సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని. 12సం.లు స్కేలు రావడానికి నేను EOT, GOT పరీక్షలు పాస్ అయ్యాను. నాకు12సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు?
జవాబు:
ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.
2. ప్రశ్న:
నాకు 50 ఇయర్స్ దాటినవి. నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా?
జవాబు:
G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది. అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.
3. ప్రశ్న:
SGTలలో 50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
జవాబు:
కారు. వారు కూడా G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.
4. ప్రశ్న:
నేను 30-11-2020 న రిటైర్మెంట్ అయ్యాను. మరి నా యొక్క పి.ఆర్.సీ ఏవిధంగా చేయించుకోవాలి.? AG ఆఫీస్ కు పంపాలా? ఇక్కడే ట్రెజరీ లో ఇవ్వాలా? తెలుపగలరు.
జవాబు:
1-7-2018 కన్న ముందు రిటైరయిన వారి fixation డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ పంపే ప్యాకేజీ తో DTO లే చేస్తారు.
1-7-2018 తరువాత 28-2-2021 వరకు రిటైరైన వారు గతంలో ఎక్కడి నుండి రిటైర్ అయినారో అక్కడి డ్రాయింగ్ & disbursing అధికారి ( DDO ) నుండి pay fixation చేయించుకొని సర్వీసు పుస్తకంలో నమోదు చేయించుకొని, గతంలో ఏ విధంగా పెన్షన్ కోసం ఫారాలు నింపామో ఆవిధంగానే revised పెన్షను ఫారాలు నింపి DDO తో sanction చేయించి వారితోనే direct గా AG ఆఫీసుకు పంపాలి.