LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Telugu Guninthalatho Game

This is a simple translate button.

గుణింతాలతో ఆట:
***********
మొదట మనం గుణింతాలుగల కార్డులు తయారుచేసుకోవాలి. పటం-1 లో చూపిన విధంగా కా, గా, చా, జా, ........ ఒక set , కి, గి, చి, జి,......... ఒక set , కీ, గీ, చీ, జీ, ......... ఒక set, ........... ఈ విధంగా తయారుచేసుకోవాలి. ఆ తరువాత పిల్లల సంఖ్యను బట్టి A, B, C, D,.... జట్లుగా ఏర్పరుచుకోవాలి. ఈ జట్లకి ఏదో ఒక గుణింతాల set ఇవ్వాలి. గ్రూప్‌లోని పిల్లలు కార్డులను సమానంగా షేర్‌ చేసుకోమనాలి. ఆట ఏమిటంటే పటం-2 లో చూపినట్లు గుండంలో మనం ' స ' అనే అక్షరాన్ని రాసినచో ' స' సంబంధించిన గుణింత అక్షరాలను కార్డులు చూపిస్తూ నల్లబల్లపైగల డబ్బాలలో రాయమనాలి. ఉదా. కి 4 గ్రూప్‌లుగా చేసినామనుకుంటే First డబ్బాలో రాసినవారికి 4 మార్కులు , Second డబ్బాలో రాసినవారికి 3 మార్కులు , Third డబ్బాలో రాసినవారికి 2 మార్కులు, Fourth డబ్బాలో రాసినవారికి 1 మార్కులు, రాయనివారికి సున్న మార్కులు కేటాయించాలి. ఈ విధంగా ఆటను కొనసాగిస్తూ, చివరగా ఏ జట్టు గెలిచిందో తెలియజేయాలి.

దీనిపై మీ కామెంట్‌
ధన్యవాదములు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి