LATEST UPDATES

19, జూన్ 2021, శనివారం

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

సార్, మా డిపార్ట్మెంట్ లో ఒక అతను with out leave విత్ ఔట్ పర్మిషన్ తో వెళ్లి ఇప్పుడు వచ్చి డ్యూటీ కావాలి అంటున్నాడు. కనీసం 5 సంవత్సరాలు అయింది వెళ్లి అయితే అతన్ని డ్యూటీ నుండి రిమూవ్ చేయాలా లేక డయాస్ నాన్ చేయవచ్చా.

సమాధానం:

ఎటువంటి సరైన సమాచారం ఇవ్వకుండా సంవత్సరం పాటు గైర్హాజరు అయితే విధుల నుండి తొలగించవచ్చూను. వారి మీద ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి నోటీసులు పంపించారా.. ? సదరు ప్రొసీడింగ్ ల మేరకు తొలగించవచ్చు.. కోర్ట్ కి వెళ్లినా వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది

ముందస్తు అనుమతి లేకుండా ఒక సంవత్సరం దాటి గైర్హాజరు అయితే రిజైన్ చేసినట్లుగా భావించాలి.

అతను రాత పూర్వకంగా విధులకు రిపోర్ట్ చేస్తే ఈ కారణం చెబుతూ రిజైన్ చేసినట్లుగా ఎందుకు భావించకూడదు అని షో కాజ్ నోటీస్ ఇవ్వండి.

తరువాత సర్వీస్ నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయండి.

లేదా

ఒకవేళ మీకైమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే 5 ఏళ్ల సమయం గడిచింది కాబట్టి వారిని డ్యూటీ లో చేర్చుకోవడం కోసం మీరు ఉన్నతాధికారులకు (ప్రభుత్వం) క్లారిఫికేషన్ కోసం రాయండి. అక్కడ నుండి ప్రయత్నించుకోమని చెప్పండి.

ఒకవేళ సానుకూలంగా వస్తే అడ్మిట్ చేసుకుని క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. 
ప్రతికూలంగా వచ్చినా, మీరే నిర్ణయం తీసుకోమని వచ్చినా సర్వీస్ నుండి రిమూవ్ చేయాల్సిందే.

మీ అంతట మీరు అడ్మిట్ చేసుకుని సర్వీస్ లో కొనసాగనిస్తే మీరు నిబంధనలను ఉల్లఘించినట్లు అవుతుంది.

అనుమతిలేని గైర్‌హాజరు - - FR.18 కు సవరణలు

ప్రభుత్వ ఉద్యోగి అనుమతిలేని గైర్ హాజరు అయిన ఈ క్రింద తెలిపిన సందర్భాలలో తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించవలసియున్నది.

(Amendment issued to FR. 18 by adding as FR. 18-A issued in G.O.Ms. No. 128 Finance (FRI) dept. dt. 1-6-2007).

1. ఒక సంవత్సర కాలానికి మించి అనుమతిలేని గైర్ హాజరు (Absent) అయిన యెడల లేక

2. సెలవుపైగాని లేక, సెలవుగాని కాలం ఐదు సంవత్సరములు మించిన యెడల లేక

3. ప్రభుత్వం అనుమతించిన కాలాన్ని మించి Foreign సర్వీసులో డిప్యూటేషన్‌పై కొనసాగిన పక్షంలో.

పై సందర్భాలలో ఉద్యోగిపై చర్యలు తీసుకొనే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను.

(Added as Rule 5- B to A.P. Leave Rules 1933 in G.O.Ms. No. 129 F (FRI) Dept.dt. 1-6-2007)

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను. పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను. నాకు ఎన్ని ELs ఇస్తారు?

జవాబు:
మీరు 15 రోజుల కన్నా తక్కువగా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.


2. ప్రశ్న:
నేను రక్త దానం చేశాను. spl. CL ఎవరు ఇస్తారు?

జవాబు:
జీ.ఓ.137 తేదీ: 23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే spl. CL కూడా మంజూరు చేస్తారు.


3. ప్రశ్న:
ఇంక్రిమెంట్ ఉన్న నెలలో మెడికల్ లీవ్ పెట్టి, తరువాత నెలలో విధులలో చేరితే ఇంక్రిమెంట్ ఎప్పట్నుంచి ఇస్తారు ?

జవాబు:
సెలవు ముందు రోజు జీతం ఎంత ఉన్నదో ఆ మొత్తాన్ని సెలవు కాలమంతా జీతముగా చెల్లిస్తారు. విధులలో చేరిన తర్వాత ఇంక్రిమెంట్ మంజూరు చేసి అప్పటి నుండి మాత్రమే ఇంక్రిమెంట్ మొత్తము కలిపి జీతం చెల్లించుతారు.
G.O.Ms.133 Fin Dt.13.05.1974
G.O.Ms.192 Fin Dt.01.07.1974


4. ప్రశ్న:
On duty తరువాత రోజు CL పెట్టరాదా ?

జవాబు: 
ఆన్ డ్యూటీ పై వెళ్లినప్పుడు టి.ఏ తీసుకుంటే CL పెడితే టి.ఏ చెల్లించబడదు. ఎందుకనగా On Duty తరువాత Dutyలో తప్పనిసరిగా చేరాలి. టి.ఏ అవసరం లేదంటే CL పెట్టవచ్చును.


5. ప్రశ్న:
క్రొత్తగా విధులలో చేరిన ఉద్యోగులు సెలవురోజులలో చేరవచ్చునా ! అభ్యంతరాలు ఉన్నావా ?

జవాబు:
నిబంధనల ప్రకారంగా సెలవు రోజులలో చేరకూడదు. కానీ ప్రస్తుతం రోజుల్లో సెలవు రోజున కూడా జాయిన్ అవ్వమని అధికారులే ఆదేశాలు జారీ చేస్తున్నందున నిబంధనలతో పనిలేదు. అధికారుల ఆదేశానుసారం ఎప్పుడైనా జాయిన్ కావచ్చును

18, జూన్ 2021, శుక్రవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?

జవాబు:
జీ.ఓ.1063 తేదీ: 2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.


ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు. అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?

జవాబు:
ఆర్.సి. 2071 తేదీ: 21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెలలోనే ఇవ్వాలి.


ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవుకి అర్హత ఉందా?

జవాబు:
Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా, ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.


ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?

జవాబు:
ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హతలతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.


ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను. 6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను. 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి? నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.

జవాబు:
మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ, బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి. మెమో.34408 తేదీ: 4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.

ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో తదుపరి మార్పులు అవసరం లేదని

ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో తదుపరి మార్పులు అవసరం లేదని మరియు దీనిని అమలు చేయడం కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు.  సవరించిన పే స్కేల్స్, 2020 లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుపై మొదటి పే రివిజన్ కమిషన్ సిఫారసును అంగీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు తదనుగుణంగా, ఈ క్రింది విధంగా సూచించిన విధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను కొనసాగించాలని ఆదేశించింది:

ఆర్డర్: 

ప్రభుత్వం మొదట పైన చదివిన క్రమంలో, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టింది, అర్హత లేనివారికి ప్రత్యామ్నాయంగా వాటిని పొందలేము.  ఖాళీల లభ్యత.  ప్రమోషన్లు, కాని సవరించిన పే స్కేల్స్

2. 2015 లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేయడానికి పైన పేర్కొన్న 16 వ రిఫరెన్స్‌లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

3. ప్రభుత్వంలో 17 వ పైన చదివిన, 1 వ పే రివిజన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా, ఆదేశాలు  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన పే స్కేల్స్ 2020 ను అమలు చేయడానికి జారీ చేశారు.  ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో తదుపరి మార్పులు అవసరం లేదని మరియు దీనిని అమలు చేయడం కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు.  సవరించిన పే స్కేల్స్, 2020 లో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుపై మొదటి పే రివిజన్ కమిషన్ సిఫారసును అంగీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు తదనుగుణంగా, ఈ క్రింది విధంగా సూచించిన విధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను కొనసాగించాలని ఆదేశించింది:

4. ప్రస్తుతం ఉన్న  స్పెషల్ గ్రేడ్, SPP-IA / SAPP-IA, SPP-IB / SAPP-IB, SPP-II / SAPP-II ను 6 సంవత్సరాల తరువాత స్పెషల్ గ్రేడ్‌తో కొనసాగించవచ్చు, 12 సంవత్సరాల తరువాత SPP-IA / SAPP-IA, SPP-  18 సంవత్సరాల తరువాత IB / SAPP-IB మరియు 24 సంవత్సరాల తరువాత SPP- II / SAPP-II.  i.  ప్రమోషన్ కోసం అదనపు అర్హతలను సూచిస్తూ సేవా నియమాలు సవరించబడితే, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ గ్రేడ్‌ల క్రింద స్పెషల్ ప్రమోషన్ పోస్టులకు నియామకం కోసం అటువంటి అధిక అర్హతలను కలిగి ఉన్న ప్రస్తుతమున్నవారికి మినహాయింపు ఇవ్వవచ్చు.  ii.  ఉద్యోగి ప్రయోజనం పొందినప్పటికీ F.R.22-B కింద పే ఫిక్సేషన్ యొక్క ప్రయోజనం పదోన్నతిపై కొనసాగించబడుతుంది ii.  SG లేదా SPP I-A మరియు SpP I-B క్రింద మరియు ఇది జూనియర్ కంటే సీనియర్ డ్రాయింగ్ తక్కువ వేతనానికి దారితీస్తే, సీనియర్ యొక్క చెల్లింపు G.O.Ms.No.297, ఫిన్ లో పేర్కొన్న షరతులకు లోబడి జూనియర్ యొక్క వేతనానికి చేరుకుంటుంది.  (పి.ఆర్.సి.ఐ) విభాగం, తేదీ: 25-10-1983.  రెగ్యులర్ ప్రమోషన్‌ను ప్రారంభించడానికి సేవా నియమాలను సడలించిన చోట, అవి స్వయంచాలకంగా iv కి విస్తరించాలి.  SPP-IA / SPP-II యొక్క ప్రయోజనాన్ని విస్తరించే ప్రయోజనాల కోసం స్వయంచాలక అభివృద్ధి పథకం.  అటెండర్, డాఫెదార్, జమేదార్ మరియు రికార్డ్ అసిస్టెంట్లు లేదా రోనియో ఆపరేటర్లు వంటి కొన్ని వర్గాలలో, ఈ వర్గాలలో వారు చేసిన సేవలు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ యొక్క ప్రయోజనం కోసం లెక్కించబడతాయి.  వి. Vi.  స్వయంచాలక అభివృద్ధి పథకం యొక్క ప్రయోజనం సవరించిన ప్రమాణాలలో గ్రేడ్- XXV ను కలుపుకొని, అంటే రూ .72850-147310.
 
5. SPP-II యొక్క ప్రయోజనాన్ని పొందిన ఉద్యోగులు వారి తదుపరి ప్రమోషన్లపై ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకానికి అర్హులు కాదు.

6. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌కు నియామకం కోసం లెక్కించాల్సిన సేవ ప్రభుత్వ మెమోలో పేర్కొనబడినది. పైన చదివిన సంఖ్య 11 వ.

7. నిర్దేశించిన అన్ని షరతులు, ఎప్పటికప్పుడు జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు మరియు సూచనలు, ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నంతవరకు, అమలులో కొనసాగుతాయి.

ఈ ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు మరియు సహాయక సంస్థల బోధన మరియు బోధనేతర సిబ్బందికి వర్తిస్తాయి, రాష్ట్ర పే స్కేల్స్ గీయడం మరియు రివైజ్డ్ స్కేల్స్, 2020 లో గ్రేడ్ -1 నుండి గ్రేడ్- XXV వరకు చెల్లింపును గీయడం, అంటే వరకు మరియు సహా  పే స్కేల్ రూ .72850-147310.  *8. & 9. ఈ పథకం 01.07.2018 నుండి మరియు అమల్లోకి వచ్చినట్లు భావించబడుతుంది.  సవరించిన పే స్కేల్స్, 2020 లో 01.07.2018 నుండి 31.03.2020 వరకు ఉన్న కాలపరిమితి ప్రకారం వేతన ఫిక్సేషన్ బకాయిలు అనూహ్యంగా సర్దుబాటు చేయబడతాయి.  01.04.2020 నుండి 31.03.2021 వరకు ఉన్న బకాయిలు, ఉద్యోగిని పర్యవేక్షించే సమయంలో లేదా ఉద్యోగి మరణించిన సందర్భంలో చట్టపరమైన వారసులకు చెల్లించబడతాయి.  01.04.2021 నుండి 31.05.2021 వరకు ఉన్న బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించబడతాయి.  సవరించిన పే స్కేల్స్, 2020 లోని పథకం ప్రకారం వేతన ఫిక్సేషన్ ప్రకారం జీతం 2021 జూలైలో చెల్లించాలి, 2021 జూలైలో చెల్లించబడుతుంది.

10. సవరించిన పే స్కేల్స్, 2020 లో ప్రత్యేక గ్రేడ్ స్కేల్స్ సూచించినట్లు  అనుబంధం -1 లో.  చివరి గ్రేడ్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్లు, రోనియో ఆపరేటర్లు మరియు డ్రైవర్ల వర్గాలకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ స్కేల్స్ అనుబంధం -2 లో సూచించబడ్డాయి.

11. పై నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా వేతన ఫిక్సేషన్లు వేతన సవరణకు బాధ్యత వహిస్తాయి మరియు దానిపై చెల్లించిన అదనపు మొత్తం ఎటువంటి నోటీసు లేకుండా సంబంధిత ఉద్యోగుల జీతాల నుండి తిరిగి పొందబడుతుంది.

12. ప్రభుత్వ ఉత్తర్వులను http://goir.telangana.gov.in మరియు http://ifmis.telangana.gov.in అనే చిరునామాలలో పొందవచ్చు.   (ఆర్డర్ ద్వారా మరియు తెలంగాణ ప్రభుత్వ పేరులో)

17, జూన్ 2021, గురువారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యతలు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?

జవాబు:
FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతితో జమ చేయవలసి ఉంటుంది.


2. ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?

జవాబు:
DEO అనుమతితో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105; తేదీ: 2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజిలో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.


3. ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీఅంబర్సుమెంట్ వర్తిస్తుందా?

జవాబు:
APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ, నాన్నలకి మాత్రమే వర్తిస్తుంది.


4. ప్రశ్న:
నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఐతే ఏమి చెయ్యాలి?

జవాబు:
జీఓ.102; తేదీ: 24.4.1985 ప్రకారం 5రూ. స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేయించి, DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించాలి. స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.


5. ప్రశ్న:
నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా?

జవాబు:
ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి, కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

2010 లో PRC వచ్చిన తరువాత మా scale తగ్గించారు.

ప్రశ్న:
2008 నవంబర్ లో జాయిన్ అయినప్పుడు PRC 2005 ప్రకారం  మా basic pay 9285 scale లో ఉన్నాం కానీ. 2007 బ్యాచ్ వారికి పే 9520 వుంది

2010 లో PRC వచ్చిన తరువాత మా scale తగ్గించారు.

Fitment ప్రకారం 2007 బ్యాచ్ వారికి 18520 basic అయ్యింది మాకు ఒక increment తక్కువగా 18030 వుండాలి కానీ మాకు 17050 ఫిక్స్ చేశారు. అందు వల్ల మేము నష్టపోయామము. దీనికి పరిష్కారం ఏమైనా ఉన్నదా?

సమాధానం:
మీరు ఏ క్యాడర్ ఓ తెలియదు. మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు అర్థం అయిన దానిని బట్టి చూస్తే.

01.07.2018 ముందు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే PRC ఫిట్మెంట్ 39% అనేది వర్తిస్తుంది. ఆ తరువాత జాయిన్ అయిన వాళ్లకి MINIMUM TIME SCALE మాత్రమే 27% fitment వర్తిస్తుంది. అది ప్రతి PRC లో జరుగుతుంది.
2007 లో జాయిన్ అయిన వాళ్ళకి, 2008 లో జాయిన్ అయిన వాళ్ళకి 3 INCREMENTS తేడా రావచ్చు.

A fitment benefit of 39% would be given for fixing the pay in the
Revised Pay Scales, 2010 as against the fitment benefit of 27%
recommended by the Ninth Pay Revision Commission.

అలాగే ఇప్పుడు తెలంగాణ లో ఇచ్చిన PRC తీసుకుంటే ఒక అటెండర్ 01.07.2018 (13000 pay)  (01.06.2018 జాయిన్ అయ్యాడు అనుకోండి) కి ముందు జాయిన్ అయ్యి ఉంటే అతనికి 30% ఫిట్మెంట్ తో కొత్త PRC ప్రకారం 20920 పే ఫిక్స్ అవుతుంది.
అలా కాకుండా 01.07.2018 తరువాత అంటే ఉదాహరణకు 02.07.2018 కి జాయిన్ అయ్యి ఉంటే అతని పే 13000 నుండి 19000 కి ఫిక్స్ అవుతుంది.

అంటే 1 నెల తేడా తో జాయిన్ అయిన వాళ్ళకి 3 increments తేడా వస్తుంది.

దానికి ఏమీ పరిష్కారం ఉండదు.

01.07.2018 నాటికి మీరు సర్వీస్ లో లేరు.

కాబట్టి మీకు పే ఫిక్సషన్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇలాంటి తేడాలు రాకూడదు అంటే మన సంఘాలు ఫిట్మెంట్ విషయంలో బేరాలాడి ఎక్కువ ఫిట్మెంట్ పొందకూడదు. ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రతీసారి ఇలాంటివి తప్పదు.

అలాగే 01.07.2008 న ఇవ్వాల్సింది 2010 లో ఇవ్వడం వల్ల మీకు పాత స్కేల్, కొత్త స్కేల్ తేడా, పాతవారికి, కొత్తవారికి తేడా అనేది తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో 01.07.2018 నే PRC అమలు చేసి ఉంటే 11/2018 లో చేరిన మీకు ఈ తేడా తెలీదు (ఆ ఆలోచనే రాదు)

2010 PRC లో ఇచ్చిన భారీ ఫిట్మెంట్ వల్ల నష్టం కలిగినట్లుగా భావించిన మీరు 2015 లో భారీ ప్రయోజనం పొంది ఉంటారు. అప్పుడు కూడా ఇలాగే 2013-2015 మధ్య చేరిన వారికి ఇదే పరిస్థితి ఉత్పన్నం అయింది. 1999 లో కూడా ఇదే పరిస్థితి.

ఒక్క 2005 లో మాత్రం, తక్కువ ఫిట్మెంట్ కారణంగా కొత్తగా చేరిన వారికి ఎక్కువ లబ్ది, పాత వారికి తక్కువ లబ్ది కలిగింది.

ఇలాంటి తేడాలు రాకూడదు అంటే ఫిట్మెంట్ కి అనుగుణంగా మాస్టర్ స్కేల్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ మాస్టర్ స్కేల్ పెంచితే సాపేక్షంగా మీకు ఇతరులతో పోల్చి లబ్ది కలిగినట్లు కనిపిస్తుంది. కానీ, మాస్టర్ స్కేల్ పెంపు వల్ల కేంద్రం తో పోల్చినపుడు మనకు వచ్చే DA తగ్గిపోతుంది. దాని ప్రభావం తదుపరి PRC లపై కూడా పడుతుంది. అందరితో పాటు ఆ నష్టం మీకు కూడా కలుగుతుంది.

ఉదాహరణకి 2010 లో మాస్టర్ స్కేల్ 39% కి అనుగుణంగా పెంచినట్లయితే 2015 నాటికి DA 63% మీ బదులుగా ఏ 40% ఉండేది.

అలాగే 2015 మాస్టర్ స్కేల్ కనుక 43% ఫిట్మెంట్ కి అనుగుణంగా పెంచినట్లయితే ఇప్పుడు prc లో కలపాల్సిన DA 30% కి బదులు 20% గా ఉండేది. అంటే ఇప్పుడు మన డ్రా చేస్తున్న బేసిక్ పే లకన్నా ఎంతో తక్కువ ఉంటాయి. (మీతో సహా)

16, జూన్ 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ కి దరఖాస్తు చేయవచ్చా?

జవాబు:
చేయవచ్చు.


2. ప్రశ్న:
Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే వాలంటీర్ రిటైర్మెంట్ కి అప్లై చేయాలా? సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ప్రయోజనమా?

జవాబు:
సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.


3. ప్రశ్న:
అక్టోబర్ 2018 నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి కొత్త PRC వర్తిస్తుందా?

జవాబు:
PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. కనుక వర్తిస్తుంది


4. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత GIS కంటిన్యూ చేయవచ్చా? GIS అమౌంట్ ఎంత వస్తుంది?

జవాబు:
వాలంటరీ రిటైర్మెంట్ తరువాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.


5. ప్రశ్న:
20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?

జవాబు:
వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే...
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87%  (చివరి మూలవేతనంలో)
21>39.40%
22>40.90%
23>42.40%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50.00%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది...

15, జూన్ 2021, మంగళవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను. మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది. మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది. మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు. వాస్తవమేనా?

జవాబు:
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విషయం మాత్రమే జి.ఓ.209; తేది.21.11.2016 పేర్కొనడం జరిగింది. కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు. ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది. కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వరు.


2. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

జవాబు:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.


3. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

జవాబు:
వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.


4. ప్రశ్న:
ఒక టీచరుకు అక్టోబర్ 2021 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

జవాబు:
20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.


5. ప్రశ్న:
ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

జవాబు:
క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

హిందూ వారసత్వ చట్ట ప్రకారం ఆస్తికి వారసులెవరు ?

న్యాయ సలహాలు

హిందూ వారసత్వ చట్ట ప్రకారం  ఆస్తికి వారసులెవరు ?
-----------------------
1956 నాటి హిందూవారసత్వచట్టం ఆస్తికి వారసులు రెండు రకాలుగా ఉంటారని తెలియచేస్తోంది. ఈ చట్టంలోని 4,6, 23, 24,30 సెక్షన్లను  2005 సంవత్సరంలో సవరించడం జరిగింది.

ఈ చట్టం ప్రకారం క్లాస్ - 1 వారసులు అనగా మొదటి తరగతి వారసులు ఎవరంటే.

(తండ్రి చనిపోతే)

(1) విధవరాలైన భార్య / భార్యలు
(2) కొడుకులు
(3) కూతురులు
(4) తల్లి
(5) మనుమలు మనుమరాల్లు

ఇక Class - 2 అనగా
 రెండోతరగతి వారసులనగా ! తండ్రి చనిపోయిన పక్షంలో !

(1) చనిపోయిన వ్యక్తి తండ్రి
(2) కొడుకుల లేదా కూతురుల కొడుకులు ( మనుమలు, మనుమరాల్లు)
(3) కొడుకు యొక్క కూతురు (మనుమరాలు) అలాగే కూతురు యొక్క కూతురు.
(4) సోదరుడు
(5) సోదరి
(6) కూతురు యొక్క కొడుకు, లేదా కొడుకుయొక్క కూతురు
(7)  కూతురు యొక్క కొడుకు ఆ కొడుకు కలిగిన కూతురు
(8) కూతురు యొక్క కూతురు యొక్క కొడుకు (కూతురు కూతురు కొడుకు)
(9) కూతురు యొక్క కూతురు యొక్క కూతురు
(10) సోదరుని కొడుకు
(11) సోదరికొడుకు
(12)  సోదరుని కూతురు

ఇక స్త్రీ చనిపోయిన తరువాత

(1) భర్త, కొడుకులు
(2) భర్త వారసులు అంటే అతని అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు
(3)  తల్లిదండ్రులు
(4) తండ్రి యొక్క వారసులు
(5) తల్లి యొక్క వారసులు.

ఇక ఒక వ్యక్తికి ఆస్తి సంక్రమించిన తరువాత నాలుగురకాలైన హక్కులు అతనికి ఆ హక్కుపై సంక్రమిస్తాయి. అవి

ఆస్తులు మూడు రకాలు (1) చరాస్తులు Movable Property (2) స్థిరాస్తులు immovable Property (3) మేధో సంబంధఆస్తులు. (మేధోసంబంధ ఆస్తులగురించి తరువాత చర్చికుందాం ) మేధో సంబంధంకాని చరాస్తులలో ఇంటిసామానులు, వాహనాలు, పశుసంపద, బంగారు, వెండి, ధనం మొదలైనవి ఉంటాయి. ఈ ఆస్తులను చరింపచేయటానికి అనగా చలింపచేయటానికి అనగా ఒకచోటనుండి మరోచోటికి మార్చటానికి ఆస్కారముంటుంది కనుక చరాస్తులు అంటారు. immovable Property లేదా స్థిరాస్తి అనగా చలింపచేయటానికి వీలుకాని సంపద. ఉదా॥ భూమి మొదలైనవి. భూమిని ఒకచోటనుండి  మరోకచోటికి మార్చలేము.

(1) Right of Possesion. ఆస్తిని కలిగివుండే హక్కు. ఎంతకాలమైనా సరే ఇతరులకు అన్యాక్రాంతం చేయకుండా వుంచుకొనేహక్కు.

(2) Right of Control. ఆస్తిని తాను నియంత్రించుకొనే హక్కు. తన నియంత్రణలోని భూములలో బావి, బోరు, విద్యుత్తు, కాలువలు మొ॥ అభివృద్ధిపనులు,తనకు ఇష్టమైన పంటలు పండించుకొనే హక్కు,  చివరకు బంజరుగా వుంచుకొనేహక్కు కలిగివుంటాడు. ఇక ఇల్లు, కర్మాగారాలు, ఇతర సంస్థలకు ఇవే హక్కులు ఉంటాయి.
న్యాయపరంగా దక్కిన ఆస్తులకే హక్కులుంటాయి.

(3) Right of Exclussion తనకు సంక్రమించిన ఆస్తిలో కొంతభాగాన్ని అమ్ముకోవడం, దానంచేయడం,తాకట్టు పెట్టుకోవడం, లీజుకు ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం, బుుణం పొందడం చేయవచ్చును.

(4) Right of Dispossession.. తనకు సంక్రమించిన ఆస్తిని పూర్తిగా విక్రయించుకోవడం, దానంచేయడం, తాకట్టుపెట్టడంలాంటి హక్కుకలిగివుంటారు.

14, జూన్ 2021, సోమవారం

సెలవులు - వివరంగా తెలుసుకుందాం

సెలవులు

వివరంగా తెలుసుకుందాం

ఇప్పటికి సెలవులు ఎలా దరఖాస్తు చేసుకొని ఆమోదించుకోవాలి.. ఏ విధంగా సదరు కాలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే సందేహాలు మనలో చాలామందికి ఉన్నాయి.. మనకున్న సందేహాలు పై కొన్నింటిని వివరించడం జరిగింది.

1) కవల పిల్లలు /ఇద్దరు పిల్లలు తరువాత అబార్షన్ చేయించుకుంటే 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తించదు.

2) ఫండమెంటల్ రూల్ 72 ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగి సదరు సెలవు పూర్తి కాకుండా డ్యూటీ లో జాయిన్ అవ్వడానికి ముందస్తు అనుమతి పొందాలి.

3) ఫండమెంటల్ రూల్68(5) ప్రకారం లోకల్ హాలిడే కి prefix గాని suffix గాని చేసుకునే అవకాశం లేదు.

4) ఫండమెంటల్ రూల్65(బి) ప్రకారం డిస్మిస్ అయిన ఉద్యోగి మరలా నియమించబడితే పూర్వపు సర్వీస్ ని పరిగణలోకి తీసుకోవాలి.

5) ఫండమెంటల్ రూల్ 68(3) ప్రకారం E L కి prefix గాని suffix చేసుకున్నప్పుడు లీవ్ అకౌంట్ నుండి ఆ రోజులు డెబిట్ చేయరాదు.

6) ఫండమెంటల్ రూల్ 101(2)  ప్రసూతి సెలవు అనంతరం మెడికల్ సర్టిఫికెట్ జత చేస్తూ ఏ ఇతర సెలవైన తీసుకోవచ్చును.

7)ప్రమాదానికి గురైన ఉద్యోగి గాని,తీవ్ర అనారోగ్యానికి గురి అయిన ఉద్యోగి గాని సెలవు కాలం అయిపోయిక కూడా మెడికల్ సర్టిఫికేట్ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్ జత చేసి సెలవు మంజూరు చేసుకోవచ్చును.

8) గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఉద్యోగులు కు హాఫ్ పే లీవ్ ఉంటే 6 నెలలు వరకూ పూర్తి జీతం పొందవచ్చును.

9) GOMS NO133 ప్రకారం ఉద్యోగి కార్యాలయం పని నిమిత్తం ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురి అయితే మాత్రమే స్పెషల్ disability లీవ్ కి అర్హులు.

10) సాధారణ సెలవులు prefix suffix కలుపుకొని పది రోజులకి మించరాదు

13, జూన్ 2021, ఆదివారం

పెన్షనర్ల కు అదనపు పెన్షన్

పెన్షనర్ల కు అదనపు పెన్షన్

GO 57 ప్రకారం -

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ కు 70 సంవత్సరముల వయస్సు  దాటితే అదనపు పెన్షన్ పొందే అవకాశం కలదు. ఈ అదనపు పెన్షన్ వారి వయస్సును బట్టి క్రింది విధముగా పెరుగుతుంది.  ఈ పెరుగుదల వారి నూతన బేసిక్ పెన్షన్ మీద ఉంటుంది.



70 - 75 సం. - 15 %
75 - 80 సం. - 20 %
80 - 85 సం. - 30 %
85 - 90 సం. - 40 %
90 - 95 సం. - 50 %
95 - 100 సం. - 60 %
100 సం. పైన - 100 % పెరుగుదల ఉంటుంది.

పుట్టిన తేదీ నెల మధ్యలో ఉన్నను, ఆర్ధిక లాభం ఆ నెల మొదటి తేదీ నుండి వర్తిస్తుంది.

ఉదాహరణకు --
ఒక పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్ కు 16.08.2021 కు 70 సంవత్సరములు నిండితే , అతను /ఆమె కు  01.08.2021 నుండి అతను / ఆమె బేసిక్ పెన్షన్ లో 15 % పెంచి, దాని మీద కరువు భత్యం కలిపి చెల్లిస్తారు.

పెన్షన్ రు.10,000 అయితే 15% చొప్పున రు.1,500 పెంచి మొత్తం రు. 11,500 చెల్లిస్తారు. ఈ 11,500 మీద కరువు భత్యం కూడా ఇస్తారు.  ఇది 01.08.2018 నుండి అమలు లోనికి వచ్చినా, ఆర్ధిక లాభం మాత్రం 01.04.2020 నుండి ఇస్తారు.

పెంచిన క్వాంటం పెన్షన్ ను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో స్పష్టం గా వ్రాస్తారు.

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules  నందు13,18,23 నందు పొందుపరచారు.

సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.

సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
(G.O.Ms.No.165 Dt:17-08-1967)
ఉదా: ఒక ఉద్యోగి 25.04.1990 న అపాయింట్ అయ్యి 31.12.2020 న రిటైర్ అవుతాడు అనుకుంటే అతని HPL ఖాతా లెక్కింపు విధానం..
25.04.1990 నుండి 24.04.2020 వరకు 30 ఏళ్ళ సర్వీసుకు 30*20=600 రోజులు జమ చేస్తారు.
25.04.2020 నుండి 31.12.2020 వరకు ఉన్న సర్వీస్ పీరియడ్ కు హాఫ్ పే లీవ్ ఏమి జమ కాదు.
కారణం:ఒక సం. సర్వీస్ కు  కొన్ని రోజులు తక్కువైన ఈ సెలవు జమ కాదు

ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.
EOL కి వెళ్లినా కూడా ఆ పీరియడ్ కి కూడా ఈ సెలవు మంజూరు చేస్తారు. అందుకే దీనిని "Un earned leave" అంటారు.

అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట, జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు. సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1. వైద్య ధృవపత్రం ఆధారంగా (Medical Certificate)
2. స్వంత వ్యవహారాలపై (Private Affairs)

సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును. ఇంక్రిమెంట్లు, సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

వైద్య కారణములపై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవుఅందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}

కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకుపెంచడమైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)

సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

240 రోజుల పూర్తి జీతం వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు
(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)

అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు.

క్యాన్సర్, మానసిక జబ్బులు, కుష్టు, క్షయ, గుండె జబ్బు,మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
(G.O.Ms.No.386 Dt:06-09-1996) (G.O.Ms.No.449 Dt:19-10-1976)

వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
(G.O.Ms.No.29 Dt:09-03-2011)

ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు. (G.O.Ms.No.143 Dt:01-06-1968)

ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
(G.O.Ms.No.33 F&P Dt:29-01-1976)