LATEST UPDATES

9, మే 2021, ఆదివారం

అమ్మ - అవని

This is a simple translate button.

అమ్మ - అవని
ఆ.వె : 

కాంచు నెపుడు మనల కారుణ్య మూర్తియై
ప్రేమ నెంతొ  పంచు పృథ్వి యందు
అమ్మ యన్న మనకు ఆరాధ్య దేవతై
అపర కీర్తి బొందె నమృత వల్లి
                            ( 01 )

మాంధ్య మందు చూపు మంత్రియై మనమున
చిరము ఖ్యాతి గాంచు చెల్లి గాను
వివిధ పాత్ర లందు వేల్పుడు ఘణతను
రణము నందు నెగ్గు రాణి వోలె
                                (02)

మంచి మనసు గల్గి మమతల మూటయై
ఓర్మి తోటి నేర్పు ఒజ్జ గాను
అమ్మ కన్న లేదు యవనిన దైవము
మాతృ  మూర్తి నెపుడు మరువ వలదు
                             ( 03  )

అమ్మ యన్న పదము కమ్మని పలుకుయై
పరుల హితము గోరె బట్టు కొమ్మ
తెలుగు నందు లేదు తీయని కావ్యము
వర్ణమాల యందు ప్రథమ పదము
                          ( 04  )

✍️ శ్రీహరి.ఏలే,
పా.స.ఉ.(సాంఘిక శాస్త్రం)
జి.ప.ఉ.పా ,పుల్లెంల
చండూరు మం.
నల్లగొండ
96406 91884
( నేడు మాతృమూర్తులందరికి " అంతర్జాతీయ మాతృ దినోత్సవం  " శుభాకాంక్షలు )

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి