LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Tholakari Chirujallulu (తొలకరి చిరుజల్లులు) 3rd Class Telugu

This is a simple translate button.



కిలకిలమను పిల్లలం
తొలకరి చిరుజల్లులం
అల్లరితో ఎల్లరినీ
అలరించే పిల్లలం...

తెలుగుతల్లి తోటలోని
వెలుగులీను పువ్వులం
జగమంతా పరిమళాలు
ఎగజిమ్మే పువ్వులం...

భారతి చిరుపెదవులపై
పరవశించు నవ్వులం
విశ్వమెల్ల వెన్నెలను
వెదజల్లే నవ్వులం..

భరతమాత హారంలో
మెరియుచున్న రవ్వలం
ధగద్ధగలు నలుదిశలా
ఎగజిమ్మే రవ్వలం..

రత్నగర్భ పదములపై
రవళించే మువ్వలం
విశ్వానికి నర్తనగతిని
వివరించే మువ్వలం

పాలపుంతలందు వేగ
పరుగులెత్తు గువ్వలం
మంచితనం మనసులలో 
పంచిపెట్టు గువ్వలం

భారతమ్మ బొమ్మరిండ్ల
పాలుపెరుగు బువ్వలం
ఆనందము చేకూర్చే
అమృతంపు బువ్వలం...

రచన : జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి
మూలం : మల్లెల మందారాలు, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి