LATEST UPDATES

24, అక్టోబర్ 2018, బుధవారం

JAWAHAR NAVODAYA ​​VIDYALAYA SELECTION టెస్ట్ (JNVST) క్లాస్ VI 2019-2020

Click Here to Get Online Application
నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV లు) ప్రారంభించారు. ప్రస్తుతం JNV లు వ్యాప్తి చెందుతాయి 28 రాష్ట్రాలు మరియు 07 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి సహ విద్యాశాలలు  ఒక స్వతంత్ర సంస్థ ద్వారా పూర్తిగా భారతదేశ ప్రభుత్వం ఆర్ధికంగా నిర్వహించబడుతుంది
సంస్థ, నవోదయ విద్యాలయ సమితి. JNV లలో అడ్మిషన్స్ ద్వారా తయారు చేస్తారు
క్లాస్ VI కు JAWAHAR NAVODAYA ​​VIDYALAYA SELECTION టెస్ట్ (JNVST). ఈ
JNV లలో బోధన మాధ్యమం వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాష గణితం మరియు సైన్స్ మరియు సామాజిక కోసం హిందీ తరువాత క్లాసు VIII మరియు ఇంగ్లీష్ సైన్స్. JNV ల యొక్క విద్యార్ధులు X మరియు XII తరగతి పరీక్షల కోసం కనిపిస్తారు
సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ బోర్డ్. పాఠశాలల్లో విద్య ఉచితం బోర్డు మరియు వసతి, ఏకరీతి మరియు పాఠ్యపుస్తకాలు, రూ. 600 / - నెలకు విద్యావయ వికాస్ నిధి వైపుగా మాత్రమే క్లాసులు IX నుండి XII వరకు విద్యార్థులు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్ధులు, బాలికలు, విద్యార్ధులు కుటుంబ ఆదాయం పేదరికం (BPL) క్రింద మినహాయించబడింది. ప్రతి విద్యార్థికి రూ .1500 / - తల్లిదండ్రులందరికీ ప్రతి నెలలో విద్యార్థులందరి నుండి సేకరించబడుతుంది.

జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ - 2019
JNV లలో క్లాస్- VI కు ప్రవేశపెట్టిన JNV ఎంపిక టెస్ట్ అకాడెమిక్ సెషన్ కోసం
2019-20 శనివారం, ఏప్రిల్ 6, 2019 న, 11:15 A.M. జరుగును
ఒక దశలో అన్ని జవహర్ నవోదయ విద్యాలయాలకు.
ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నవంబర్ 30
Click Here to Visit Official Website
Click Here to Get Online Application

26, ఆగస్టు 2018, ఆదివారం

*0* కి విలువెంత

*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే
*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!

*0* లేకుండా
*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!

*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!

*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె!
*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె! 

*పది* మధ్యలో దూరి
*పంది* గా మారె!
*నది* మధ్యలో దూకి
*నంది* గా మారె!

ప్రతి *కొంప* లోనూ
అది తిష్ట వేసింది!
*0* లేనట్టి *సంసారమే* లేదు!

*కాంగి* లోనూ దూరె!
*దేశం* లోనూ దూరె!
*కమలం* లోనూ దూరే !
అది *రాజకీయం* కూడా నడుపుచుండె!
*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ!

*గుండుసున్నా*
అని ఎగతాళి చేయకు
*గూండా* గా మారి రుబాబు చేయు!

*ఆరంభము* న *0*!  *అంత* మందున *0*!
*జననం* లో *0*!
*మరణం* లో *0*!
*శూన్యం* లో *0*!  *అనంతము* లో *0*!

*ఇందూ*, *అందూ*
అను సందేహమేల!
*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*!  

*సత్యం*,
*శివం*,
*సుందరం*
అన్నింటిలోనూ అది అలరారుతోంది!

*0* తోటే ఉంది
*అందం*!  *ఆనందం*!
*జీవితం* లో  చివరకి మిగిలేది *0* !

*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!
*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!
నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!

తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!
తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!

ఇంత మహిమ గల *0* -
మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని
దిగులెందుకన్నా!

*గుడి* లోన జేరి *గుండి* గా,
*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా!

కనుక గుడి  *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి
మోత మోగిస్తోందన్నా!
ఆ మోత *నాదం* లోనూ *0*!

*కాలం* తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి *గంట*,
ప్రతి *దినం*,
ప్రతి *వారం*,
ప్రతి *పక్షం*, 
ప్రతి *మాసం*,
ప్రతి *సంవత్సరం*,
అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!

*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ
*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!

*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
*కంటి* లోనూ *0*! 
*పంటి* లోనూ *0*!
*కంఠం* లో *0*!
*కండరం* లో *0*!
*చర్మం* లో *0*! 
*రక్తం* లో *0*!

*దాహం* లో *0*!
*మోహం* లో *0*!
*రాగం* లో *0*! *అనురాగం* లో *0*!
*సరసం* లో *0*! 
*విరసం* లో *0*!
*కామం* లో *0*! 
*క్రోధం* లో *0*!
*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!

*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!
*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ
*దేహం* తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది *గంతు* లేస్తోంది!

"జైహో సున్నా.
జయ జయహోసున్నా" ౦ "..

23, జులై 2018, సోమవారం

Good Words

*ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం*

*మౌనం మనస్సుని  శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్నీ శుద్ది చేస్తుంది అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ది చేస్తుంది*

*ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త*

*నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి*

*సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి*

*జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదుచాలానే చూడాల్సివస్తుంది వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం*

*కరుగుతున్న కాలానికి జరుగుతున్న సమయానికి అంతరించే వయసుకి మిగలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణ0*


*అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు చేతినిండా పని కడుపునిండా తిండి కంటినిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం*


*మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించిన వ్యర్ధమే*


*మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్ధం అవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవిత0*

*నిరంతరం వెలిగే సూర్యూన్ని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది*

*ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండలని భావించకు నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో అలాగే నీకన్న తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.*

*నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు*

*జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.*

17, జులై 2018, మంగళవారం

కాళిదాసు గర్వభంగం

కాళిదాసు గర్వభంగం

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.

మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.

బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.

ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.

ఆమెను చూసి...
‘బాలికా! నాకు దాహంగా ఉంది.
నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...

‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది.

కాళిదాసు:
‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?
పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.

అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...

‘మీరు అసత్య మాడుతున్నారు.

ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.

వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...

‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.

ముందు నీళ్లు ఇవ్వమని'* బతిమాలుకుంటాడు.

అయినా ఆ బాలిక కనికరించదు.

‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’

అని అడుగు తుంది. బాలిక.

‘నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు.

‘మళ్లీ అసత్య మాడుతున్నారు.

బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.

మీరేమో అలిసి పోయారు కదా.

ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.

వారే సూర్యచంద్రులు!’

అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..

‘మాతా నీళ్లు ఇవ్వండి.

దాహం తో చనిపోయేలా ఉన్నాను..’
అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...

‘మీరెవరో సెలవివ్వండి...నీళ్లిస్తాను’  అంది.

కాళిదాసు దీనంగా...

‘నేను అతిథిని..!’* అని బదులిచ్చాడు.

‘మీరు అసత్యం చెబుతున్నారు.

ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.

ఒకటి ధనం, రెండోది యవ్వనం.

ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’* అంటుంది.

కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.

కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.

ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.

ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’* అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు..

‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.

ఆ అవ్వ నవ్వుతూ...

ఇదీ అసత్యమే.

ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.

ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.
ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’* అని అంటుంది.

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.

ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు.

ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.

‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!

కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’
అని జలమును అనుగ్రహిస్తుంది.

15, జులై 2018, ఆదివారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

✓అడవులు మానవ మనుగడకు జీవనాధారం

✓చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
✓పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
✓జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
✓భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
✓వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
✓వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
✓ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
✓మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
✓మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
✓చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
✓వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
✓చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
✓వనాలు పెంచు-వానలు వచ్చు
✓చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
✓పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
✓వనాలు-మానవాళి వరాలు
✓పచ్చని వనములు-ఆర్థిక వనరులు
✓అడవులు-మనకు అండదండలు
✓అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
✓అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
✓అటవీ సంపద-అందరి సంపద
✓చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
✓అడవులు-వణ్యప్రాముల గృహములు
✓పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
✓సతతం-హరితం
✓మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
✓చెట్టుకింద చేరు-సేదను తీరు
✓అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
✓అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
✓దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
✓స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
✓పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
✓ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
✓ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
✓పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు
✓వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు
✓ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం
✓వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి
✓బిడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ
✓మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి
✓జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి
✓జల సంరక్షణ-వన సంరక్షణ
✓పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష
✓సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం
✓ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు
✓వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాలి
✓నా లక్ష్యం హరిత తెలంగాణ
✓మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం

5, జులై 2018, గురువారం

మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..!

*Health Tip*

🛑 మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..!

*స్థూలకాయం, మధుమేహం, థైరాయిడ్‌, ఎక్కువ సేపు కూర్చోవడం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు వంటి అనేక అంశాల కారణంగా చాలా మందికి నేటి తరుణంలో మలబద్దకం వస్తున్నది. దీని వల్ల గంటల తరబడి బాత్ రూంలో కుస్తీలు పడాల్సి వస్తున్నది. అయినప్పటికీ విరేచనం సుఖంగా అవుతుందా..? అంటే.. కావడం లేదు. దీంతో రోజంతా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు. దాంతో మలబద్దకం సమస్య నుంచి ఇట్టే బయట పడవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

🛑 1. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అనే మాట మనకు తెలిసిందే. అయితే రోజుకో యాపిల్‌ను తింటే మలబద్దకం సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.

ఎందుకంటే యాపిల్‌లో 4.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. మలబద్దక సమస్యను దూరం చేస్తుంది. దీంతో సులభంగా విరేచనం అవుతుంది.

🛑 2. నారింజ పండ్లలో విటమిన్ సి మాత్రమే కాదు ఫ్లేవనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది నాచురల్ లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య పోతుంది. ఒక నారింజ పండులో 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. కనుక ఈ పండును రోజూ తింటే చాలు మలబద్దకం అన్న మాటే ఉండదు.

🛑 3. ఒక కప్పు పాప్ కార్న్‌లో ఒక గ్రామ్ ఫైబర్ ఉంటుంది. కనుక రోజుకు 4 కప్పుల వరకు పాప్ కార్న్ తిన్నా చాలు. దాంతో 4 గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. అయితే పాప్ కార్న్‌ను అలాగే తినాలి. అందులో ఫ్లేవర్ కోసం ఏ పదార్థాన్ని కలపకూడదు. కలిపితే క్యాలరీలు అధికంగా చేరుతాయి.

🛑 4. రోజుకు రెండు కప్పుల ఓట్స్ తినడం అలవాటు చేసుకున్నా చాలు. దాంతో 4 గ్రాముల వరకు ఫైబర్ అందుతుంది. అది మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.

🛑 5. రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలను తిన్నా చాలు. ఫైబర్ పుష్కలంగా అందుతుంది. మలబద్దక సమస్యను దూరం చేసుకోవచ్చు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

🛑 6. రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో కలబంద గుజ్జును తింటే దాంతో మలబద్దక సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై, విరేచనం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

వెర్రి వెంగళమ్మలు - కథ

            *వెర్రి వెంగళమ్మలు*

*అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని.*

*“మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ.*

*“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు.*

*“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ.*

*వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు.*

*తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా.*

*వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా.*

*"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా.*

*బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు.*

*మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది.*

*“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా.*

*“అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు.*

*ఆమె అమాయకపు మాటలకి వ్యాపారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకుని "ఆ బేరగాడి ఆచూకీ తెలుసుకొని వస్తాను ఆగు!" అని హడావుడిగా సంత వైపు బయలుదేరి పోయాడు.*

*సంతలో‌ మోసగాడి ఆచూకీ కొంత సులభంగానే దొరికింది. వాడి ఊరు మరీ ఏమంత దూరం కాదు. వ్యాపారి ఆ మోసగాడి ఆనవాలు పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు.*

*నడుస్తూ నడుస్తూ వెనుదిరిగి చూసిన వ్యాపారికి ఓ వింత దృశ్యం కనబడింది. అతని వెనకగా ఎద్దుల బండి ఒకటి వస్తున్నది. ఆ బండి ఇరుసుపైన ఒక కాలు నిటారుగా మోపి, క్రిందికి పడిపోకుండా సర్దుకుంటూ నిలబడి బండిని తోలుతున్నది ఒకామె. బండిలో నిండుగా గడ్డి ఉంది- కావాలనుకుంటే ఆమె గడ్డి మీదైనా కూర్చోవచ్చు; లేదా దిగి నడుచుకుంటూ అయినా రావొచ్చు. రెండూ కాకుండా ఇరుసు మీద ఎందుకు, అలా ఒంటికాలి మీద నిలబడటం? 'ఈమె ఎవరో గొప్ప అమాయకురాలిలాగానే ఉంది' అనుకుని నవ్వుకున్నాడు వ్యాపారి.*

*వెంటనే అతనికి వెంగమ్మ మాటలు గుర్తొచ్చాయి. "పాపం, వెంగమ్మ మాటలు నిజమే కావొచ్చు- లోకం ఏమంత తెలివిగా లేదు- ఈమె ఎంత వెర్రివెంగళమ్మో కనుక్కుందాం!" అనుకున్నాడు.*

*కొంచెంసేపు ఆగి, బండి తన దగ్గరికి రాగానే ఆమెని పలకరిస్తూ "ఏమమ్మా, ఎందుకట్లా ఒంటి కాలిమీద నిలబడటం? పడితే ప్రమాదం కదా? గడ్డి మీద కూర్చొని రావొచ్చు; లేకపోతే అసలు పూర్తిగా దిగి నడిచి రావొచ్చు" అన్నాడు అతను.*

*“మా అబ్బాయి అట్లా చెప్పలేదు- బండి మీదే రమ్మన్నాడు" అన్నదామె పడిపోకుండా మళ్ళీ సర్దుకొని నిలబడుతూ- "ఇంతకీ నువ్వెవరు? నిన్ను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు- ఏదో ఆకాశంలో నుండి ఊడి పడ్డట్లున్నావు!" అన్నది ఆమె.*

*వ్యాపారికి ఆమెను కొంచెం ఆటపట్టించాలనిపించింది. "అవునవును- బలే కనుక్కున్నావే?! నిజంగానే నేను ఆకాశం నుండి ఊడిపడ్డాను- మీ ఊరు చూసి పోదామని!" అన్నాడు ఎగతాళిగా.*

*ఆమె నిజంగానే అమాయకురాలు. వ్యాపారి మాటలు నిజమనుకున్నది. "అవునా, అయితే నిన్నొకటి అడుగుతా చెప్తావా? మా ఇంటాయన పైకి వెళ్ళి మూడేళ్ళవుతున్నది. నీకు ఆయన అక్కడ కనిపించే ఉండాలి కదా, ఎట్టా ఉన్నాడు, కులాసానేనా?!” అని అడిగింది సూటిగా.*

*'వార్నాయనో, ఈమెవరో మా వెంగమ్మ కంటే వెంగళమ్మ. దేశంలో నిజంగానే చాలామంది అమాయకులు ఉన్నట్లున్నది" అనుకున్నాడు వ్యాపారి- "ఓఁ, చూడకేమి?! రోజూ చూస్తూనే ఉన్నాను మీ ఇంటాయన్ని. పాపం ఆయనకి అక్కడ గొర్రెలు కాచే పని ఇచ్చారు. మరి అవేమో, ఒక్క చోట నిలవకుండా కొండా-కోనా; గుట్టలూ-మిట్టలూ తిరుగుతున్నాయి. వాటి వెంబడి తిరగలేక మీ ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. గుడ్డలు కూడా పీలికలై పోయాయి!" అన్నాడు పైకి.*

“అయ్యో, మాకు ఎట్టా తెలుస్తుంది ఆ సంగతి?! మేం‌ ఇక్కడే ఉన్నామాయె. అయినా మొన్న సంక్రాంతి పండక్కి బట్టలు కూడా పెట్టుకున్నామే; అంత అవసరం ఉంటే వచ్చి తీసుకు పోకూడదా?” అని యాష్టపడిపోయిందామె. "ఇక్కడే ఉండండి, ఇంటికి పోయి గుడ్డలు తెచ్చిస్తాను. ఈసారి పైకి వెళ్ళగానే మా యింటాయనకు ఇద్దురు" అని వేడుకున్నది.

వ్యాపారికి నవ్వు ఆగలేదు. ఆమెని ఇంకా పరీక్షించటం కోసం అతను "అది వీలు పడదు తల్లీ, ఆకాశానికి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అక్కడ ఉండే ద్వారపాలకుడికి లంచం ఇస్తేగాని వేటినీ లోపలికి తీసుకోని పోనివ్వడు, ఏం చేయను?!" అన్నాడు. “అలాగేలే, ఎంతో కొంత ఇస్తే సరి! నిన్ననే మా అబ్బాయి ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చి ఇనప్పెట్టెలో పెట్టాడు. గుడ్డలు, డబ్బులు తెచ్చి ఇస్తాను- కాసేపు ఆగండి" అని బండిని తోలుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వ్యాపారి అక్కడే ఆగిపోయాడు.

కొద్దిసేపటికల్లా గుడ్డలు, పైకం తీసుకుని అక్కడకి వచ్చింది అమె!

'ఈమె వెంగమ్మకు అక్క' అని గ్రహించిన వ్యాపారి కలవర పడిపోయి "ఒక్కసారి మీ అబ్బాయిని చూసి వెళతాను తల్లీ!" అని ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె కొడుకుకు జరిగినదంతా చెప్పి, ఆమె ఇచ్చిన డబ్బులు, గుడ్డలు అతనికి తిరిగి ఇచ్చేశాడు.

ఆ యువకుడు వ్యాపారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుని "మీరెవరు? ఏం పని మీద వచ్చారు?' అని అడిగాడు. "నా భార్య వెంగమ్మ కూడా మీ అమ్మ మాదిరిదే- ఏమీ తెలీదు పాపం. మొన్న నేను ఊళ్ళో లేనప్పుడు మీ ఊరివాడు ఎవడో వచ్చాడట; మా వెంగమ్మని మోసం చేసి ఆవులని రెండింటిని తీసుకెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఇట్లా వచ్చాను" చెప్పాడు వ్యాపారి విచారంగా.

ఆ కుర్రవాడికి ఊళ్ళో వాళ్ళంతా పరిచయమే- "ఓఁ, వాడు నాకు తెలుసు. వాడో పెద్ద మోసగాడు. నిన్ననే రెండు ఆవుల్ని తెచ్చాడు. అవి మీవే అయి ఉంటాయి- చూద్దాం పదండి" అని అతని ఇంటికి తీసుకు వెళ్ళాడు వ్యాపారిని.

తన ఆవుల్ని చూడగానే గుర్తుపట్టాడు వ్యాపారి. అవి కూడా వ్యాపారిని చూసి సంతోషంగా అరిచాయి. వెంటనే వ్యాపారి న్యాయాధికారికి ఫిర్యాదు చేయటం, న్యాయాధికారి విచారణ జరిపి మోసగాడిని శిక్షించటం, జరిమానాతో సహా ఆవుల్ని వ్యాపారికి ఒప్పచెప్పటం జరిగాయి.

వ్యాపారి ఇంటి కొచ్చి ఆవుల్ని కొట్టంలో కట్టేస్తుంటే "నేను చెప్పలేదూ, అతను చాలా మంచివాడేనని?! పాపం, మన ఆవుల్ని మనకు ఇచ్చేశాడు చూడు!" అన్నది వెంగమ్మ.

"నిజమేనే, లోకంలో నీలాంటివాళ్ళూ, నాలాంటివాళ్ళూ చాలా మందే ఉన్నారు. వాడిలాంటివాళ్ళూ ఉంటారు. అయితే అమాయకుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష మటుకు తప్పదు"అన్నాడు వ్యాపారి