LATEST UPDATES

11, మే 2021, మంగళవారం

అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)

అహం (వరల్డ్ ఈగో అవేర్ నెస్ డే సందర్భంగా)

             చేసిన తప్పులను
 ఒప్పు కోవాలనుకున్న ప్రతీసారి
            వద్దు వద్దంటూ
      సైంధవుడిలా అడ్డగిస్తావు.
   అంతరాలు భేషజాలు లేకుండా
 అందరితో మమేకం కావాలని చూస్తే
              కులం మతం
                పేద ధనిక
           స్థాయి భేదాలంటూ
  ప్రహరిగోడలా ప్రత్యక్షమవుతావు.
         వివాదాల పరంపరకు
         వీడ్కోలు చరమగీతం
            పాడాలనుకుంటే
                వీల్లేదంటూ 
  ముళ్ళకంచెలా హద్దులు గీస్తావు.
        అంతరాత్మ అద్దంలో
       నన్ను నేను చూడబోతే
      అడంబరపు ముసుగులా
              అడ్డమొస్తావు.
        ఎంత ఎత్తులకెదిగినా
    నీడలా వెంటపడి వేధిస్తావు.
    రంగమేదైనా వ్యక్తులెవరైనా
   తరతరాలు నీ నిరంకుశత్వ
               పరంపరకు
         తలొంచక తప్పలేదు.
                  చివరకు
  నా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని
               ప్రయత్నిస్తావు.

                         గంజి.దుర్గాప్రసాద్
                              వలిగొండ.
                          9885068731

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?

👉 సమాధానం:

వైద్య కారణాలతో (మెడికల్ గ్రౌండ్స్) కమ్యూటేషన్ సెలవుగానీ, ఎరండు లీవును గాని తీసుకుని పూర్తి జీతము పొందవచ్చు. అందుకు డాక్టర్ సర్టిఫికేట్ జతపరచాలి. G.O. Ms.No. 386, DT: 6-9-1976;; G.O. 268, DT: 28-10-1991 and G.O. 29, DT: 9-3-2011.

ప్రశ్న:

దాదాపు6 సంవత్సరాల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై, అక్కడ కూడా 2 సం,, రాలు పనిచేసి తిరిగి పాత పోస్ట్‌ లో చేరిన ఉపాధ్యాయుని 2 సం,,రాల సర్వీసును ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?

👉సమాధానం:

FR -26(i) ప్రకారం ప్రస్తుత పోస్ట్ పై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్ట్ కంటే తక్కువ కాని పోస్ట్ లో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No. 117, F&P, DT: 20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2 సం,,. ఇతర పోస్ట్ సర్వీసు AAS నకు  కూడా లెక్కించబడుతుంది.

ప్రశ్న:

6 సంవత్సరాల 3 నెలల కాలం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి Proper Channel ద్వారా విడుదల అయ్యి TSWRDC డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైన ఉపాధ్యాయురాలు 18 నెలలు పనిచేసి తిరిగి పాత ఉద్యోగంలో చేరితే సర్వీసు ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ఏవిధంగా లెక్కిస్తారు ? డిగ్రీ లెక్చరర్‌గా పనిచేసిన సర్వీసు పాత S.A సర్వీసుకు సాలరీ ప్రొటెక్షన్ వర్తిస్తుందా ? లేదా పాత సర్వీసులోని ఇంక్రిమెంట్ ని కలుపుతూ సాలరీ కొనసాగిస్తారా ?

👉సమాధానం:

వెనక్కి రావచ్చు. ఆ సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కిస్తారు. Regular Post కు మూడేళ్ల లీన్ ఉంటుంది. కనుక వెనక్కి వస్తే పాత పోస్ట్ యొక్క అన్ని Benefits వర్తిస్తాయి.

భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?

భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?

జ॥ 1) భార్య/ భర్తలు ఎవరో ఒకరు సర్వీసులో కాని / రిటైర్‌ అయిన తరువాత చనిపోతే అతని/ఆమె, భాగస్వామి పెన్షను బ్రతికి వున్నంత వరకు చెల్లించాలి.

2) బ్రతికి వున్న వారు రిటైర్‌ అయితే రెండు పెన్నన్లు,1 సర్వీసు పెన్నను 2 ఫ్యామిలీ పెన్నను చెల్లిస్తారు.

3) భార్య/భర్త (తల్లి/తండ్రి) ఇద్దరూ చనిపోతే వారి పిల్లలకు రెండు ఫ్యామిలీ పెన్సనులు చెల్లిస్తారు కాని రెండు ఫ్యామిలీ పెన్నన్లు కలిపి నెలకు ప్రస్తుతము గరిష్టంగా రూ.27830/- గా సవరించారు.

రూలు 50, 10 (ఎ) (i) (ii) (బి)

GO. (P) No. 245 F (Pen.I) Department Dated 4-9-2012.

10, మే 2021, సోమవారం

వందనాలు - అభివందనాలు

వందనాలు అభివందనాలు


కష్టాలు కన్నీళ్లు
దాచుకొని.....
లాలిస్తూ... కరుణిస్తూ...
ప్రేమిస్తూ... ప్రోత్సహించే....
తల్లులకు....
వందనాలు అభివందనాలు

అభ్యాగులు నిరుపేదలు
అనాధలు వృద్దులు
వితంతవులు రోగులను
ఆదుకునే...
తల్లులకు....
వందనాలు అభివందనాలు

సంస్కృతి కట్టుబాట్లు
బాధ్యతలు నేర్పి...
చేదోడు వాదోడుగా
ధైర్యము మనోబలాన్ని
పెంపొందించే....
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

కుటుంబ సంక్షోభాన్ని
అత్యంత చాకచక్యంగా 
మనో నిబ్బరంతో పరిష్కరించే
నేర్పు ఓర్పు ఉన్న...
తల్లులకు....
వందనాలు అభివందనాలు

మానవత్వం సమానత్వం
సౌబ్రాతత్వం.......
సాధనే లక్ష్యంగా..
ముందుకు పోతున్న..
తల్లులకు......
వందనాలు అభివందనాలు

అదృష్టాన్ని చూసి
మురిసి పోక....
కష్టాలు వచ్చాయని
కుంగి పోక.....
బాధ్యతల బరువు..
భుజస్కంధాల పై....
వేసుకునే....
తల్లులకు...
వందనాలు అభివందనాలు

గృహిణిగా......
ఇంటిని చక్కదిద్దుతూ....
యుగాలు.....
గడిచే కొద్ది...
శక్తివంతమవుతున్న......
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

వైద్యరాలుగా.. పోలీసుగా...
నర్సుగా.. ఉపాధ్యాయురాలుగా.......
రక రకాల బాధ్యతలు........
చేప్పట్టి........
సమాజాన్ని సరిదిద్దేపనిలో....
భాగస్వాములైన........
తల్లులకు......
వందనాలు అభివందనాలు

సమాజ ఉన్నతికి
సహకరిస్తూ.......
బిడ్డలను.......
రేపటి బాధ్యతాయుతమైన...
పౌరులుగా......
తీర్చిదిద్దుతున్న....
తల్లులకు.....
వందనాలు అభివందనాలు

అందరికి మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ....

                షేక్ రంజాన్

9, మే 2021, ఆదివారం

అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)

అమ్మ పద్యం (మదర్స్ డే కవిత)

అలవోకగా
అమ్మనోట
తేనేచుక్కల్లా జాలువారిన
ఇతిహాస పద్యాలు
బతుకమ్మ పాటలు
నీతికథలు
ఆకలిని మరిపించి
హాయిగా నిద్రపుచ్చిన
అద్భుతమంత్రాలు.
అమ్మ నేర్పిన పద్యాలు
చెప్పిన కథలు
బ్రతుకుబాటలను చూపే
బడిపంతులును చేసాయి.

పరువు ప్రతిష్ఠల 
వారసత్వాలు
గత వైభవ గౌరవాల బరువులతో
బీదరికపు బాధల
భిన్నధృవాల మధ్య నలుగుతు
గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చిన 
అమ్మను చూస్తే
స్థితప్రజ్ఞతల భూమధ్యరేఖ లా
కన్పిస్తుంది.

తాను వేసిన పునాదులపై
తలెత్తుకు నిలబడిన 
భవంతుల ఎదుగుదలను
తన క్షేత్రంలో
విత్తనాలుగా మొలకెత్తిన
ప్రయోజకత్వ
ఫలవృక్షాలను చూసిన
అమ్మ కళ్ళలో 
కదలాడుతున్న
ఆనందాతిశయాల పారవశ్యం.

పరిపూర్ణ జీవితానుభవాలతో
పండిపోయిన
అమ్మను చూసినప్పుడల్లా
అన్పిస్తుంది.
మళ్ళీ!
అమ్మగా పుట్టకు
నా ఇంటి ఆడబిడ్డగా పుట్టు
ఏ కొంతైనా
నీ రుణం తీర్చుకోవాలనీ..,

  
                             గంజి.దుర్గాప్రసాద్
                                      వలిగొండ
                                 9885068731

అమ్మ - అవని

అమ్మ - అవని
ఆ.వె : 

కాంచు నెపుడు మనల కారుణ్య మూర్తియై
ప్రేమ నెంతొ  పంచు పృథ్వి యందు
అమ్మ యన్న మనకు ఆరాధ్య దేవతై
అపర కీర్తి బొందె నమృత వల్లి
                            ( 01 )

మాంధ్య మందు చూపు మంత్రియై మనమున
చిరము ఖ్యాతి గాంచు చెల్లి గాను
వివిధ పాత్ర లందు వేల్పుడు ఘణతను
రణము నందు నెగ్గు రాణి వోలె
                                (02)

మంచి మనసు గల్గి మమతల మూటయై
ఓర్మి తోటి నేర్పు ఒజ్జ గాను
అమ్మ కన్న లేదు యవనిన దైవము
మాతృ  మూర్తి నెపుడు మరువ వలదు
                             ( 03  )

అమ్మ యన్న పదము కమ్మని పలుకుయై
పరుల హితము గోరె బట్టు కొమ్మ
తెలుగు నందు లేదు తీయని కావ్యము
వర్ణమాల యందు ప్రథమ పదము
                          ( 04  )

✍️ శ్రీహరి.ఏలే,
పా.స.ఉ.(సాంఘిక శాస్త్రం)
జి.ప.ఉ.పా ,పుల్లెంల
చండూరు మం.
నల్లగొండ
96406 91884
( నేడు మాతృమూర్తులందరికి " అంతర్జాతీయ మాతృ దినోత్సవం  " శుభాకాంక్షలు )

పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌ ఏ రోజు వరకు చెల్లిస్తారు?

పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్‌ ఏ రోజు వరకు చెల్లిస్తారు?

సమాధానం
 
✍️1) కుమారులకు 25 సంవత్సరాల వయసు వరకు లేక అతను సంపాదన మొదలు పెట్టే రోజు వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు

GO.Ms.No. 287, F&P dt. 12-8-1999,

 ✍️2) కుమార్తెలకు పెళ్ళి అయ్యేంత వరకు/వారు సంపాదన మొదలు పెట్టెంత వరకు ఏది ముందు సంభవిస్తే అంతవరకు.


రూలు 50.
Executive instruction (iv) (ii) (a) (b)
GO.Ms.No. 278, Fin& Plg. (Fw-Pen-I) Dept., dt. 19-10-1987.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంటు వయసు ఎంత?

✍️జ॥ (1) వర్క్‌మెన్‌ మరియు నాల్గవ తరగతి ఉద్యోగులు - 60 సంవత్సరాలు.
             (2) ఇతరులు - 61 సం॥లు(తెలంగాణ), 60 సం॥లు(ఆంధ్రప్రదేశ్‌).
 
ఏ రోజున తప్పక రిటైర్‌ కావాలి?

✍️జ॥ పుట్టిన తేది ఆ నెలలో ఒకటవ తేదీ కాకుండా ఉన్నవారికి 61/60 అయిన నెలలోచివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా: - పుట్టిన తేది 2-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌మెంట్‌ వయసు అయితే రిటైర్‌మెంట్‌ 31-1-2015 అవుతుంది. పుట్టిన తేది ఒకటవ తేదీ అయితే పుట్టిన నెలకంటే ముందు నెల చివరి రోజున రిటైర్‌ కావాలి.

ఉదా:- పుట్టిన తేది 1-1-1954 అయితే 61 సంవత్సరాల రిటైర్‌ మెంటు వయసు అయితే రిటైర్‌మెంటు 31-12-2014 అవుతుంది.

రూలు -42

Executive Instruction (i)

GO.Ms.No. 289, Fin.&Plg. Dept., dated. 4-11-1974.

కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇటీవలి కాలంలో కోవిడ్ బారిన పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కు అర్హత ఉంటుంది.. దాని కోసం కారుణ్య నియామకాల పూర్తి నిబంధనలను ఇక్కడ పొందుపర్చుతున్నాను.

కారుణ్య నియామకాలు

ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ నియామకాలపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి.

మీకోసమే ఈ సమాచారం

కారుణ్య నియామకాలు :

రెండు రకాలు.

ఒకటి: మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.

రెండు: వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.

👉కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి ?

మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.

జీవోలు:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు. కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్‌-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య కారణాల వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్‌ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు. సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్‌ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్‌ నెంబర్‌ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.

కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

👉 ఎవరికిస్తారు?

ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.

1.ఉద్యోగి భార్య/భర్త,

 2.కుమారుడు/కుమార్తె,

3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,

4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె.

5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు.

6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.

ఏ పోస్టులో నియమిస్తారు?

జూనియర్‌ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.

👉నియామక విధానం ఎలా?

ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులుయ నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్‌ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్‌ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.

అర్హతలు:

ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌గా సబార్డినేట్‌ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్‌ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు, శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది. ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు. చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.

నియామక పరిధి:

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 5 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.

ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో సిక్స్‌ పాయింట్‌ ఫార్మలాకు లోబడి ఇవ్వబడతాయి. రిజర్వేషన్‌ నిబంధన (రూల్‌ 22)ను పాటించాల్సి వుంటుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంటే ఆమె సొంత జిల్లాలోగానీ, భర్త ఉద్యోగం చేసిన చోటగానీ, ఏ ఇతర జిల్లాలోగానీ నియామకం కోరవచ్చు.      

■ ఇటీవలి ఉత్తర్వులు:

◆ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, అందులో ఒకరు రిటైర్‌ అయి పెన్షన్‌ తీసుకుంటుండగా, మరొకరు మరణిస్తే వారిపై ఆధారితులకు కారుణ్య నియామకం వర్తించదు. ఆ ఇంట్లో పెన్షన్‌ పొందుతున్న వ్యక్తి ఉన్నందున దాన్ని ఆదాయం ఉన్న కుటుంబంగానే పరిగణించి కారుణ్య నియామకం ఇవ్వరు. దీనికి సంబంధించి సర్క్యులర్‌ మెమో నెం.3548/సర్వస్‌-జి/ఏ2/2010-8, జీఏడీ, తేదీ : 24.03.2012 జారీ చేసింది.

◆ భర్త /భార్య చనిపోతే భార్యకు/భర్తకు 45 వయసు దాటితే కారుణ్య నియామకానికి అనర్హులు... అయినా ప్రభుత్వం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చిన సందర్భం...
(GO MS No. 45 Dated .28.02.2020)

👉 ఎక్స్‌గ్రేషియా :

కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు, నాన్‌ గెజిటెట్‌ వారికి రూ.60 వేలు, గెజిటెడ్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలి.

8, మే 2021, శనివారం

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

👉1.పొదుపు / క‌రెంట్ ఖాతా: ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ. 1 లక్ష‌. పొదుపు ఖాతాలో ఒక ల‌క్ష రూప‌యాల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

👉2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాలి.

👉3.బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్): బ్యాంక్ ఎఫ్‌డీలో నగదు డిపాజిట్ రూ. 10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కు మించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.


👉4. మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు న‌గ‌దు పెట్టుబ‌డులు రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తనిఖీ చేస్తుంది.


👉5. రియల్ ఎస్టేట్: ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.

ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిసిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనుక నుండి కాటెయ్యి అంది తొండ. పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ లగెత్తిపొయ్యిందంట. నన్ను కరిసింది తొండే కదా అని దైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.

ఇప్పుడు ఇంకో పొలంలో రైతుని నేను కరుస్తాను, నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి పో అని తొండ కరిసింది. పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పొయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది.

కాబట్టి మనం అందరం, పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు వంటి వాటిలో పిట్టలదొరలు రాసేవీ అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం భాదపడాల్సి వస్తుంది.

దైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తతో మెసులుకోండి. మీ ధైర్యమే మీకు బలం..

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

USEFUL FOR GOVERNMENT  SERVANTS

సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

 FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

 సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి (Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

 ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.
(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)
(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)

 సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్  లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

 AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాక ముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.

 రెండు సం. కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.
(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

 సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

 సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే  Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

 సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

 జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము (Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.
(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

 సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

 ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీ చేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.

(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

 ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు. ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969)

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

 సెక్షన్-25
-చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి.

సెక్షన్-26
-చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీని చేపట్టాలి.

సెక్షన్-27
-ప్రతి పదేండ్లకు నిర్వహించే జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు, పార్లమెంట్, శాసనసభ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్ప ఏ ఇతర పనులకు ఉపాధ్యాయుడిని పంపకూడదు.

సెక్షన్-28
-ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్లను, బోధన పనులను చేపట్టరాదు.*

సెక్షన్-29
-సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్ సంస్థ ప్రాథమిక విద్య కోసం పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. అయితే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, బాలల సర్వతోముఖ వికాసం, బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు, బాలల శారీరక, మానసిక అభివృద్ధులను, పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల్లో కార్యక్రమాలు, పరిశోధనలు, బాలల మాతృభాషను, భయం, ఆందోళనకు గురిచేయని వాతావరణం, పిల్లల సామర్థ్యాన్ని అంచనావేసే విధానం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

సెక్షన్-30
-ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పిల్లలు ఎలాంటి బోర్డు పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. పిల్లలు ప్రాథమిక విద్య పూర్తిచేసిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందించాలి.

సెక్షన్-31
-బాలల హక్కులను పరిరక్షించడం

సెక్షన్-32
-సెక్షన్-31లో పేర్కొన్న దానితో సంబంధం లేకుండా ఈ చట్టం కింద పిల్లలకున్న హక్కులకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపే అధికారం ఉన్నది.

సెక్షన్-33
-కేంద్రప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) జాతీయ సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-34
-రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్సీపీసీఆర్) రాష్ట్రస్థాయి సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-35
-కేంద్రప్రభుత్వం, సందర్భానుసారంగా చట్టానికి దోహదపడే రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వానికి తగిన సూచనలు జారీచేసే అధికారాలు ఉన్నాయి.

సెక్షన్-36
-సెక్షన్-13(2), సెక్షన్-18(5), సెక్షన్-19(5) కింద నిర్ధారించిన దండనీయ నేరాలను సంబంధిత ప్రభుత్వం, ప్రత్యేక విజ్ఞప్తి ద్వారా, దీనికోసం నియమించిన అధికారి ఆజ్ఞ లేకుండా నిలిపే అధికారం లేదు.

సెక్షన్-37
-ఈ చట్టంలోని నియమావళిని సద్భావనాపూర్వకంగా చూడాలి.

సెక్షన్-38
-సంబంధిత ప్రభుత్వం, చట్టం నియమావళిని కార్యాచరణ రూపం దాల్చడానికి చేపట్టే చర్యలకు సూచనలు జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.....

INCREMENTS -ఇంక్రిమెంట్లు - వివరణ

INCREMENTS -ఇంక్రిమెంట్లు - వివరణ

        ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.

        ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.

        APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించారు.
(G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)

        నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.
            (G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)
            (G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)

        DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

        ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరుచేయాలి.
            (Memo.No.49463 Dt:06-10-1974)

        ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.
        Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి    ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.

        నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

        వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.

ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము:

        -ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

        -అన్ని రకాల సెలవులు(జీత నష్టపు సెలవు తప్ప)

        -డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

        -అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

        -పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

        -ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

        - ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)

ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం:

        -జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు.సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.
        - జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భమూ:

        -వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది(ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు)
(FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)

        - 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సంధర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.

ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:

        -తప్పుడు ప్రవర్తనా,విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.

Without Cumulative Effect:
        FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు.అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.

With Cumulative Effect:
        దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి.సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి.ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి.ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

ఇంక్రిమెంట్లు-రకాలు:

స్టాగ్నేషన్  ఇంక్రిమెంట్లు:

-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి  వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫిక్సేషన్,ప్రమోషన్లు, AAS )లకు పరిగణిస్తారు.
10వ పి.అర్.సి లో 5 
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.
(G.O.Ms.No.152 F&P Dt:04-11-2000)

(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)

ప్రిపోన్మెం ట్ ఆఫ్ ఇంక్రిమెంట్:

-ఉద్యోగుల వేతన స్థిరీకరణ  సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.

ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు:

- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్) నిర్వహించాలి.

- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి.
(Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)

- అర్జిత సెలవు లో(EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్,గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.

- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- FR 18

-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నోషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్న్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు.
(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)

-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి......

సరెండరు లీవు - కొన్ని వివరణలు

సరెండరు లీవు - కొన్ని వివరణలు

✍️ఒక ఆర్థిక సంవత్సరములో 15 రోజుల ఆర్జిత సెలవు సరెండరు చేయవచ్చు. అదేవిధంగా రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజుల వరకు సరెండరు చేయవచ్చు. ఒక సరెండరు లీవుకు మరొక సరెండరు లీవుకు మధ్య వ్యవధి 12 నెలలు/24 నెలలు వుండవలెనని ఇదివరలో షరతు వుండెడిది. కాని

Govt. Circular Memo No 13870/A/436/FRI/2005 Fin.(FRI) Dept. dt 27-6-2005

✍️ద్వారా జారీ చేసిన వివరణ ద్వారా, ఆర్థిక సంవత్సరములో 15 రోజులు, రెండు ఆర్థిక సంవత్సరములలో 30 రోజులు అని తెలియజేసింది.

(Also.see Govt. Circular Memo No. 17915-c/542 FRI/2005 Fin: Dept. dt. 4-7-2005)

FAC అలవెను గురించి వివరణ.

FAC అలవెను గురించి వివరణ.

విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్‌ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్‌ఎంలుగా.__FAC MEO లుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. ఈ విషయమై వివరణ.

 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.

- మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్‌ అలవెనుస్‌ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.

- తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్‌ అలవెన్సుస్‌ చెల్లిస్తారు.

- ఒకరోజు గ్యాప్‌ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే. __ మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అంద్‌ అలవెన్సులను FAC Allowance  గా చెల్లిస్తారు.

అనుమతిలేని గైర్‌హాజరు - FR.18 కు సవరణలు

అనుమతిలేని గైర్‌హాజరు -- FR.18 కు సవరణలు

ప్రభుత్వ ఉద్యోగి అనుమతిలేని గైర్ హాజరు అయిన ఈ క్రింద తెలిపిన సందర్భాలలో తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించవలసియున్నది.
(Amendment issued to FR. 18 by adding as FR. 18-A issued in G.O.Ms. No. 128 Finance (FRI) dept. dt. 1-6-2007).

1. ఒక సంవత్సర కాలానికి మించి అనుమతిలేని గైర్ హాజరు (Absent) అయిన యెడల లేక

2. సెలవుపైగాని లేక, సెలవుగాని కాలం ఐదు సంవత్సరములు మించిన యెడల లేక

3. ప్రభుత్వం అనుమతించిన కాలాన్ని మించి Foreign సర్వీసులో డిప్యూటేషన్‌పై కొనసాగిన పక్షంలో.

పై సందర్భాలలో ఉద్యోగిపై చర్యలు తీసుకొనే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను.

(Added as Rule 5- B to A.P. Leave Rules 1933 in G.O.Ms. No. 129 F (FRI) Dept.dt. 1-6-2007)

6, మే 2021, గురువారం

అసాధారణ సెలవు - ఇంక్రిమెంట్లు

అసాధారణ సెలవు - ఇంక్రిమెంట్లు :

✍️ఒక ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించిన అసహాయ పరిస్థితులలో రోగ పీడితుడిగా వున్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలోగాని,లేక పై చదువులకుగాని,సాంకేతికపరమైన చదువులకుగాని అసాధారణ సెలవు మంజూరు చేసిన యెడల,అట్టి అసాధారణ సెలవు, ఇంక్రిమెంటు మంజూరు చేయుటకు పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

(FR 26 (b) As introduced in G.O MS NO.357 Fin dept Dated. 1-9-1962).

✍️కాని సస్పెన్సనుకు గురియైన ఉద్యోగి సస్పెన్షను కాలాన్ని అసాధారణ సెలవుగా Anual Grade Increment) వరిగణించినప్పుడు,అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటు కొరకు పరిగణించుటకు వీలులేదు.

(Govt Memo No.11302/FR2/64-1 Fin dept Dated.16-6-1964).

✍️సస్పెన్షనుకు గురియైన ఉద్యోగి అంతిమ క్రమశిక్షణా చర్యల పర్యవసానంగా,సస్పెన్నను కాలాన్ని నాట్‌ డ్యూటీ (Not Duty) గా క్రమబద్ధీకరించిన సందర్భంగా,ఏ మేరకైతే అసాధారణ సెలవు (Extra-Ordinary) సెలవు క్రింద పరిగణిస్తారో,అట్టికాలం వార్షిక ఇంక్రిమెంటు (Anual Grade Increment) కు పరిగణించబడదు

(Govt Memo No.11302 FR2/64-1 Fin dept Dated.16-6-1964).

5, మే 2021, బుధవారం

సందేహాలు - సమాధానాలు - పెన్షన్

సందేహం

సర్వీసులో Interruption అంతరాయము వుంటే, పెన్నన్‌కు అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?

సమాధానం

✍️సర్వీసులో అంతరాయము కలిగిన కాలాన్ని పెన్సనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో పరిగణిస్తారు.

(1) గైర్హాజరు కాలానికి సెలవు మంజూరు చేసినప్పుడు

(2) సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు

(3) జాయినింగ్‌ టైము వినియోగించినప్పుడు

(4) పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు

(5) పెన్షను మంజూరు అధికారి వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు

రూలు 27 (ఎ) నుండి (ఎఫ్‌) (2)

సందేహం

Invalid Pension ఎప్పుడు చెల్లిస్తారు?

సమాధానం

✍️ఒక ఉద్యోగి,అతను చేస్తున్న ఉద్యోగము చేయలేడని మెడికల్‌ అధారిటీ డిక్లేరు చేస్తే అతనికి రూలు 45 లోబడి Invalid Pension మంజూరు చేస్తారు.


అయితే మెడికల్‌ అధారిటి ఉద్యోగి ఇప్పుడు చేస్తున్న పనికంటే తక్కువ శ్రమ కల్గిన పనిచేయగలడు అని భావిస్తే అతనిని ఆ పోస్టులో నియమించవచ్చు.ఆ పని చేయడానికి అతనికి ఇష్టం లేకపోతే అప్పుడు అతనికి Invalid Pension మంజూరు చేస్తారు.

ఉద్యోగి దుర అలవాట్ల కారణంగా అతనికి అనారోగ్యం సంభవిస్తే అతనికి Invalid Pension మంజూరు చేయబడదు.

రూలు 37 (1) (2) (3)

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
నేను B.Ed లో 3rd methodology గా  maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా?

జవాబు:
మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.

ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా??
జవాబు:
జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.

ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా?

జవాబు:
జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.

ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా?

జవాబు:
అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

ప్రశ్న:
నేను దసరా సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా?

జవాబు:
దసరా సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.

సందేహాలు - సమాధానాలు

సందేహం

సస్పెన్షన్ పీరియడ్‌ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి?

సమాధానం:

✍️సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్థ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*  

సందేహం
      
నేను జీత నష్టపు సెలవు పెట్టి M.Ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను?

సమాధానం:

✍️జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్‌,AAS స్కేల్స్‌ వాయిదా పడతాయి. మూడు సంవత్సరములు పైన జీత నష్టపు సెలవు కాలం పెన్లన్‌ కి అర్హదాయక సర్వీస్‌ గా పరిగణింపబడదు.

27, ఏప్రిల్ 2021, మంగళవారం

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన, ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

జవాబు:
జమ చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.

2. ప్రశ్న:
నేను ఒక CPS ఉద్యోగిని. ఏ సందర్భంలో 50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు ?

జవాబు:
మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది. (eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.

3. ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు?

జవాబు:
వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు. ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు. 1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.

4. ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థలకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది?

జవాబు:
కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

5. ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా?

జవాబు:
FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.

6. ప్రశ్న:
OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా?

జవాబు:
మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు, పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.

7. ప్రశ్న:
TSGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా?

జవాబు:
జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించే వారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.

8. ప్రశ్న:
మెడికల్ రీ-అంబర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి?

జవాబు:
హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.

9. ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను. నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు?

జవాబు:
క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు. ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.

10. ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి?

జవాబు:
ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు (కోడ్--37) రాయాలి. అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.

11. ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?

జవాబు:
FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి. కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి అనుమతితో జమ చేయవలసి ఉంటుంది.

17, ఏప్రిల్ 2021, శనివారం

గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!

 మగువా మగువా
పాటలోని  పదాల స్థానంలో గురువా గురువా పెడితే 
ఎలా ఉంటుందో చూడండి.  

తెలుగు భాషా గొప్ప తనం 

పల్లవి
గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!
గురువా గురువా 
నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!

అటు ఇటు అన్నింటా, 
నువ్వే జగమంతా
బరువులు  మోస్తావు 
ఇంటా బయట...
అలసట  ఉందంటూ 
అననే అనవంట...
భవిష్యత్ రాస్తావు 
పిల్లల బ్రతుకంతా! 

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...

గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!
గురువా గురువా 
నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!

చరణం
నీ బోధన స్వరమే  శృతి చేయకపోతే 
ఈ భూమికి తెలవారదుగా...!
నీ కరముల కలమే కదలాడకపోతే 
ఏ అభ్యసన కొనసాగదుగా...!

ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా! అంతులేని నీ శ్రమ అంచనాలకందునా...!
ఆలయాలు కోరని జ్ఞానశక్తి రూపమా! 
నీవులేని జగతిలో శాస్త్రమే దొరుకునా...!

నీదగు సాధనలో 
ప్రియమగు బోధనలో 
ప్రతి ఒక విద్యార్థి నీవాడేగా...!

ఎందరి పెదవులలో 
ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...!

స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ.స...

గురువా గురువా లోకానికి తెలుసా నీ విలువా...!
గురువా గురువా 
నీ జ్ఞానానికి సరిహద్దులు కలవా...!

Dedicated to all Teachers 🙏🙏🙏

15, ఏప్రిల్ 2021, గురువారం

సందేహాలు - సమాధానాలు

 సందేహాలు - సమాధానాలు -


1. ప్రశ్న

ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా?

జవాబు:

అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేయించుకోవచ్చు.


2.  ప్రశ్న

చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

జవాబు:

G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.


3. ప్రశ్న

స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

జవాబు:

డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది: 27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.


4. ప్రశ్న

 ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

జవాబు:

G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి


5. ప్రశ్న

వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

జవాబు:

ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.


6 ప్రశ్న

 ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

జవాబు:

G.O.Ms.No.52 Fin తేది: 1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు. అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.


7. ప్రశ్న

నేను SA గా పదోన్నతి పొందాను. నాకు ప్రస్తుతం 56 ఇయర్స్. GOT పాస్ అయ్యాను. నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా?

జవాబు:

మెమో.21073 తేదీ: 21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.


8. ప్రశ్న

నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా?

జవాబు:

వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51 తేదీ: 24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.


9. ప్రశ్న

11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా?

జవాబు:

జీఓ.334 తేదీ: 28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.


10. ప్రశ్న

సరెండర్ కాలానికి IR చెల్లించబడతాయా?

జవాబు:

IR మాత్రం చెల్లించబడదు.