ఏమంటిరి ఏమిచేసితిరి
................ ............... ఉద్యోగులు స్నేహితులంటిరి
కాంట్రాక్టు ఉండదంటిరి
RTC ప్రభుత్వమంటిరి
కాళ్లలో ముళ్ళు పళ్లతో తీసుడే నంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
లక్షల ఉద్యోగాలంటిరి
నిరుద్యోగం ఉండదంటిరి
కార్మికులకు అండనంటిరి
కన్నీళ్లు ఉండవంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
విద్య ఉచితమంటిరి
ఊరూరా వైద్యమంటిరి
ఇంటింటికి నల్లానంటిరి
రైతు ఆత్మహత్యలు ఉండవంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
మూడెకరాల భూమంటిరి
దున్నేవానిదే భూమంటిరి
లక్షల నాగళ్లంటిరి
లక్షలమందికి ఉపాధి అంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
ఆంధ్రోడి పాలనంటిరి
మన భూములు మనవంటిరి
మన నీళ్లు మనవంటిరి
సస్య శ్యామలమంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
కాగితపు ముక్కనంటిరి
ఫైరవీలు ఉండవంటిరి
రోడ్లు ఎక్కనీయనంటిరి
ధర్నాలు ఉండవంటిరి
మన హక్కులు మనవంటిరి
ఏమంటిరి ఏమిచేసితిరి
రచయిత :-షేక్ రంజాన్