LATEST UPDATES

30, జూన్ 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు

This is a simple translate button.

సందేహాలు - సమాధానాలు


1. ప్రశ్న:
పెన్షనర్ మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చెయ్యాలి?

జవాబు:
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి. తెలియపరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్ (ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ ఐరిష్) ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఏటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు. రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి. చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.


2. ప్రశ్న:
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా?

జవాబు:
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప, సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.


3. ప్రశ్న:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు?

జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసులో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు. 2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లకి అవకాశం కల్పించారు.


4. ప్రశ్న:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు?

జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.


5. ప్రశ్న:
ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని భార్యకు పెన్షన్, గ్రాట్యుటీ ఇస్తారు కదా! మరి ఆ ఉద్యోగికి దివ్యాంగురాలైన కుమార్తె ఉంటే ఏవిధమైన తేడాతో గ్రాట్యుటీ, పెన్షన్ ను ఇస్తారు? వివరించగలరు.

జవాబు:
తేడా ఏమీ ఉండదు. అర్హత కలిగిన గ్రాట్యుటీ ని నామినీలకు ఇస్తారు. ఒకవేళ నామినేషన్ ఇచ్చి ఉండక పోతే భార్యకు, పిల్లలకు సమాన షేర్ లు ఇస్తారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి