సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు?
జవాబు:
రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.
•••••••••
ప్రశ్న:
స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు?
జవాబు:
ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.
•••••••••
ప్రశ్న:
మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా?
జవాబు:
జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.
•••••••••
ప్రశ్న:
CCL ఒకేసారి వాడుకోవచ్చా?
జవాబు:
మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి