*మున్నాళ్ళ ముచ్చట*
..........................
అడవులు నరుకుడాయా
భూఖబ్జాలు ఎక్కువాయా
ఫ్యాక్ట్రీలు కట్టుడాయా
రియలెస్టేట్ ఎక్కువాయా
కొండ గుట్టలు దోచుడాయా
ఖనిజాలు తీచుడాయా
కార్పొరేట్లు ఎక్కువాయా
చెట్లు కొండలు లేకపాయా
మేఘాలు ఏర్పడవాయా
వర్షాలు లేకపాయా
ఎండలు ఎక్కువాయా
జీవరాసులు బతకవాయా
చెట్లు చేమలు లేకపాయా
నీరు నేల కలుషితమాయా
పాడి పంటలు రుచులుపాయా
వన్యప్రాణులు లేకపాయా
ప్రకృతి అందాలు లేకపాయా
మానవ నిర్మితాలాయా
అరగవాయా
కరగవాయా
భవిష్యత్ లేకపాయా
మున్నాళ్ళ ముచ్చటాయా
*పర్యావరణాన్ని*
కాపాడుకుందాం.... పరిరక్షించుకుందాం....🌱🌹
షేక్ రంజాన్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి