చట్టానికి కళ్ళులేవ్!
...........................
రైతు రుణాలు
కట్టకపోతే జప్తులు
పెట్టుబడిదారులు రుణాలు
కట్టకపోతే అడిగేవారే లేకపోయా
బడా బాబులకు మాత్రం మాఫీలు
అయినా ..........
చట్టానికి కళ్ళులేవ్!
రెవన్యూ భూముల గోలమాల్
అధికారులే ఆసరా
ప్రభుత్వాలే కొండంత అండ
రియల్ దందాలూ 'రియాలే '
అబద్దాలేమీ కావు...............
అయినా...............
చట్టానికి కళ్ళులేవ్ !
ఒకడేమో కులంతో
మరొకడు మతంతో
కొందరేమో భాషతో
మరికొందరు ప్రాంతం......
అయితేనేం.......... ప్రజాస్వామ్యం ఖూనీ
అయినా ..........
చట్టానికి కళ్ళులేవ్
కర్షక కార్మికుల
శ్రమజీవుల ఫలాలను
పెట్టుబడిదారీ వర్గం
పాలకవర్గం కలిసి మరి...
దోపిడీ చేస్తున్నా ....
అయినా .........
చట్టానికి కళ్ళులేవ్ !
దోపిడీదారులు అరాచకులు
కుల, మత ప్రచారకులు
ఎంపీలు, ఎం యల్ ఏ లు, మంత్రులై
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నా......
అయినా ......... .
చట్టానికి కళ్ళులేవ్!
విద్యా వైద్యం
కార్పోరేటీకరణ ప్రైవేటీకరణ అవుతూ
ఉన్నత చదువు పేదోడికి దూరమై
ఉన్నోడికి దగ్గర అవుతున్నా......
అయినా .............
చట్టానికి కళ్ళులేవ్ !
ఎలక్షన్ సంఘం మూగబోయి
ప్రశ్నించిన వారి పై దాడిచేసి
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ
దోపిడీదారులు గెలుస్తున్నా...
అయినా .............
చట్టానికి కళ్ళులేవ్ !
రాజకీయవ్యవస్థ అవినీతి
ప్రజాస్వామ్య మూలలను హరిస్తున్నా..
న్యాయస్థానం పై ప్రజల్లో
విశ్వాసం సన్నగిల్లుతున్నా...
అయినా .............
చట్టానికి కళ్ళులేవ్ !
రాజ్యయంత్రాంగం సుప్రీంకోర్టు
ఒకే వైఖరి అవలంభిస్తున్న
వ్యవహారశైలి ఎట్లున్నా
అటార్నరీ జనరల్ స్పందించక పోయినా...
అయినా ................
చట్టానికి కళ్ళులేవ్ !
కోర్టులు తమ కేసును
తామే విచారించి శిక్ష విధిస్తున్న
న్యాయవ్యవస్థ అవినీతి
పార్లిమెంట్ లో చర్చ జరగక పోయినా...
అయినా ..............
చట్టానికి కళ్ళులేవ్ !
న్యాయవ్యవస్థ ముఖచిత్రం
సామాజిక మాధ్యమాల ప్రభావం....
భారత పాలనావ్యవస్థ
తీరుతెన్నులకు అద్దం పడుతున్న
అయినా .........
చట్టానికి కళ్ళులేవ్ !
రచయిత :-షేక్ రంజాన్