బాలల్లారా వినరండి.
ఏమవుతుందో చెప్పండి.
సూర్యుడు ఉదయించకుండా
వెలుగు, వేడి ఇవ్వకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
విత్తులు మొలకెత్తకుండా
భూమిలోనే దాగిఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
పంటలేవి పండకుండా
పుడమితల్లి అడ్డుకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
నీరు మనకు అందకుండా
నదులే ప్రవహించకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
ఇరుగుపొరుగు లేకుండా
తోడు ఎవరు లేకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.
రచన: నాళం కృష్ణారావు
మూలం: గోరుముద్దలు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి