New Syllabus(2014-15)
02T
TELUGU, Paper - II
(First Language)
Time: 2.45 hours] [Maximum Marks : 40
-----------------------------------------------------------------------------------
సూచనలు:
- మొదటి 15ని.లు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2 గం. 30 ని.ల సమయంలో జవాబులు రాయండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రంలోనే రాయండి.
I. అవగాహన ప్రతిస్పందన : చదవడం - అవగాహన చేసుకోవడం (20 మార్కులు)
(అ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 5x1=5
జాంబవంతుడు
హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు.
దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేయుంది? హనుమంతుడు రెట్టించిన
ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు.
వానరులతో ‘‘నేను మహాసముద్రాలను అవలీలగా దాటగనని’’ ఆత్మశక్తిని ప్రకటించాడు.
ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి
వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు?
2. ప్రేరణ వలన ఏమి బయట పడుతుంది?
3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు?
4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి?
5. పై పేరాకు తగిన శీర్షక సూచించండి.
(ఆ) కింది పేరా చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి. 5x1=5
గోదావరి
నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీనంగర్ జిల్లాల్లోని గిరిజనులు వారి
ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. ‘‘చిన్నయ్య
పెద్దయ్య చిలుకల భీమయ్య’’ అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య
అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని
పూజిస్తారు, అని స్పష్టమవుతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలువడానికి
కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన
అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య
దైవమయ్యాడు.
ప్రశ్నలు:
6.
7.
8.
9.
10
(ఇ) కింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం సొంత మాటల్లో రాయండి. 1x5=5
11. బీదల కన్నవస్త్రములు ..........................
......................వివేక ధనంబిది నమ్ము చిత్తమా!
(ఈ) కింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి. 5x1=5
తల నుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !
12. పాముకు విషం ........................ లో ఉంటుంది.
13. వృశ్చికమనగా ..........................
14. శరీరమంత విషం ......................... కి ఉంటుంది.
15. పై పద్య మకుటం .......................
16. పై పద్యాన్ని రచించిన కవి ...................
II. సృజనాత్మకత - వ్యక్తీకరణ: సృజనాత్మకత (10 మార్కులు)
(అ) కింది వానిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి. 2x5=10
17. ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పతనాన్ని గూర్చి వ్యాసం రాయండి.
18. ‘‘మాణిక్య వీణ’’ వచన కవితలో మీకు నచ్చిన అంశాలను వివరిస్తూ మిత్రునికి/మిత్రురాలికి లేఖ రాయండి.
19. చరిత్ర నిర్మాణంలో స్త్రీల పాత్రను వివిరిస్తూ కరపత్రం తయారు చేయండి.
III. భాషాంశాలు (వ్యాకరణం) (10 మార్కులు)
20. ‘మృదుమధురం’ పదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. (1మార్కు)
21. ‘విద్య చేత అధికుడు’ విగ్రహ వాక్యాన్ని సమాస పదంగా మార్చి సమాసం పేరు రాయండి. (1మార్కు)
22. ‘ముత్యపు చిప్ప’ పదాన్ని విడదీసి, సంధిపేరు రాయండి. (1మార్కు)
23. ‘సరభస+ఉత్సాహం’ కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి. (1మార్కు)
24. ‘యూయూస్సూత్రము తోవ త్రుంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ’
పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి. (2మార్కులు)
25.
‘‘తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలి వచ్చిన పేద రైతులూ
ఇనప్పెట్టెలాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులు’’
పై కవితలోని అర్థాలంకారాన్ని గుర్తించండి. (1మార్కు)
26. అర్థంతరన్యాసాలంకార లక్షణాల్ని తెల్పండి. (1మార్కు)
27. గోపి హైదరాబాద్ వెళ్ళాడు.
సీ హైద్రాబాద్ వెళ్ళింది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చి రాయండి. (1మార్కు)
28. ‘‘ధన లోభము సర్వాపదలకు మూలము’’ ఈ వాక్యాన్ని ఆధునికి వ్యవహార భాషలోకి మార్చి రాయండి. (1మార్కు)
----------End--------