LATEST UPDATES

26, జూన్ 2021, శనివారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?

జవాబు:
అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.


2. ప్రశ్న:
నేను SA గా పదోన్నతి పొందాను. నాకు ప్రస్తుతం 56 ఇయర్స్. GOT పాస్ అయ్యాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?

జవాబు:
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.


3. ప్రశ్న:
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?

జవాబు:
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి. ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.


4. ప్రశ్న:
11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా?

జవాబు:
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.


5. ప్రశ్న:
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి?

జవాబు:
జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు, స్పెషల్ పే చెల్లించబడతాయి. ఐతే IR మాత్రం చెల్లించబడదు.

25, జూన్ 2021, శుక్రవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
DSC లో స్థానికేతర అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు?

జవాబు:
నింపవలసిన ఖాళీలలో ఓపెన్ కాంపిటీషన్ కింద మొదట 20% ఖాళీలను నింపిన తర్వాత మిగిలిన 80% ఖాళీలను కేవలం స్థానిక అభ్యర్థులను మాత్రమే మెరిట్ మరియు రిజర్వేషన్లు ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు.
20% ఖాళీలను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అనగా మెరిట్ ప్రాతిపదికగా స్థానిక మరియు స్థానికేతరులను ఉమ్మడిగా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేయాలి. ఆ విధంగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కూడా ఆ 20% ఖాళీలకు ఏ ఏ రోస్టర్ పాయింట్లు వర్తిస్తాయా చూసి,ఆయా రోస్టర్ పాయింట్లకు సరిపడ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి.
స్థానికేతర అభ్యర్థులకు ప్రత్యేక కేటాయింపు ఏది లేదు. ఓపెన్ కాంపిటీషన్ కింద మాత్రమే వారు పరిగణింపబడతారు.


2. ప్రశ్న:
రిలింక్విష్ ఇవ్వటం అంటే ఏమిటి?

జవాబు:
రిలింక్విష్ అంటే పదోన్నతిని నిరాకరించడం. ప్రమోషన్ శాశ్వతంగా నిరాకరిస్తే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వబడదు. ఒకవేళ అప్పటికే 12 ఇయర్స్ స్కేల్ పొందుతూ ఉంటే 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.


3. ప్రశ్న:
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏమిటీ?

జవాబు:
మెమో.41758 తేదీ:19.07.2007 ప్రకారం ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే వారసుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు.


4. ప్రశ్న:
ఒక కన్ను కనబడే ఉద్యోగికి కన్వేయన్స్ ఎలవెన్స్ పొందే అవకాశం ఉన్నదా ?

జవాబు:
లేదు


5. ప్రశ్న:
నేను SGTగా పనిచేయుచూ 2015 - 16 సం.లో  B.Ed Onduty పై చేసితిని. కాకతీయ విశ్శవిద్యాలయం నిబంధనల మేరకు ఏప్రిల్ 26 నుండి మే 18 వరకు మరియు జూన్ 2 నుండి జూన్ 11 వరకు బి.ఎడ్ కాలేజీలో తరగతులకు హాజరైనందున సంపాదిత సెలవులకు అర్హత ఉన్నదా ?

జవాబు:
మీరు డెప్యుటేషన్ మీద B.Ed చేసినారు. డెప్యుటేషన్ లో తరగతులకు హాజరైనందున ఆర్జిత సెలవు యివ్వబడవు.

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?

జవాబు:
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.


2. ప్రశ్న:
Sir...2021,2022 లో retirement ఉండి.. 3years extension పొందుతున్న వారికి GIS deduction ఎప్పటి వరకు చేయాలి ?

జవాబు:
GPFలాగే, GIS కూడా రిటైర్మెంట్ కు 3 నెలల ముందు వరకు మినహాయించాలి. అన్ని రకాల ప్రభుత్వ మినహాయింపులు 3 నెలల ముందు నుండి ఆగిపోతుంది.

                        
3. ప్రశ్న:
డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?

జవాబు:
AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం, F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.


4. ప్రశ్న:
SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?

జవాబు:
అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి. మరియు బి.యిడి కలిగి ఉండాలి.


5. ప్రశ్న:
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?

జవాబు:
రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. Sc/ St/ Bc/ Oc కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.

23, జూన్ 2021, బుధవారం

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

ప్రశ్న:
Sir, హిస్తరెక్టమి ఆపరేషను జరిగితే దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు కదా..... మరి జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా? కొంచెం తెలుపగలరు.

జవాయ:
ఏ సెలవు పెట్టినా జీతం రొటీన్ గా ఇవ్వరు. మీరు పెట్టిన సెలవు మంజూరు అయితేనే ఇస్తారు. జీతం బిల్లు తయారు చేసే సమయానికి మంజూరు అయితే అందరితో పాటు వస్తుంది. లేకపోతే ఎప్పుడు మంజూరు చేస్తే అప్పుడు వస్తుంది. మీకు ఆ ఆపరేషన్ అయిన తరువాత నీ ఆఫీస్ వాళ్ళు sanction ప్రొసీడింగ్స్ ఇస్తే, అది బిల్ కి enclose చేస్తే జీతం వస్తుంది.


ప్రశ్న:
నా స్నేహితుడు 2022 సంవత్సరంలో రిటైర్ అవుతాడు. అతని APGLI బాండ్లు A,B&C లు అందులో పేర్కొన్న  మెచ్యురిటి డేట్లు దాటి పోయాయి. అతను ఆ బాండ్లను ఇప్పుడే APGLI ఆఫీసులో సబ్మిట్ చెయ్యాలా ? లేకపోతే రిటైర్మెంటు సమయంలో చెయ్యాలా తెలుపగలరు.? అందులోని అమౌంట్ ఎప్పుడు వస్తుంది.?

జవాబు:
ఆ బాండు లలో meturity date ఉంటుంది. అది దాటిన వెంటనే APGLI ఆఫీస్ కు పంపించవచ్చు. రిటైర్మెంట్ వరకు ఆగ వలసిన పనిలేదు.


ప్రశ్న:
జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఆరు నెలల తర్వాత అనారోగ్యం కారణంగా రివర్సను తీసుకున్న కలిగే పరిణామాలను తెలుపగలరు

జవాబు:
మీకు ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ గా నియామక పత్రాలు ఇచ్చారో, వారికి దరఖాస్తు చేయాలి వారు మరల మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ డిపార్ట్మెంట్ లో నియామకపు అధికారి వారికి తెలియజేస్తారు. వారు మరల మీకు ఈ పని చేయవలసిన ప్రదేశాన్ని కేటాయింపు చేస్తారు. మరల భవిష్యత్తులో బహుశా ప్రమోషన్ అవకాశం ఉండదు. జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మీ వేతన స్కేలు వేతనం యధావిధిగా ఉంటాయి. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలం కూడా జూనియర్ అసిస్టెంట్ గా లెక్కించబడుతుంది.

మీరు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన 6 నెలలు అయితే మిమ్మల్ని రివర్స్ ఉత్తర్వులు గవ్నమెంట్ పరిధి అనగా మీ డైరెక్టర్ గాని కమిషనర్ పరిధిలో ఉంటది మీ జిల్లా ఆఫీసర్ పరిధిలో ఉండదు.

ఇది కేవలం నాకు తెలిసిన విషయం మాత్రమే. దీనిపై అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వారి సలహాలు కూడా తీసుకోండి

మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం సంబంధిత ఉత్తర్వులు:

మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం సంబంధిత ఉత్తర్వులు:

 ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
(G.O.Ms.No.74 తేది:15-03-2005)

 ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
(G.O.Ms.No.397 తేది:13-11-2008)

 కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.

 వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.

 ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
(G.O.Ms.No.68 తేది:28-03-2011)

 కీమోథేరపీ, రేడియోథేరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రులయందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.

 కంటి చికిత్స, దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు. కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు. దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
ఎమర్జన్సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
(G.O.Ms.No.276 M&H తేది:11.05.1993)

 రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
(G.O.Ms.No.175 తేది:29-05-1997)

 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
(G.O.Ms.No.105 తేది:09-04-2007)

 మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)

 కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును. అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
(G.O.Ms.No.87 తేది:28-02-2004)

 హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.

 రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No.8878/D2-4/09 తేది:02-09-2009 ద్వారా వివరించారు.

Preponement of pay

🔥Preponement of pay🔥

రీగ్రూపింగ్ పే స్కేల్లలో సీనియర్ మరియు జూనియర్ మూలవేతనములు నిర్ణయించబడి సీనియర్ ఇంక్రిమెంటు తేదీకన్న జూనియర్ ఇంక్రిమెంటు తేది ముందున్నచో సీనియర్ ఇంక్రిమెంటు తేది మార్చబడును.

(G.O.Ms.No.14 DL. 13-1-1988)

పై సౌకర్యము ఒకే క్యాడరులో నియామకమయిన ఇద్దరు ఉపాధ్యాయులలో వ్యత్యాసమున్నపుడు వర్తించును.

▪️ సీనియర్ జూనియర్ కన్న అన్ని విధాలుగా అనగా నియామకములో, విద్యార్హతలలో పదోన్నతులలో సీనియర్ అయి ఉండాలి.

▪️ 1974, 1978, 1986, 1993 పేస్కీలలో మరియు 8/16 సంవత్సరములకిచ్చు పదోన్నతులలో వేతనము నిర్ణయించబడినపుడు కూడ సీనియర్ కన్న ముందు జూనియర్ వార్షిక హెచ్చింపు తేది ఉండుటచే జూనియర్ అధిక వేతన పొందుచున్న యెడల సీనియర్ ఇంక్రిమెంటు తేదిని జూనియర్ ఇంక్రిమెంటు తేదిని జూనియర్ ఇంక్రిమెంటు తేదికి మార్చుటకు అవకాశము కల్పించబడినది. కాని ఈ సౌకర్యము 1999 పే స్కేల్లలో కల్పించలేదు.

పై సౌకర్యము కలుగజేస్తూ ఇచ్చిన ఉత్తర్వులలో అద్దరి ఉపాధ్యాయుల వివరములు స్పష్టముగా పొందుపరచాలి.బిల్లు వెంబడి ఇద్దరు సర్వీసు పుస్తకముల ప్రతులు జత చేయాలి. జిల్లా విద్యాధికారి గారిచే జారీ చేయబడిన సీనియారిటి పట్టికను జతచేయాలి.

RPS 2010 యందు ఈ సౌకర్యము తిరిగి పునరుద్ధరించబడినది. (GO.Ms.No.52, Fin (PC.I) Dept. Dt.25-2-10 లోని పేరా 7)

ఉదాహరణ :జూనియర్ : 2002 ద్వారా నియామకం పొందిన ఒక SGT అక్టోబర్ 2004లో రెగ్యులర్ స్కేలు వేతనం రూ. 5,470 పొందియున్నాడు.  RPS 2010లో అతని వేతనం రూ. 10,000/- లుగా నిర్ణయించబడింది. తదుపరి ఇంక్రీమెంటు తేది : 1-10-2008 నాటికి వేతనం రూ. 11,200/-లుగా వృద్ధి చెందుతుంది.

సీనియర్ : 2001 డి.యస్పీ. ద్వారా నియామకం పొందిన ఒక యస్.జి.టి. ఉపాధ్యాయుడు జనవరి 2002లో సర్వీసులో చేరి అనంతరం జనవతి 2004లో వేతనం రూ. 5,470గా నిర్ణయించ బడుతుంది. వీరికి RPS 2010లో తేది 1-7-2008 నాడు వేతనం రూ. 10,900 గాను, తదుపరి ఇంక్రీమెంట్ తేది జనవరి 2009న రూ. 11,200/- గానూ నిర్ణయించబడుతుంది.

పై ఉదాహరణలో సీనియర్ ఆయిన ఉపాధ్యాయులు జూనియర్ ఉపాధ్యాయుని కంటే 3 నెలలు ఆలస్యంగా ఇంక్రిమెంట్ పొందుతున్నాడు. ప్రస్తుతం ప్రీఫోన్ మెంట్ ఉత్తర్వుల మేరకు నీనియర్ ఉపాధ్యాయుని ఇంక్రీమెంట్ తేది జనవరి నుండి జానియర్ ఉపాధ్యాయుని ఇంక్రిమెంట్ తేది అక్టోబర్ కి ప్రీఫోన్ చేయబడుతుంది.

పై సౌకర్యము కలుగజేయు అధికారము వేతన నిర్ణయము చేయు అధికారికి( DDO ) గలదు.

స్టెప్ అప్, ప్రీఫోన్ మెంట్ కొన్ని ముఖ్యమైన ఉత్తర్వులు

1.G.O.Ms.No. 297, Fin, dt : 25-10-1993

2.G.O.Ms.No. 52, Fin, dt : 25-2-2010

3.G.O.Ms. No. 93, Fin, dt : 3-4-2010

4.G.O.Ms.No. 96, Fin, dt : 20-5-2011

5.Memo No. 33327.A /549 / A1 / PC-I/2009, dt : 13-3-2010.

6.Memo No. 5465/ 48 / A2 / PC.I/ 2011

7.Memo No. 12254 / 133/ PC-I/ 2010, dt : 30-8-2010.

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

ప్రశ్న:
ప్రభుత్వ ఉద్యోగులకి ఏయే సమయాలలో మెడికల్ లీవ్ ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు.? మెడికల్ లీవ్ తీసుకొన్న వారికి ఏమైన సాలరీ ఇస్తారా? ఉద్యోగులకి మెడికల్ లీవ్ వల్ల నష్టము ఏమైనా ఉంటుందా? వీటి గురించి స్పష్టముగా తెలియజేయగలరు? మెడికల్ లీవ్స్ సర్వీసులో ఎన్ని సార్లు తీసుకోవచ్చు?

జవాబు:
మెడికల్ లీవ్ అంటూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ లేవు. ఏ సెలవు అయినా వైద్య అవసరాల కోసం పెట్టుకోవడాన్ని మెడికల్ లీవ్ గా వ్యవహరిస్తారు.

1. ఉద్యోగులకి ప్రతీ సంవత్సరం 30 earned leaves ఉంటాయి. (జనవరి 1 న 15, జులై 1 న 15 అడ్వాన్స్ గా ఇస్తారు) ఇవి పెట్టుకుంటే పూర్తి వేతనం వస్తుంది. గరిష్టంగా 300 రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మనకి ఉన్న earned leaves ప్రతీ సంవత్సరం 15 రోజులు సరెండర్ చేసి పదిహేను రోజులకు సమానమైన జీతం పొందవచ్చు. టెంపరరీ ఉద్యోగులకి ప్రతీ ఆరు నెలలకు 8 క్రెడిట్ అవుతాయి. గరిష్టంగా 30 నిల్వ ఉంటాయి. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం 6 క్రెడిట్ అవుతాయి.

2. ఒక సంవత్సరం రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన వారికి 20 అర్ధ వేతన సెలవులు క్రెడిట్ అవుతాయి. వీటికి సగం పే, సగం DA, పూర్తి HRA వస్తుంది. ఈ సెలవులను వైద్య కారణాలపై వాడుకుంటే రెట్టింపు సెలవులు తగ్గించి పూర్తి జీతం ఇస్తారు. తాత్కాలిక ఉద్యోగులకు ఇవి ఉండవు. అప్రెంటిస్ లకు సంవత్సరానికి 30 సెలవులు వైద్య కారణాలపై వాడుకోవచ్చు.

3. EL, HPL లేకపోతే EOL ఉపయోగించుకోవాలి. దీనికి జీతం రాదు. ఇది ఇంక్రిమెంట్లకు, పెన్షన్ కు కౌంట్ కాదు. వైద్య కారణాలపై ఉపయోగించుంకుంటే ఇంక్రిమెంట్ కి లెక్కిస్తారు.

                      ***********

ప్రశ్న:
మ్యూచ్యువల్ ట్రాన్స్‌ఫర్ లో వెళ్ళడం లాభమా? నష్టమా? తెలుపగలరు.

జవాబు:
మీరు అడిగేది ఇతర జిల్లాలకు వెళ్లాడానికా?

మన రాజ్యాంగం ప్రకారం స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు. కేంద్రం మిగిలిన రాష్ట్రాల్లో ఇలాగే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు ఉండవు.

కానీ ఆర్టికల్ 371 డి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా రిజర్వేషన్లు, సీనియారిటీ లిస్టులు నిర్వహించ బడతాయి. అందువల్ల నియామక యూనిట్ పరిధి దాటి బదిలీలకు అవకాశం ఉండదు.

*ఎవరైనా సీనియారిటీ వదులుకుని వెళ్ళడానికి సిద్దపడితే ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.*

*ఒక వేళ, వేరే dept కి వెళ్ళాలి అంటే, మీ క్యాడర్ లో ఉన్న సీనియారిటీ అంత పోతుంది. కొత్త dept లో మీరు అందరికన్నా జూనియర్ అవుతారు.