సందేహం - సమాధానం
ప్రశ్న:
ప్రభుత్వ ఉద్యోగులకి ఏయే సమయాలలో మెడికల్ లీవ్ ఇస్తారు, ఎంతకాలం ఇస్తారు.? మెడికల్ లీవ్ తీసుకొన్న వారికి ఏమైన సాలరీ ఇస్తారా? ఉద్యోగులకి మెడికల్ లీవ్ వల్ల నష్టము ఏమైనా ఉంటుందా? వీటి గురించి స్పష్టముగా తెలియజేయగలరు? మెడికల్ లీవ్స్ సర్వీసులో ఎన్ని సార్లు తీసుకోవచ్చు?
జవాబు:
మెడికల్ లీవ్ అంటూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ లేవు. ఏ సెలవు అయినా వైద్య అవసరాల కోసం పెట్టుకోవడాన్ని మెడికల్ లీవ్ గా వ్యవహరిస్తారు.
1. ఉద్యోగులకి ప్రతీ సంవత్సరం 30 earned leaves ఉంటాయి. (జనవరి 1 న 15, జులై 1 న 15 అడ్వాన్స్ గా ఇస్తారు) ఇవి పెట్టుకుంటే పూర్తి వేతనం వస్తుంది. గరిష్టంగా 300 రోజులు నిల్వ ఉంటాయి. అలాగే మనకి ఉన్న earned leaves ప్రతీ సంవత్సరం 15 రోజులు సరెండర్ చేసి పదిహేను రోజులకు సమానమైన జీతం పొందవచ్చు. టెంపరరీ ఉద్యోగులకి ప్రతీ ఆరు నెలలకు 8 క్రెడిట్ అవుతాయి. గరిష్టంగా 30 నిల్వ ఉంటాయి. ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం 6 క్రెడిట్ అవుతాయి.
2. ఒక సంవత్సరం రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన వారికి 20 అర్ధ వేతన సెలవులు క్రెడిట్ అవుతాయి. వీటికి సగం పే, సగం DA, పూర్తి HRA వస్తుంది. ఈ సెలవులను వైద్య కారణాలపై వాడుకుంటే రెట్టింపు సెలవులు తగ్గించి పూర్తి జీతం ఇస్తారు. తాత్కాలిక ఉద్యోగులకు ఇవి ఉండవు. అప్రెంటిస్ లకు సంవత్సరానికి 30 సెలవులు వైద్య కారణాలపై వాడుకోవచ్చు.
3. EL, HPL లేకపోతే EOL ఉపయోగించుకోవాలి. దీనికి జీతం రాదు. ఇది ఇంక్రిమెంట్లకు, పెన్షన్ కు కౌంట్ కాదు. వైద్య కారణాలపై ఉపయోగించుంకుంటే ఇంక్రిమెంట్ కి లెక్కిస్తారు.
***********
ప్రశ్న:
మ్యూచ్యువల్ ట్రాన్స్‌ఫర్ లో వెళ్ళడం లాభమా? నష్టమా? తెలుపగలరు.
జవాబు:
మీరు అడిగేది ఇతర జిల్లాలకు వెళ్లాడానికా?
మన రాజ్యాంగం ప్రకారం స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు చెల్లవు. కేంద్రం మిగిలిన రాష్ట్రాల్లో ఇలాగే స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు ఉండవు.
కానీ ఆర్టికల్ 371 డి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా రిజర్వేషన్లు, సీనియారిటీ లిస్టులు నిర్వహించ బడతాయి. అందువల్ల నియామక యూనిట్ పరిధి దాటి బదిలీలకు అవకాశం ఉండదు.
*ఎవరైనా సీనియారిటీ వదులుకుని వెళ్ళడానికి సిద్దపడితే ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.*
*ఒక వేళ, వేరే dept కి వెళ్ళాలి అంటే, మీ క్యాడర్ లో ఉన్న సీనియారిటీ అంత పోతుంది. కొత్త dept లో మీరు అందరికన్నా జూనియర్ అవుతారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి