకు గుణపాఠం

నీతి కథలు - 15

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.

తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.

గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది.

అక్బర్-బీర్బల్ కథలు - 8 ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

అక్బర్-బీర్బల్ కథలు - 8

ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు.

అక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. "బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, "లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ"ని చెప్పాడు.

బీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... "క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు" అని అన్నాడు. "లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద"ని చెప్పాడు బీర్బల్‌.
కష్టపడకపోతే ఇంతే మరి...!!

వెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... "బీర్బల్...‌! నువ్వన్నట్లుగానే ఈ వ్యక్తి గాఢనిద్రలో ఉన్నాడు. కానీ యితనికి ఈ రాళ్ళ మీద యింత చలిలో ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం కావడం లేద"ని అన్నాడు.

"జహాపనా...! ధనికుడై ఉండడానికి, నిద్ర పట్టడానికి ఏమీసంబంధంలేదు. నిద్ర ష్టపడితేనే వస్తుంది. ఈ పేదవాడు కష్టపడి పనిచేసి అలసిపోయాడు. అందువల్లనే ఇతనికి గాఢనిద్ర పట్టింది. ఇటువంటి సుఖనిద్ర కష్టపడితేనే లభిస్తుంద" ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అయినప్పటికీ... బీర్బల్‌ మాటలపై అక్బర్‌కు నమ్మకం కలుగలేదు. "అది కాదు బీర్బల్‌..! ఈ వ్యక్తికి ధనవంతుల ఆహార పానీయాలూ, నిద్రపోవడానికి హంసతూలికా తల్పాలు వుంటే... ఇతడు ఇంతకంటే గాఢంగా నిద్రపోగలడు కదా..!" అని అన్నాడు అక్బర్. "హుజూర్...‌! మీరు అన్న మాటలు నిజంకావు. కావాలంటే ఇతనిని కొంతకాలం ధనవంతునిగా చేసి చూడండి" అని చెప్పాడు బీర్బల్‌ .

దీంతో.. తాను చెప్పిన మాటలే నిజమని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు అక్బర్‌ చక్రవర్తి. ఆ వ్యక్తిని నిద్ర నుండి లేపి తన వెంట రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తి నివసించడానికి సకల సౌకర్యాలతో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశాడు. రుచికరమైన ఆహార పానీయాలు, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన హంసతూలికాతల్పం వగైరా అన్ని ఏర్పాట్లు చేయిం చాడు.

కష్టపడి కాయకష్టం చేసుకునే ఆ వ్యక్తికి ఆ రాజ భవనంలో తినడం విశ్రాంతి తీసుకోవడం తప్ప, వేరే పనేమీ లేకుండా పక్షంరోజులు గడిచిపోయాయి. ఒకనాడు అక్బర్‌ ఆ వ్యక్తిని గురించి బీర్బల్‌ని అడిగాడు. "ప్రభూ..! ఆ నకిలీ ధనికుడికి మూడు దినాలుగా జ్వరం" అని చెప్పాడు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అక్బర్... "అంటే అతనికి విశ్రాంతి లేదన్నమాట, ఎవరి నిర్లక్ష్యంవల్ల ఇలా జరిగింద..?"ని ప్రశ్నించాడు.

"జహాపనా...! నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఈయన బండిలో కూర్చుని షికారు వెళ్ళాడు. దారిలో చలిగాలి తగిలింది. దాంతో అతనికి జలుబు చేసి జ్వరం వచ్చింది" అని చేప్పాడు బీర్బల్‌ . "చలి నుండి రక్షించుకోడానికి ఆ సమయంలో అతని దగ్గర కంబళి లేదా..?" అని ప్రశ్నించాడు అక్బర్‌. "లేకేం ప్రభూ...! ఆ మనిషి మీద తమకు అపార దయ ఉంది ఇంక వస్త్రాలకు లోటేమిటి..? అతని తల నుండి కాళ్ళ వరకూ ఉన్ని వస్త్రం కప్పి ఉంది. అయినా అతనికి జలుబు చేసింద"ని చెప్పాడు బీర్బల్‌.

"అతనికి నిద్ర బాగా పడుతున్నది కదూ..?" అడిగాడు అక్బర్‌. "ఏపూటా సరైన నిద్రలేదు. హంసతూలికాతల్పం మీద విశ్రమించిన పిదప నౌకర్లు కాళ్ళుపడితే కాసేపు నిద్ర పోగలుగుతున్నాడని" చెప్పాడు బీర్బల్‌. "ఏం..? ఎందుకని..? అక్కడ రోడ్డు ప్రక్కన చిరిగిన బట్టలతో పడుకున్నప్పుడు చలివేయలేదు. ఇక్కడ ఉన్ని వస్త్రం కప్పుకున్నా చలి వల్ల జలుబు చేసింది. అక్కడ అతను రాళ్ళ మీద హాయిగా నిద్రపోగలిగాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద పడుకున్నా నిద్రపట్టడం లేదు. ఎంత ఆశ్చర్యం?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అక్బర్.

"దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమీలేదు ప్రభూ..! అతడు పాపం ధనికుడై కష్టాలపాలయ్యాడంతే.." అన్నాడు బీర్బల్‌. "రాళ్ళురప్పలపై హాయిగా నిద్రించిన వ్యక్తి హంసతూలికాతల్పం మీద నిద్రించలేకపోతున్నాడు. ఇది ధనికుడైనందు వలన అతడికి కలిగిన శిక్ష. ఇంతకు ముందు ఇతడు పగలంతా కష్టపడి పనిచేసేవాడు. అందువలన అతని శరీరం ఆరోగ్యంగా ఉండేది. దాంతో మంచి నిద్రపట్టేది. ఇప్పుడు మీరు ఇతనికి విశ్రాంతినిచ్చి సుకుమారంగా తయారు చేశారు. మామూలు చలి, వేడి కూడా ఇతను ఇప్పుడు భరించలేకపోతున్నాడ"ని వివరించి చెప్పాడు బీర్బల్‌.

అక్బర్‌కు ఇప్పుడు కూడా బీర్బల్‌ మాటలపై నమ్మకం కలుగలేదు. ఆ రాత్రి ఆయన బీర్బల్‌ని వెంట బెట్టుకుని ఆ నకిలీ ధనవంతుడున్న భవంతికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి మంచం మీద నిద్రపట్టక అవస్థపడుతున్నాడు. "ఆ వ్యక్తికి ఎందుకని నిద్రపట్టడం లేద"ని బీర్బల్‌ని అడిగాడు అక్బర్.

"జహాపనా..! అతని పక్కమీద ఏదో ఉండి గుచ్చుకుంటోంది. అందుకే అతనికి నిద్ర పట్టలేదు" అన్నాడు బీర్బల్. బీర్బల్‌ లోపలికి వెళ్లి అతని తల్పాన్ని పరీక్షించాడు. దుప్పటి కింద ఒక ప్రత్తి గింజ కనిపించింది. దాన్ని అక్బర్‌కి చూపించి "చూడండి ప్రభూ..! దీని కారణంగా ఈ కొత్త ధనికుడికి నిద్రపట్టడం లేద"ని అన్నాడు.


"ఇంతకు ముందు ఇతనికి రాళ్ళు కూడా గుచ్చు కోలేదు. ఇప్పుడు ఈ చిన్న విత్తనం ఇతనికి కష్టం కలిగింది. మీరు ఇతని చేత్తో పక్కకూడా దులపనివ్వడం లేదు. ఇది ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష. కష్టపడి పనిచెయ్యకపోవడమే దీనికి కారణం" అని అక్బర్‌తో అన్నాడు బీర్బల్. అప్పటికి బీర్బల్‌ మాటలతో ఏకీభవించిన అక్బర్.. మరునాడు ఆ వ్యక్తిని రాజ భవనం నుంచి పంపిస్తూ.. ముందులాగే కష్టపడి, శ్రమించి సుఖంగా జీవించమని చెప్పి రాజభవనం నుంచి పంపించేశాడు అక్బర్..!

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?

జవాబు:
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.

22, ఏప్రిల్ 2020, బుధవారం

అక్బర్-బీర్బల్ కథలు - 7 చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

అక్బర్-బీర్బల్ కథలు - 7

చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు.

తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు.

నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు.
ఆవగింజల్ని లెక్కపెట్టారట..!

అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజు సరేనని అన్నాడు. ఇక ఆరోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కల్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. అలా పదిహేను రోజులు గడిచాయి. ఆ మరుసటిరోజు సభకు వచ్చాడు.

మహారాజా..! మీరు చెప్పినట్లుగానే చుక్కలన్నింటినీ లెక్కపెట్టాను. అయితే నోటితో లెక్కపెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాసేందుకు వీలు కాలేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ, ఒక్కో ఆవగింజను ఈ సంచిలో వేశాను. మొత్తం పదిహేను రోజులూ ఇలాగే చేశాను. కాబట్టి, ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో, ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాపభ్రూ అంటూ... మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు.

ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి... నవ్వుతూ చాలా ఉన్నాయే అని అన్నాడు. మహారాజా.. మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవగింజలన్నింటినీ లెక్కపెట్టించండి. తరువాత నక్షత్రాలను లెక్క పెట్టించండి. అందరి అనుమానం తీరిపోతుందని తెలివిగా బదులిచ్చాడు బీర్బల్.

బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి.. సంతోషంగా తాను ఇస్తానను వెయ్యి బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు. సభలోనివారంతా కూడా బీర్బల్ తెలివితేటలను మెచ్చుకుని హాయిగా నవ్వుకోసాగారు.

నీతి కథలు - 14 వర్తకుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 14

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.

‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. 

రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. 

చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.  వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.

వర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు.

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

జవాబు:
మనం వేసుకొనే వస్త్రాల మీద, శరీరం మీద చేరే మురికి కణాలు రెండు రకాలు. కొన్ని నూనె లాంటి జిడ్డు పదార్థాలకు చెందినవైతే, మరికొన్ని విద్యుదావేశాలు కలవి. గాలిలోని కణాలు ఒకదానిని మరొకటి రాసుకోవడం వల్ల వాటికి విద్యుదావేశం కలుగుతుంది. మామూలుగా నీటిలో ముంచి బట్టలు ఉతకడం వల్లకానీ శరీరంపై నీరు పోసుకుని రుద్దుకోవడం వల్ల కానీ ఈ మురికి కణాలు సులభంగా తొలిగిపోవు. పైగా ఉతకడం వల్ల, రుద్దడం వల్ల ఈ కణాలలో విద్యుదావేశం తొలిగిపోయి బట్టలకు, ఒంటికి అంటుకుపోతాయి. నూనె కణాలు నీటితో కలవక పోవడం వల్ల అవి మరీ అతుక్కుపోతాయి. సబ్బు వివిధ రకాల రసాయనిక పదార్థాల సమ్మేళనం. సబ్బులోని రసాయనిక అణువులకు ఉన్న ప్రత్యేక ధర్మం, అణు నిర్మాణం మూలంగా అవి మురికిలోని జిడ్డుతో కూడిన కణాలకు, విద్యుదావేశం ఉన్న కణాలకు అంటుకుంటాయి. తర్వాత నీరు పోసి ఉతకడం గానీ, రుద్దడం కానీ చేయగానే సబ్బుకణాలు మురికి కణాలను తమతో పాటు, గుడ్డలనుంచి, ఒంటి నుంచి తొలగిస్తాయి.

స్నానానికి వాడే సబ్బుల్లో మురికిని తొలగించే రసాయన పదార్థాలతో పాటు సువాసన వెదజల్లే పదార్థాలు కూడా ఉండటం వల్ల మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

నీతి కథలు - 13 చిత్రకారుడి సమయస్ఫూర్తి

నీతి కథలు - 13

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.

వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.


గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.


చివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు.

అక్బర్-బీర్బల్ కథలు - 6 గుడ్డివారు ఎవరు..?

అక్బర్-బీర్బల్ కథలు - 6

గుడ్డివారు ఎవరు..?

ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.

అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు.

మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు.

ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది.

మరుసటిరోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు తరలివచ్చాడు. వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి.. "ఈ లిస్టు చూడండి మహారాజా... మన పట్టణంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుంద"ని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకుని చదవడం ప్రారంభించాడు.

ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి. అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ ఖంగుతిన్నాడు. "అదేంటి బీర్బల్...! నా పేరును కూడా ఈ లిస్టులో రాశావెందుకు..?" అని ప్రశ్నించాడు మహారాజు.

అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ... "మహారాజా...! మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ... కళ్ళుండి కూడా చూడలేనివారు గుడ్డివారే కదా...!!" అన్నాడు. దీంతో అక్బర్‌కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై, దానికి చింతిస్తూ... బీర్బల్‌ తెలివితేటలను అభినందించాడు.

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

జవాబు:
విపరీతమైన జన్యులక్షణాలు, గర్భస్థ సమయంలో పిండంలో కలిగిన మార్పుల మూలాన ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా సుమారు ఎనిమిది అడుగుల 3 అంగుళాల ఎత్తుగల సుల్తాన్‌ కోసెన్‌ గిన్నిస్‌ రికార్డుకెక్కాడు. ప్రపంచంలో నేటి వరకు రికార్డు ప్రకారం అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్‌ దేశానికి చెందిన చంద్ర బహద్దూర్‌ డాంగీ. ఇతని ఎత్తు కేవలం ఒక అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇలాంటి విపరీతమైన వ్యత్యాసాలు మినహాయిస్తే సాధారణ ప్రజానీకంలో ఎత్తు పొడవులు తేడా ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, అప్రధానమైనవి ఉన్నాయి. అప్రధానమైనవి అరుదుగా సంభవించే కారణాలు. ఉదాహరణకు గర్భంలో ఉండగా తల్లి సరిగా ఆహారం తీసుకోనట్లయితే పిండం ఎదుగుదలలో లోపం వచ్చి ఆ తర్వాత ఎంత తిన్నా పొడవు పెరగక పోవచ్చు. ఒక వేళ మామూలుగానే తల్లి ఆరోగ్యంగా గర్భం ధరించినా ప్రసవం తర్వాత నూతన శిశువుకు బాలారిష్టాలు కల్గి ఎముకల ఎదుగుదలలో లోపాలు వచ్చినా, పెరిగే క్రమంలో పోషకాహారం లేకున్నా, బాల్యంలోనే ఎదుగుదల క్షీణించవచ్చు. మనిషి సుమారు 20 సంవత్సరాల లోపే ఎదుగుతాడు. ఆ తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి 20 సంవత్సరాల లోపు పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.

ప్రధానమైన కారణాలు జన్యు సంబంధమైనవి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇరువురూ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా పొడవుగానే ఎదిగే అవకాశం ఉంది. చైనా, జపాన్‌, నేపాల్‌, మలేషియా వంటి ప్రాంతాల్లో ప్రజల జన్యుతత్వం అక్కడ సగటు మనిషి ఎత్తు 5 అడుగుల వరకే ఉండేలా ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అలాంటి జన్యుతత్వం లేదు.
సాధారణంగా వారు 6 అడుగుల వరకు పెరుగుతారు. భారతీయులు సగటుగా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటారు. అత్యంత పొడవుకు కూడా జన్యువులే కారణం.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

నీతి కథలు - 11 చేప ముందుచూపు

నీతి కథలు - 11

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.

ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

అక్బర్-బీర్బల్ కథలు - 4 కథ అడ్డం తిరిగింది..!

అక్బర్-బీర్బల్ కథలు - 4

కథ అడ్డం తిరిగింది..!

ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్.

అక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు.

ప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి.

ఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు.

తినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి.

ఇంతలో అక్బర్ చక్రవర్తి.. "చూశావా బీర్బల్... రాణీగారు ఎంత తిండిపోతో.. ఆమె ముందు చూడండి ఎన్ని గింజలున్నాయో..?" అని అన్నాడు. ఆ మాట విన్నవెంటనే రాణీగారు సిగ్గుతో తలవంచుకున్నారు.

అయితే బీర్బల్ ఊరికే ఉంటాడా... వెంటనే "మహారాజా.. రాణీగారికంటే తమరే ఎక్కువ తిండిపోతులాగా ఉన్నారు. రాణీగారు పండ్లు తిని గింజలు మాత్రమే వదలిపెట్టారు. తమరు పండ్లుతోపాటు గింజల్ని కూడా మింగేశార"ని అన్నాడు. పాపం.. రాజుగారు.. సిగ్గుపడక తప్పలేదు. రాణీగారిని ఇరికించాలనుకుంటే తానే ఇలా దొరికిపోయానని మనసులో అనుకున్నాడు అక్బర్ చక్రవర్తి.

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

జవాబు:
నడుస్తున్నపుడు తలకు ఆకులు తాకేలా పొట్టిగా ఉన్న చెట్ల కింద ఎక్కువ సేపు రాత్రుళ్లు ఉండకూడదనేది ఓ సూచన. అలా ఉన్నంత మాత్రాన విపరీతమైన సమస్య, ప్రాణాపాయం ఏమీ రాదు. కానీ ఆక్సిజన్‌ను మనతో పాటు చెట్టు కూడా శ్వాసక్రియలో వాడుకుంటుంది. మనలాగే శ్వాసక్రియలో చెట్లు కూడా కార్బన్‌ డయాక్సైడును విడుదల చేస్తాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ అణుభారం 44. నైట్రోజన్‌, ఆక్సిజన్‌లున్న గాలి కన్నా ఇది ఎక్కువ. అదే పనిగా చెట్టు కిందే ఉంటే కార్బన్‌డయాక్సైడ్‌ బరువెక్కి చెట్టు కిందికి పోగవుతుంది కాబట్టి మనకు ప్రాణ వాయువయిన ఆక్సిజన్‌ తక్కువగా లభ్యమవుతుంది. అయితే చెట్టు ఆకులు తగిలేలా ఎవరూ చెట్లకింద నడవరు, పడుకోరు.

చెట్టు కొమ్మలకు, నేలకు మధ్య బాగా సందు ఉన్నట్లయితే గాలి ఎప్పటికప్పుడు విసరణం చెందుతుంది. కాబట్టి అదేపనిగా కార్బన్‌డయాక్సైడు అక్కడే ఉండిపోదు. మామూలుగా ఎత్తుగా ఉన్న చెట్ల కింద పగలయినా రాత్రయినా నడిస్తే ప్రత్యేక తేడా ఉండదు. ప్రమాదం ఏమీ లేదు. భోజనం తర్వాత కొంత నడక మంచిది అన్న సామెత నేడు చెల్లదని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి అవసరమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

అయినా భోజనానికీ, చెట్లకు సంబంధం ఏముంటుంది? చెట్ల కింద రాత్రుళ్లు నడవాలా వద్దా అన్నదే మీమాంస లేదా భోజనం తర్వాత నడవటం మంచిదా, కాదా అనేది సంశయం.