LATEST UPDATES

8, మే 2021, శనివారం

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

👉1.పొదుపు / క‌రెంట్ ఖాతా: ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ. 1 లక్ష‌. పొదుపు ఖాతాలో ఒక ల‌క్ష రూప‌యాల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

👉2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాలి.

👉3.బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్): బ్యాంక్ ఎఫ్‌డీలో నగదు డిపాజిట్ రూ. 10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కు మించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.


👉4. మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు న‌గ‌దు పెట్టుబ‌డులు రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తనిఖీ చేస్తుంది.


👉5. రియల్ ఎస్టేట్: ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.

ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిసిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనుక నుండి కాటెయ్యి అంది తొండ. పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ లగెత్తిపొయ్యిందంట. నన్ను కరిసింది తొండే కదా అని దైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.

ఇప్పుడు ఇంకో పొలంలో రైతుని నేను కరుస్తాను, నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి పో అని తొండ కరిసింది. పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పొయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.

కాబట్టి మనం అందరం, పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు వంటి వాటిలో పిట్టలదొరలు రాసేవీ అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం భాదపడాల్సి వస్తుంది.

దైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తతో మెసులుకోండి. మీ ధైర్యమే మీకు బలం..

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

USEFUL FOR GOVERNMENT  SERVANTS

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

 FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

 సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి (Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

 ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.
(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)
(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)

 సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్  లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

 AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాక ముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.

 రెండు సం. కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.
(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

 సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

 సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే  Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

 సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

 జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము (Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.
(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

 సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

 ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీ చేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.

(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

 ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు. ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969)

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

 సెక్షన్-25
-చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి.

సెక్షన్-26
-చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీని చేపట్టాలి.

సెక్షన్-27
-ప్రతి పదేండ్లకు నిర్వహించే జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు, పార్లమెంట్, శాసనసభ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్ప ఏ ఇతర పనులకు ఉపాధ్యాయుడిని పంపకూడదు.

సెక్షన్-28
-ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్లను, బోధన పనులను చేపట్టరాదు.*

సెక్షన్-29
-సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్ సంస్థ ప్రాథమిక విద్య కోసం పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. అయితే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, బాలల సర్వతోముఖ వికాసం, బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు, బాలల శారీరక, మానసిక అభివృద్ధులను, పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల్లో కార్యక్రమాలు, పరిశోధనలు, బాలల మాతృభాషను, భయం, ఆందోళనకు గురిచేయని వాతావరణం, పిల్లల సామర్థ్యాన్ని అంచనావేసే విధానం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

సెక్షన్-30
-ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పిల్లలు ఎలాంటి బోర్డు పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. పిల్లలు ప్రాథమిక విద్య పూర్తిచేసిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందించాలి.

సెక్షన్-31
-బాలల హక్కులను పరిరక్షించడం

సెక్షన్-32
-సెక్షన్-31లో పేర్కొన్న దానితో సంబంధం లేకుండా ఈ చట్టం కింద పిల్లలకున్న హక్కులకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపే అధికారం ఉన్నది.

సెక్షన్-33
-కేంద్రప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) జాతీయ సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-34
-రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్సీపీసీఆర్) రాష్ట్రస్థాయి సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-35
-కేంద్రప్రభుత్వం, సందర్భానుసారంగా చట్టానికి దోహదపడే రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వానికి తగిన సూచనలు జారీచేసే అధికారాలు ఉన్నాయి.

సెక్షన్-36
-సెక్షన్-13(2), సెక్షన్-18(5), సెక్షన్-19(5) కింద నిర్ధారించిన దండనీయ నేరాలను సంబంధిత ప్రభుత్వం, ప్రత్యేక విజ్ఞప్తి ద్వారా, దీనికోసం నియమించిన అధికారి ఆజ్ఞ లేకుండా నిలిపే అధికారం లేదు.

సెక్షన్-37
-ఈ చట్టంలోని నియమావళిని సద్భావనాపూర్వకంగా చూడాలి.

సెక్షన్-38
-సంబంధిత ప్రభుత్వం, చట్టం నియమావళిని కార్యాచరణ రూపం దాల్చడానికి చేపట్టే చర్యలకు సూచనలు జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.....

INCREMENTS -ఇంక్రిమెంట్లు - వివరణ

INCREMENTS -ఇంక్రిమెంట్లు - వివరణ

        ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.

        ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

        APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించారు.
(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)

        నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
            (G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)
            (G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)

        DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

        ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి.
            (Memo.No.49463 Dt:06-10-1974)

        ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
        Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి    ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.

        నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

        వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము:

        -ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

        -అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప)

        -డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

        -అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

        -పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

        -ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

        - ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం:

        -జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
        - జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ:

        -వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది(ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు)
(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)

        - 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సంధర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:

        -తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

Without Cumulative Effect:
        FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

With Cumulative Effect:
        దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి.ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

ఇంక్రిమెంట్లు-రకాలు:

స్టాగ్నేషన్  ఇంక్రిమెంట్లు:

-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి  వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫిక్సేషన్,ప్రమోషన్లు, AAS )లకు పరిగణిస్తారు.
10వ పి.అర్.సి లో 5 
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.
(G.O.Ms.No.152 F&P Dt:04-11-2000)

(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)

ప్రిపోన్మెం ట్ ఆఫ్ ఇంక్రిమెంట్:

-ఉద్యోగుల వేతన స్థిరీకరణ  సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.

ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు:

- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్) నిర్వహించాలి.

- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.
(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)

- అర్జిత సెలవు లో(EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్,గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.

- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- FR 18

-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నోషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్న్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు.
(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)

-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి......

సరెండరు లీవు - కొన్ని వివరణలు

సరెండరు లీవు - కొన్ని వివరణలు

✍️ఒక ఆర్థిక సంవత్సరములో 15 రోజుల ఆర్జిత సెలవు సరెండరు చేయవచ్చు. అదేవిధంగా రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజుల వరకు సరెండరు చేయవచ్చు. ఒక సరెండరు లీవుకు మరొక సరెండరు లీవుకు మధ్య వ్యవధి 12 నెలలు/24 నెలలు వుండవలెనని ఇదివరలో షరతు వుండెడిది. కాని

Govt. Circular Memo No 13870/A/436/FRI/2005 Fin.(FRI) Dept. dt 27-6-2005

✍️ద్వారా జారీ చేసిన వివరణ ద్వారా, ఆర్థిక సంవత్సరములో 15 రోజులు, రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజులు అని తెలియజేసింది.

(Also.see Govt. Circular Memo No. 17915-c/542 FRI/2005 Fin: Dept. dt. 4-7-2005)

FAC అలవెను గురించి వివరణ.

FAC అలవెను గురించి వివరణ.

విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్‌ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్‌ఎంలుగా.__FAC MEO లుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. ఈ విషయమై వివరణ.

 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.

- మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్‌ అలవెనుస్‌ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.

- తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్‌ అలవెన్సుస్‌ చెల్లిస్తారు.

- ఒకరోజు గ్యాప్‌ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే. __ మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అంద్‌ అలవెన్సులను FAC Allowance  గా చెల్లిస్తారు.

అనుమతిలేని గైర్‌హాజరు - FR.18 కు సవరణలు

అనుమతిలేని గైర్‌హాజరు -- FR.18 కు సవరణలు

ప్రభుత్వ ఉద్యోగి అనుమతిలేని గైర్ హాజరు అయిన ఈ క్రింద తెలిపిన సందర్భాలలో తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించవలసియున్నది.
(Amendment issued to FR. 18 by adding as FR. 18-A issued in G.O.Ms. No. 128 Finance (FRI) dept. dt. 1-6-2007).

1. ఒక సంవత్సర కాలానికి మించి అనుమతిలేని గైర్ హాజరు (Absent) అయిన యెడల లేక

2. సెలవుపైగాని లేక, సెలవుగాని కాలం ఐదు సంవత్సరములు మించిన యెడల లేక

3. ప్రభుత్వం అనుమతించిన కాలాన్ని మించి Foreign సర్వీసులో డిప్యూటేషన్‌పై కొనసాగిన పక్షంలో.

పై సందర్భాలలో ఉద్యోగిపై చర్యలు తీసుకొనే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను.

(Added as Rule 5- B to A.P. Leave Rules 1933 in G.O.Ms. No. 129 F (FRI) Dept.dt. 1-6-2007)

6, మే 2021, గురువారం

అసాధారణ సెలవు - ఇంక్రిమెంట్లు

అసాధారణ సెలవు - ఇంక్రిమెంట్లు :

✍️ఒక ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించిన అసహాయ పరిస్థితులలో రోగ పీడితుడిగా వున్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలోగాని,లేక పై చదువులకుగాని,సాంకేతికపరమైన చదువులకుగాని అసాధారణ సెలవు మంజూరు చేసిన యెడల,అట్టి అసాధారణ సెలవు, ఇంక్రిమెంటు మంజూరు చేయుటకు పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

(FR 26 (b) As introduced in G.O MS NO.357 Fin dept Dated. 1-9-1962).

✍️కాని సస్పెన్సనుకు గురియైన ఉద్యోగి సస్పెన్షను కాలాన్ని అసాధారణ సెలవుగా Anual Grade Increment) వరిగణించినప్పుడు,అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటు కొరకు పరిగణించుటకు వీలులేదు.

(Govt Memo No.11302/FR2/64-1 Fin dept Dated.16-6-1964).

✍️సస్పెన్షనుకు గురియైన ఉద్యోగి అంతిమ క్రమశిక్షణా చర్యల పర్యవసానంగా,సస్పెన్నను కాలాన్ని నాట్‌ డ్యూటీ (Not Duty) గా క్రమబద్ధీకరించిన సందర్భంగా,ఏ మేరకైతే అసాధారణ సెలవు (Extra-Ordinary) సెలవు క్రింద పరిగణిస్తారో,అట్టికాలం వార్షిక ఇంక్రిమెంటు (Anual Grade Increment) కు పరిగణించబడదు

(Govt Memo No.11302 FR2/64-1 Fin dept Dated.16-6-1964).

5, మే 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు - పెన్షన్

సందేహం

సర్వీసులో Interruption అంతరాయము వుంటే, పెన్నన్‌కు అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?

సమాధానం

✍️సర్వీసులో అంతరాయము కలిగిన కాలాన్ని పెన్సనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో పరిగణిస్తారు.

(1) గైర్హాజరు కాలానికి సెలవు మంజూరు చేసినప్పుడు

(2) సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు

(3) జాయినింగ్‌ టైము వినియోగించినప్పుడు

(4) పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు

(5) పెన్షను మంజూరు అధికారి వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు

రూలు 27 (ఎ) నుండి (ఎఫ్‌) (2)

సందేహం

Invalid Pension ఎప్పుడు చెల్లిస్తారు?

సమాధానం

✍️ఒక ఉద్యోగి,అతను చేస్తున్న ఉద్యోగము చేయలేడని మెడికల్‌ అధారిటీ డిక్లేరు చేస్తే అతనికి రూలు 45 లోబడి Invalid Pension మంజూరు చేస్తారు.


అయితే మెడికల్‌ అధారిటి ఉద్యోగి ఇప్పుడు చేస్తున్న పనికంటే తక్కువ శ్రమ కల్గిన పనిచేయగలడు అని భావిస్తే అతనిని ఆ పోస్టులో నియమించవచ్చు.ఆ పని చేయడానికి అతనికి ఇష్టం లేకపోతే అప్పుడు అతనికి Invalid Pension మంజూరు చేస్తారు.

ఉద్యోగి దుర అలవాట్ల కారణంగా అతనికి అనారోగ్యం సంభవిస్తే అతనికి Invalid Pension మంజూరు చేయబడదు.

రూలు 37 (1) (2) (3)

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
నేను B.Ed లో 3rd methodology గా  maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా?

జవాబు:
మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.

ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా??
జవాబు:
జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.

ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా?

జవాబు:
జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.

ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా?

జవాబు:
అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

ప్రశ్న:
నేను దసరా సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా?

జవాబు:
దసరా సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.

సందేహాలు - సమాధానాలు

సందేహం

సస్పెన్షన్ పీరియడ్‌ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి?

సమాధానం:

✍️సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్థ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*  

సందేహం
      
నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను?

సమాధానం:

✍️జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్‌,AAS స్కేల్స్‌ వాయిదా పడతాయి. మూడు సంవత్సరములు పైన జీత నష్టపు సెలవు కాలం పెన్లన్‌ కి అర్హదాయక సర్వీస్‌ గా పరిగణింపబడదు.