LATEST UPDATES

15, జూన్ 2021, మంగళవారం

సందేహాలు - సమాధానాలు

This is a simple translate button.

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను. మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది. మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది. మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు. వాస్తవమేనా?

జవాబు:
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విషయం మాత్రమే జి.ఓ.209; తేది.21.11.2016 పేర్కొనడం జరిగింది. కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు. ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది. కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వరు.


2. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

జవాబు:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.


3. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

జవాబు:
వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.


4. ప్రశ్న:
ఒక టీచరుకు అక్టోబర్ 2021 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

జవాబు:
20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.


5. ప్రశ్న:
ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

జవాబు:
క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి