సందేహం:- పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?
👉సమాధానం:- కొత్త పెన్షన్ వారికి అవకాశం లేకుండా పాత పెన్షన్ లో ఆర్థిక లబ్ది ఉన్నవాటిని, వాటిని ఎలా గణిస్తారో మీ ముందుంచుచున్నాను. చేసిన సర్వీస్ ని యూనిట్ల ప్రకారం లెక్కిస్తారు. ఆరు నెలలకు ఒక యునిట్ చొప్పున లెక్కించాలి. చివరగా మిగిలిన నెలలు రోజులకు గాను 3నెలలు దాటితే ఒక యునిట్ గా లెక్కించాలి.
అకాల మరణం పొందిన సందర్భంలో:
👉డెత్ గ్రాట్యూటి : ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే క్రింది విధంగా గ్రాట్యుటీ చెల్లించబడును.
👉ఎ) సర్వీస్ ఒక సంవత్సరం పూర్తికాకుండానే ఉద్యోగి మరణిస్తే 3 సంవత్సరాల అర్హత గల సర్వీస్ కు అర్హతగల గ్రాట్యుటీ ఇవ్వబడును.
👉బి) సర్వీస్ 1 సంవత్సర కాలం పూర్తి చేసి 5 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 9 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉సి) సర్వీస్ 5 సంవత్సర కాలం పూర్తి చేసి 18 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 18 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉డి) సర్వీస్ 18 సంవత్సర కాలం పూర్తి చేసి మరణిస్తే చేసిన సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
👉Formula : (Last drawn (Pay+DA) X Qualifying Service Half Units) 4
👉(RPS 2015 ప్రకారం గరిష్ట పరిమితి 12 లక్షలు)
ఫ్యామిలీ పెన్షన్: ఉద్యోగం చేస్తూ కాని రిటైర్ అయిన తరువాత గాని ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు.
👉i. సర్వీస్ 7 సంవత్సరాలు పూర్తి కాకుండా చనిపోయినచో అతని కుటుంబ సభ్యులలో అర్హులకు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 30% ఫామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.
👉ii. సర్వీస్ 7 సం॥లు పూర్తి చేసి పదవీ విరమణ కాకుండా ఉద్యోగి మరణించినచో కుటుంబ సభ్యులలో అర్హులకు మొదటి 7సం॥ లు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 50% (మరణించిన ఉద్యోగి వయసు 65 సంవత్సారాలు మించకుండా), 7 సంవత్సరాల తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.
👉1. సాధారణ పదవీ విరమణ/ స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో:
👉 రిటైర్ మెంట్ గ్రాట్యిటీ: 5 సం॥ ల సర్వీస్ వేయిటెజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లతో చివరగా డ్రా చేసిన బేసిక్ పే మరియు డి.ఎ ను గణించి 4 తో భాగించగా వచ్చిన రూపాయలను RPS 2015 ప్రకారం గరిష్ఠం గా 12లక్షల వరకు చెల్లిస్తారు.
Gratuity Formul : Last drawn(Pay+DA) X Half Yearly Service Units * 4
సర్వీస్ పెన్షన్: 5 సం॥ ల సర్వీస్ వెయిటేజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లను తీసుకోవాలి. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.
Service Pension Formula: Last Pay drawn X Half Yearly Service Units 2 X 66
ఫ్యామిలీ పెన్షన్: రిటైర్ అయిన తరువాత ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు. పెన్షనర్ గా ఉండి మరణిస్తే పదవీ విరమణ తేది నుండి 7సం॥ ల కాలము లేదా మరణించిన సర్వీస్ పెన్షనర్ కు 65సం॥ వయసు పూర్తయ్యే తేది వరకు ఏది ముందయితే అంతవరకు చివరినెల జీతంలో 50% తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.
Commutation of Pension: ఉద్యోగికి మంజూరయిన పెన్షన్ లో కొంతభాగాన్ని గరిష్ఠంగా 40% అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి మొత్తాన్ని పొందే సౌకర్యం ఉంది. కమ్యుటేషన్ పొందిన తేది నుండి 15సం॥ ల పాటు కమ్యుటేషన్ చేసిన భాగం పెన్షన్ తగ్గింపు చేసి చెల్లిస్తారు కాని కరువు భృతిని మొత్తంపై కలిపి చెల్లిస్తారు. ఇది ఉద్యోగి ఐచ్చికం మాత్రమే తప్పని సరికాదు. ఇది బ్యాంకుక్షా నుండి దాదాపు 8.5% వడ్డీకి అప్పు తీసుకుని చెల్లించినట్టుగా ఉంటుంది. ఇలాంటి అవకాశం కూడా కొత్త పెన్షన్ వారికి అవకాశం లేదు.
సందేహం:- CPS ఉద్యోగి పదవీ విరమణ పొందేరోజు ఎంత చెల్లిస్తారు? పెన్షన్ ఎలా చెల్లిస్తారు? ఏఎ రకమైన పెన్షన్ చెల్లిస్తారు?
👉సమాధానం:-GOMS. No.. 62 తేది 07.03.2014 ప్రకారం ఖాతాదారుడు స్వచ్చంద పదవీ విరమణ, పదవీ విరమణ, అకాల మరణం మూడు సందర్భాలలో ఖాతా నుండి డబ్బును తిరిగి పొందగలరు.
1) స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో: ఉద్యోగి స్వచ్చంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 80% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందచేస్తారు. 20% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
2) సాధారణ పదవీ విరమణ సందర్భంలో: ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 40% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 60% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిధి 2 లక్షల లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
3) అకాల మరణం పొందిన సందర్భంలో: ఉద్యోగి ఖాతా లో ఉన్న మొత్తం (100%) ను నామినికి(లకు) చెల్లిస్తారు.
నిర్ణీత శాతాలలో చేతికి ఇచ్చే సొమ్ముకు ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు లేకపోవడం ఇబ్బందికరం.
PFRDA సర్కులర్ PFRDA/2015/27EXIT/2 తేది 12. 11.2015 ప్రకారం తేది 01.04.2016 నుండి CPS అమౌంట్ ని విత్ డ్రా చేయడం కోసం అప్లై చేయడం కేవలం (except death cases) ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ప్రస్తుతానికి నెలవారిగా పెన్షన్ చెల్లించడానికి 5 Annuity Service Providers గా నియామాకం చేశారు అవి.
1) Life Insurance Corporation of India 2).HDFC Life Insurance Co. Ltd
3). ICICI Prudential Life Insurance Co. Ltd 4).SBI Life Insurance Co Ltd
5).Star Union Dai-ichi Life Ins. Co. Ltd
డిఫాల్ట్ Annuity ప్రొవైడర్ గా SBI ని తీసుంటున్నారు.
పెన్షన్ చెల్లించడానికి నియామకం చేసిన ఐదు అన్యుటి సర్వీస్ ప్రొవైడర్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలయిన SBI మరియు LIC లను పరిశీలనకు తీసుకునగా SBI వారు 15 రకాల పెన్షన్ లను LIC వారు 10 రకాల పెన్షన్ లను వివిధ వయసుల వారిగా అందిస్తున్నారు, మనం పెట్టే పెట్టుబడికి 1లక్ష రూపాయలకు నెలవారిగా ఆయా వయసువారికి పెన్షన్ గా చెల్లించే మొత్తము తేది 03.03.2016 నాటి విలువలను బట్టి ఉన్నాయి.
సందేహం:- CPS ఉద్యోగి పదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?
👉సమాధానం:- పైన చెప్పిన టేబుల్ లో ఎంచుకున్న పెన్షన్ చెల్లిస్తారు, సాధారణ పదవీ విరమణ అయిన సందర్భంలో 60% CPS నిధిని, స్వచ్చంద పదవీ విరమణ అయిన సందర్బంలో 20% CPS నిధిని చెల్లిస్తారు. గ్రాట్యూటి ని ప్రస్తుతం చేల్లించడం లేదు, గ్రాట్యూటి అనేది ఉద్యోగులకు వాళ్ళు చేసిన సేవలకు భాహుమానంగా ఇచ్చేది దీనిని ప్రైవేట్ సెక్టార్ లో కూడా చెల్లిస్తున్నారు కాని CPS ఉద్యోగులకు గ్రాట్యూటి సదుపాయం లేకపోవడం గర్హనీయం. దీనికోసం ఎప్పటినుండో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది. ఉద్యోగి అకాల మరణం చెందిన సందర్భంలో వారి ఖాతాలో జమ అయిన మొత్తం నిధిని చెల్లిస్తారు.
👉కాని కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన ఫామిలీ పెన్షన్ చెల్లించడం లేదు. మిగితా బెనిఫిట్స్ పాత పెన్షన్ విధానంలో లాగే ఖాతాలో జమ ఉన్న EL/HPL ఎన్ క్యాష్ మెంట్, GIS కింద జమచేసిన అమౌంట్ కాని ఆకాల మరణం పొందిన సందర్భంలో GIS కింద జమచేసిన అమౌంట్ తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ను APGLI అమౌంట్ ను మొ|| వాటిని చెల్లిస్తారు.
♦️సీపీఎస్ గురించి వివరణ
👉 ఉద్యోగ విరమణానతరం ప్రతినెల ఉద్యోగికి/ తనపైన ఆధారపడిన వారికి చెల్లించే జీవన భృతికి అప్పటివరకు ఉన్న విధానం లో కాకుండా అప్పటి NDA ప్రభుత్వం వారు 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్లో మార్పు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, వారి ప్రతిపాధనలను తేది 23.08.2003 రోజున ఆమోదించి తేది 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉద్యోగి వాటా ఏమి చెల్లించకుండా పొందే పెన్షన్ కి బదులు ఉద్యోగి వాటాగా బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% నిధిని జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా చెల్లించేలా నూతన విదానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పెన్షన్ నిధిని National Pension System (NPS) Trust వారు National Securities Depository Limited (NSDL) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తం లో ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో Anuity ప్లాన్ లలో పెట్టి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. దీనికోసం Pension Fund Regulatory and Development Authority (PFRDA) ను ఏర్పాటు చేసారు. ఈ నూతన పెన్షన్ విధానాన్ని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి అమలు చేయవచ్చు అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు నూతన పెన్షన్ అమలు చేస్తుండగా, కేవలం పచ్చిమ బెంగాల్ మరియు త్రిపుర రెండు రాష్ట్రాలు మాత్రమే పాత పెన్షన్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ. చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ సంస్కరణ (Pension Reform) లో భాగంగా అప్పటివరకు పెన్షనర్ లకు చెల్లించే కరువు భృతిని (Dearness Relief) 2001 నుండి నిలుపుదల చేసినాడు. కీ.శే. రాజశేకర్ రెడ్డి గారు 2004 సాధారణ ఎన్నికలలో హామీ ఇచ్చి ఆరు విడుతల కరువు భృతిని విడుదల చేసి పెన్షన్ తో డి.ఆర్ చెల్లించే విదానం కొనసాగించారు. ఒకవేళ 6 నెలలకు ఒకసారి పెంచే కరువు భృతిని చెల్లించడము నిలిపివేసి, ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైస్ చేయడం ఆపేస్తే పాత పెన్షన్ పరిస్థితి కొత్త పెన్షన్ కంటే అద్వాన్నంగా ఉండేది.
👉 మిగతా అన్ని రాష్ట్రాలు వేరు వేరు తేదిలలో నుండి ఈవిధానాన్ని అమలుచేస్తూ National Pension System (NPS) Trust లో చేరి తమ రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్ నిధిని NSDL ద్వారా షేర్ మార్కెట్‌లలో పెడుతున్నారు. కాని తమిళనాడు రాష్ట్రం CPS ముందునుండి అమలు చేస్తున్నా వారి నూతన పెన్షన్ నిధిని NPS Trust లో చేరని కారణంగా వారి వద్దే ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నిరసనల మేరకు పాత పెన్షన్ కొనసాగించడానికి ఉన్న సాధ్యాలను పరిశీలించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటి ని ఏర్పాటు చేసారు. త్వరలో వారికి పాత పెన్షన్ పునరుద్దరిస్తారని ఆశిస్తూ... అది ఇతర రాష్ట్రాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 653, 654, 655 తేది 22.09.2004 ప్రకారం తేది 01.09.2004 నుండి ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం (CPS) ని అమలు చేస్తూ, GPF సదుపాయాన్ని తీసివేసారు, బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% ఉద్యోగివాటాగా అంతే మొత్తంలో ప్రభుత్వ వాటాను కలిపి సి.పి.యస్ ఖాతాకు పెన్షన్ నిధిగా జమచేస్తుంది.
👉 ఖాతా నిర్వహణకు దాదాపు 2009 వరకు ట్రెజరీ ఐడి పై కట్ చేశారు తదుపరి CPS ఖాతా నిర్వహణ కు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA), నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) రూపొందించిన పెర్మనెంట్ రిటైర్మెంట్ ఎకౌంటు (PRAN) ను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఖాతా నెంబర్ గా జారి చేస్తారు. CPS నిధిని SBI పెన్షన్ ఫండ్ స్కీం నందు 34%, LIC పెన్షన్ ఫండ్ స్కీం నందు 34% మరియు UTI పెన్షన్ ఫండ్ స్కీం నందు 32% గా పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 2010 సంవత్సరం వరకు జీతంలో కట్ అయిన అమౌంట్ కు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పటివరకు వారి వారి ఖాతాలలో జమ కాలేదు.
దీనికోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థికశాఖకి విన్నవించడం జరిగింది. జి.ఓ 226 తేది 29.09.2011 ప్రకారం 01.04.2009 నుండి 31.03.2011 వరకు మరియు జి.ఓ 142 తేది 17.06.2013 ప్రకారం 01.04.2011 నుండి సి.పి.యస్ లబ్ధిదారుడి వాటా మరియు ప్రభుత్వ వాటా రెండింటి మొత్తాన్ని ఖాతాలో జమ చేసేంత వరకు జరిగిన ఆలస్యానికి సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ ఖాతా దారుడి ఖాతాలో జమచేయాలి.