చెరువుకు పోదాం చెలో చెలో
ఈతలు కొడదాం చెలో చెలో
ఈత కొడుతు పోటీ పడుతూ
చేపలమవుదాం చెలో చెలో
ఈతకు పోదాం చెలో చెలో
చేపలమవుదాం చెలో చెలో
చేపల్లాగ ఈత కొడుతూ
మట్టిని తెద్దాం చెలో చెలో
ఈతకు పోదాం చెలో చెలో
మట్టిని తెద్దాం చెలో చెలో
బంక మట్టితో బొమ్మలు చేసి
ఆటలాడుదాం చెలో చెలో
చెలో చెలో ..... చెలో చెలో
Related Posts: 1st Class,Telugu,Text Book
తీరొక్క పూలను తెంపుకొచ్చితిని
సూదీ దారం తోటి దండ గుచ్చితిని
చేమంతుల దండ అమ్మకిచ్చితిని
కనకాంబరం దండ అక్కకిచ్చితిని
పొన్నపూల దండ చెల్లెకిచ్చితిని
సన్నజాజి దండ వదినెకిచ్చితిని
గులాబీల దండ గుడిల ఇచ్చితిని
ఇంటి దర్వాజకు బంతిపూదండ
నా చిట్టి జడకేమొ సిరిమల్లెదండ
Related Posts: 1st Class,Telugu,Text Book
ఊడ పట్టి ఊగుదాం
కొమ్మలెక్కి దుంకుదాం
ఊడ పట్టి పాకుతూ
కొమ్మ మీద చేరుదాం
ఊడ నుంచి ఊడకు
కొమ్మ నుంచి కొమ్మకు
అందకుండ దుంకుదాం
కోతి కొమ్మ ఆడుదాం
Related Posts: 1st Class,Telugu,Text Book
నాయన ఇంటికి వచ్చిండు
పాపకు సవరం తెచ్చిండు
సవరం గూట్లో పెట్టిండు
సవరం అమ్మ చూసింది
గూట్లో సవరం చూసింది
చిట్టీ జడకు వేసింది
తమ్ముడు జడను చూసిండు
సవరం పట్టుక గుంజిండు
సవరం ఊడి పోయింది
ఫక్కున అక్క నవ్వింది.
Related Posts: 1st Class,Telugu,Text Book
అన్న తెచ్చే అనపకాయ
అమ్మకు ఇచ్చే అనపకాయ
ఉడకబెట్టే అనపకాయ
అక్క ఒలిచే అనపకాయ
గుడాలుచేసె అనపకాయ
పచ్చికారం అనపకాయ
అందరు మెచ్చే అనపకాయ
ఆహా! ఓహో! అనపకాయ!
Related Posts: 1st Class,Telugu,Text Book
ముద్దు మాటలు పలికె ఓ రామచిలుకా
శనగ చేనుకు నువ్వు కావలికి పోతే
నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు
గుజ్జారి కాళ్ళకు గజ్జెలేయింతు
నువు పోయె తొవ్వల్ల శనగ పోయింతు
శనగ తిని సెయికడుగ సెలమ తోడింతు.
Related Posts: 1st Class,Telugu,Text Book
రంగు రంగుల ఉంగరం
రతనాల ఉంగరం
ఎముడాల జాతరలో
దొరికేటి ఉంగరం
జాతరలో మా తాత
కొనిచ్చిన ఉంగరం
మా దోస్తులందరికి
నచ్చినా ఉంగరం
చూపుడు వేలు మీద
చుక్కనుంటి ఉంగరం
ఎర్రెర్ర ఉంగరం
ఎముడాల ఉంగరం
Related Posts: 1st Class,Telugu,Text Book
ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ?
ఏ ఆట నీకిష్టమూ తమ్ముడా?
గురిపెట్టి కొట్టేటి
గోటీల ఆటనా!?
గవ్వలతో ఆడేటి
పచ్చీసు ఆటనా!?
పెంకాసు ఏసేటి
తొక్కుడూ బిళ్లనా!?
|| ఏ ఆట ||
గుండ్రంగ తిరిగేటి
బొంగరం ఆటాన!?
కట్టెతో కొట్టేటి
చిర్రగోనె ఆటనా!?
చేతులతో చప్పట్ల
చెమ్మ చెక్క ఆటనా!?
|| ఏ ఆట ||
అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క!
ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి!
Related Posts: 1st Class,Telugu,Text Book
జజ్జనకి జనారే
కంజరనే బజారే
గజ్జెల కంజరతో
దరువులెన్నొ వేయరే
కంజరనే కొట్టరే
పాటలెన్నొ పాడరే
కంజరతో పాటలకు
ఆటలెన్నో ఆడరే
ఆటలతో పాటలతో
ఆనందం పొందరే
Related Posts: 1st Class,Telugu,Text Book
తకధినతోం - తకధినతోం
చప్పుడు చేసే తబల
తరికిటతోం తరికిటతోం
తాళం వేసే తబల
ఢం ఢం ఢం ఢం
ఢం ఢం అంటూ
దరువులు వేసే తబల
ఆటకు తబల
పాటకు తబల
దేవుని గుడిలో
భజనకు తబల
తకధినతోం తకధినతోం
చప్పుడు చేసే తబల
Related Posts: 1st Class,Telugu,Text Book