సందేహాలు - సమాధానాలు
1.ప్రశ్న:
దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయునిగా 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?
జవాబు:
FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
2.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం, ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?
జవాబు:
ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సెలవు కైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు, వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.
3.ప్రశ్న:
నేను సర్వీసులో చేరిన తేది.20.11.1996. నా వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ లో ఉన్నది. నేను 20 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను. నా ఇంక్రిమెంట్ నవంబర్ లో ఇవ్వాలా? డిసెంబర్ లో ఇవ్వాలా?
జవాబు:
జి.ఓ.133; తేది.13.05.1974 ప్రకారం జీత నష్టపు సెలవు పెట్టినప్పుడు ఒకటవ తేది నుండే లెక్కించి ఇంక్రిమెంట్ వాయిదా వేయవలసి ఉంటుంది. మీరు 20 రోజులు సెలవు పెట్టినందున నవంబర్ 20 కి వాయిదా వేయాలి. నెల మధ్యలో ఇంక్రిమెంట్ ఉండదు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీనే మీ వార్షిక ఇంక్రిమెంట్ కొనసాగుతుంది.
4. ప్రశ్న:
మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?
జవాబు:
పింఛనులో బేసిక్, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు. ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.
5. ప్రశ్న:
నేను డిగ్రీలో జువాలజీ, డైరి సైన్స్ మరియు కెమిస్ట్రీ మరియు బిఇడిలో బయాలజీ, తెలుగు మెథడాలజీలను కలిగి ఉన్నాను. నేను స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) ప్రమోషన్ కు అర్హుడనేనా?
జవాబు:
జి.ఓ.ఎం.ఎస్ నం.12 విద్య; తేది.23.01.2009 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) గా పదోన్నతి పొందాలంటే డిగ్రీలో బోటనీ మరియు జువాలజీ చదివి ఉండాలి.