అనగనగా ఒక ఊరు.
ఆ ఊరిలో రత్తయ్య అనే రైతు ఉండేవాడు.
ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు.
వాడి పేరు జగ్గయ్య. ఒట్టి అమాయకుడు. రత్తయ్య ముసలివాయినాడు. జబ్బుచేసింది. దగ్గి దగ్గి అలసిపోయేవాడు. డాక్టరు వచ్చాడు. మందులు ఇచ్చాడు. మందుసీసా మీద ‘‘బాగా ఊపి తాగండి’’ అని ఉంది.
జగ్గయ్య దానిని చదివాడు. మందు తాగించాడు. కానీ రత్తయ్యకు దగ్గు తగ్గలేదు. మళ్ళీ డాక్టరు వచ్చాడు. మందు తాగించావా అని అడిగాడు. ‘‘ఓ... నాన్నను బాగా ఊపి మందు తాగించాను’’ అన్నాడు జగ్గయ్య. జగ్గయ్య తెలివి తక్కువతనానికి డాక్టరు నవ్వుకున్నాడు. నాన్నను కాదు, సీసాను బాగా ఊపి మందు తాగించాలని చెప్పాడు. జగ్గయ్య తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు.
Rathaiah - Jaggaiah (రత్తయ్య - జగ్గయ్య ) - 2nd Class Telugu
This is a simple translate button.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి