LATEST UPDATES

4, ఆగస్టు 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:
సార్ ....డిపార్ట్మెంటల్ టెస్ట్ లకు హైస్కూల్ లో వర్క్ చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు రికార్డ్  అసిస్టెంట్ ఏ కోడ్ పేపర్స్ అప్లై చెయ్యాలి.?

జవాబు:
Deputy inspector test total 3 పేపర్స్ పేపర్ codes 2, 12,20.:; ఇంకా Account test for subordinate officers test paper  code 08 ఇవి రాయాలి.


ప్రశ్న:
రిటైర్మెంట్ ఏజ్ కు, కమ్యుటేషన్ సంబంధం ఉంటుందా? కమ్యుటేషన్ amount అనేది మన  పెన్షన్ amountలో కట్ చేసి కదా ఇచ్చేదీ, ఫ్రీ గా ఇవ్వటం లేదు కదా sir ! Clarity ఇవ్వగలరు.

జవాబు:
అవును. రిటైర్మెంట్ ఏజ్ కి కమ్యూటేషన్ కి సంబంధం ఉంది. ఏజ్ పెరిగే కొద్దీ కమ్యూటేషన్ ఫాక్టర్ విలువ తగ్గుతుంది. అయితే అడిషనల్ క్వాంటం పెన్షన్ కి కమ్యూటేషన్ కి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్ధం కాలేదు.

58 ఏళ్ల వయసులో కమ్యూట్ చేస్తే 8.371 ఉన్న కమ్యూటేషన్ ఫాక్టర్ 61 ఏళ్లకు రిటైర్ అయితే 8.093 కి తగ్గుతుంది.
అయితే అది 15 ఏళ్ల పాటు రికవరీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా కమ్యూటేషన్ తీసుకున్న ఒక సంవత్సరం లో చనిపోయినా కూడా మిగిలినది ఫ్యామిలీ పెన్షన్ నుండి కానీ, వారసుల నుండి కానీ రికవరీ చేయరు.

కమ్యుటేషన్ కోసం అప్షన్ ఇచ్చిన తరువాత కమ్యూటేషన్ చెల్లించే లోపు సర్వీస్ పెన్షనర్ చనిపోయినా కుటుంబ సభ్యులకి ఆ కమ్యూటేషన్ చెల్లిస్తారు. ఒక్క రూపాయి కూడా రికవరీ ఉండదు.

1, ఆగస్టు 2021, ఆదివారం

***** మిత్రమా సెలవా మరి ***** స్మృతి కవిత

***** మిత్రమా సెలవా మరి *****
              స్మృతి కవిత
(ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇటీవల మృతిచెందిన నా బాల్యమిత్రునికి అక్షరాంజలి)

వాడెప్పుడు కన్పించినా
ఒరేయ్ పంతులు అంటూ...
ఆప్యాయతల పలకరింపులు చిలకరిస్తూ
ఆత్మీయ కరచాలనమై తీగలా అల్లుకుపోతాడు.

చెట్టాపట్టాలేసుకొని
మొన్నటి బాల్యం తోటలో
చెట్టుపుట్టలన్నీ తూనీగల్లా తిరిగాం.
నిన్నటి యవ్వనం రుతువులో
ఉరకల పరుగుల
దూకుడు జలపాతాలమై
కవ్విస్తు నవ్విస్తు
పసందైన ఆటపాటలతో 
ఎందరినో అలరించాం.

కూడబలుక్కున్న తోడుదొంగల్లా
రకరకాల రుచులు వినోదాలు అన్వేషిస్తూ
పట్నంలో
హోటల్లు సినిమాటాకీస్ లెన్నింటినో 
ముట్టడించాం.

క్రికెట్ లో బంతుల అస్త్రాలు సంధిస్తూ
వికెట్లవేటలో విలుకాడిలా నేను..
బ్యాట్ తో బంతుల్ని తరుముతు
పరుగులకు అయాసం పుట్టిస్తూ నీవు..
గెలుపుగుర్రాలపై సవారీ చేస్తు
మ్యాచ్ లెన్నో మలుపు తిప్పి
ప్రశంసలవర్షంలో అభినందనలవెల్లువలో
ఆనందాలపడవలమై తేలిపోయాం.

మనపై
విమర్శల రాళ్ళు,పుకార్లబురద పడినా
ప్రతిఘటన కవచాల్లా పరస్పరం
అండగా నిలిచాం.
గ్రాంఫోన్ రికార్డ్ లా తిరుగుతు 
ఊరంతా  నా ఉద్యోగవిజయాన్ని చాటావు.
నిన్నటి వర్తమానం వరకు నీడలా మసిలి
నేడు బ్రతుకుపుస్తకంలో 
చివరి సంతకం చేసి వెళ్ళిపోతావా?

నీవు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలను మూటకట్టుకుంటూ
గుండెగూట్లో పదిలపర్చుకుంటున్నా
మళ్ళీ 
రేపటి ముదిమి సంధ్యలో ఒక్కొక్కటిగా
నెమరేస్తూ పూటగడపాలి.
నన్నో స్తంభించిన కాలాన్ని చేసి
నీవొక చేరలేని కాంతిసంవత్సరలా దూరమైనావు
ఐనా మనస్నేహం
మైత్రివనాలకు స్వాగతం పలికే
సోపతిసోపానలై నిలుస్తాయి.
అక్షరాంజలి ఘటిస్తు...
మిత్రమా
ఇక సెలవా మరి
                           నీ నేస్తం
                      గంజి.దుర్గాప్రసాద్
                        9885068731

సందేహాలు -సమాధానాలు

సందేహాలు -సమాధానాలు

ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?

జవాబు:
వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు. 1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.


ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?

జవాబు:
కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థలకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.


ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా?

జవాబు:
FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.


ప్రశ్న:
పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్ పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా?

జవాబు:
మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది. 2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు. ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.


ప్రశ్న:
OH, ఆదివారాలను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా?

జవాబు:
మెమో.86595, తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.


ప్రశ్న:
TSGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా?

జవాబు:
జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించేవారు గుడ్ హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.


ప్రశ్న:
మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి?

జవాబు:
హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.

ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?

జవాబు:
క్వాలిఫై సర్వీసుకి 61 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.


ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి?

జవాబు:
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు (కోడ్--37) రాయాలి. అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.