🌴ఆశల అలలు ఆవిరైనయ్ 🌴
1 .స్వరాష్ట్రం కైఆటనైనం, పాటనైనం
దరువు వేసే డప్పు నైనం
సడక్ బంద్ నుండి
సకల జనుల సమ్మె వరకు
పిడికిలేత్తినం
దిక్కులు పిక్కటిల్లేలా గర్జించినం
2. బంగారు తెలంగాణలో
ఉద్యోగుల బతుకులు
బాగుంటయ్ అనుకుంటే
ఆశల అలలు ఆవిరైనయ్
ఇచ్చిన హామీలన్నీ అటకెక్కినయ్
చేసిన బాసలన్నీ నీటిమీద రాత లైనయ్
3. కరోనా కల్లోలం తో
సంచిలోకి సగం జీతం రాబట్టే
EMI, ఇంటి ఖర్చులకు సరిపోక బట్టే
అమ్మ హార్ట్ పేషెంట్, నాన్న కు కాళ్ళనొప్పులు
మందులకు మనీ లేక తిప్పలైతాంది
తెచ్చిన అప్పులు కుప్ప లై
బతుకు సుడిగుండమై
సరస్వతి పూలు రాల బట్టే
4. సబ్బండ వర్గాలను
సంబర పెడుతున్న సర్కారు
సంక్షేమ పథకాలను సామాన్యులకు చేరవేసే చిరుద్యోగుల వైపు
కన్నెత్తి చూడట్లేదు, పల్లెత్తి మాట్లాడట్లే
5. మర్లబడటం మరిచిపోయినం
పౌరుషాలన్నీ లాకర్ల పెట్టినం
నమ్ముకున్న సంఘనాయకులు
సొంత పనులను చూసుకుంటున్రు
సమస్యల తోరణాన్ని సాధించడానికి
సిద్దాంతాలను సిగలో చెక్కి
యూనియన్ల విభేదాలను గట్టునపెట్టి
వేతన జీవులు మరొక్కసారి రోడ్డెక్కాలి
మన ఐక్యతను ఎరక జెయాలే
----------------------‐-----------------
✍✍✍✍తాటిపాముల రమేష్
ZPHS WARDHANNAPET
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి