LATEST UPDATES

4, జూన్ 2021, శుక్రవారం

మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి.

మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!

స మ త
మ జ్జి గ
త గ ము

కం చ ము
చ క్కె ర
ము ర ళి

క్షీ ర ము
ర వ్వ లు
ము లు కు

కా ను పు
ను వ్వు లు
పు లు లు

కా ర ము
ర గ డ
ము డ త

స మ త
మ ర ల
త ల పు

త మ కం
మ ర్యా ద
కం ద కం

పొ ల ము
ల లి త
ము త క

ధ న ము
న వ్య త
ము త క

వ ర స
ర వి క
స క లం

హి మ జ
మ న ము
జ ము న

క వి త
వి న ల
త ల క

కో వె ల
వె న్నె ల
ల ల న

మ న సు
న య నం
సు నం ద

ది న ము
న గ రి
ము రి కి

టో క రా
క వ్వ ము
రా ము డు

చ దు వు
దు ర ద
వు ద కం

ప్ర వే శం
వే ది క
శం క రం 

తెలుగు భాష గొప్పదనం చూశారా...!

3, జూన్ 2021, గురువారం

*గణిత పదనిసలు.... 🧮*

*గణిత పదనిసలు.... 🧮*


⭕6 బయట 7 స్తూ కూర్చోకు!


⭕లెక్కలు అర్ధం కాకుంటే 7 పొస్తుంది.


⭕100న రావు ఎలా ఉన్నాడు??


⭕గురువులకు 100 నం చేద్దాం!


⭕1/2 టి కాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి.


⭕ఈ రోజు మా కూర 1/2 టి కాయ వేపుడు.


 ⭕కూరలో కారం తక్కువ 1000.


⭕10 కాలాల పాటు చల్లగా ఉండాలి.


⭕చెడువ్యసనాలతో ఆయువు 3 తుంది.


⭕పెళ్లికూతురు 100000 ణంగా ఉంది.


⭕పై 1/2 లో 1/4 రం ఉన్నది…

2, జూన్ 2021, బుధవారం

** ఏం మిగిలింది ? - శ్రీ గంజి దుర్గాప్రసాద్ **

** ఏం మిగిలింది ?**

ఏం మిగిలింది?
అత్మగౌరవ పోరులో 
గానుగెద్దు బానిసత్వం తప్ప!
బలిదానాల పునాదులపై
తిష్టవేసిన చుట్టంలా
అధికార భూతం

నినాదాలతో మారుమోగిన
మనోభావాల గొంతుకలు
పచ్చినిజాల పల్లెరుకాయలను
కక్కలేక మింగలేక...

అబద్ధాల భూతద్దంలో
వాపును బలుపుగా భ్రమింపజేస్తూ
అప్పుల సత్తుచిప్పకు
బంగారం కోటింగ్.

గళమెత్తిన కలం కుత్తుకలు
అంక్షల అడకత్తెరల్లో నలుగుతు...
వెలకట్టి కళ ను అమ్ముకుంటూ కొందరు
కళ ను నమ్ముకొని కలలు కల్లలై ఎందరో 

పట్టాలపై నిలిచిపోయిన పొగబండ్లలా
గమ్యం తెలియని
డిగ్రీ,పిజి,PHD పట్టాలు 
ఆవేదన అక్రోషాల సెగలతో రగిలిపోతు...

కడుపునింపని
బెల్లం మాటలు
భరోసాల బూరెలు 
ఇకచాలు.
మరొక్కసారి..,
ముప్పిరిగొన్న ఉప్పెనలు ముంచెత్తాలి
తిరుగుబాటు భూకంపాలు కదం తొక్కాలి
అసంతృప్త అగ్నిపర్వతాలుబ్రద్ధలు కావాలి.


                                           గంజి.దుర్గాప్రసాద్
                                             9885068731

1, జూన్ 2021, మంగళవారం

సందేహం - సమాధానం

సందేహం - సమాధానం

ప్రశ్న:

మా పాఠశాలలో తాత్కాలికంగా పనిచేయుచున్న అటెండర్ కు ఎన్ని సంపాదిత సెలవులు మంజూరు చేయాలి ?

సమాధానం:

మూడు రోజులు

ప్రశ్న:

ప్రస్తుతం చాలా మంది రిటైరైన ఉపాధ్యాయులు హాఫ్- పే- లీవ్స్ నిల్వయున్ననూ ఆ లీవ్ ఎన్ క్యాష్ చేయుట లేదు. దానికి సంబంధించిన లేటెస్ట్ రూల్స్ తెలుపగలరు.

సమాధానం:

1) జీ.వో.ఎం.ఎస్.నెం.342, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేదీ: 30.09.94,
2) జీ.వో.ఎం.ఎస్.నెం.234, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేదీ: 27.10.98,
3) మెమో. నెం. 49578/905/ఎఫ్.ఆర్.ఐ, - ఎ2/98, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తేదీ: 23.02.99. ఇవి హాఫ్-పే-లీవు అమ్మకానికి వచ్చిన జీ.వో.లు

ప్రశ్న:

లెప్రసీ, క్యాన్సర్, క్షయ మొదలగు వ్యాధులకు జీతంపై సెలవులు ఇస్తారని విన్నాను. వివరించండి?

సమాధానం:

ఔను. జీ.వో.ఎం.ఎస్.నెం.349, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేదీ: 16.12.1980 మేరకు పై వ్యాధులతో బాధపడేవారికి 6 మాసాలు జీతంతో కూడిన సెలవుకు అర్హత ఉంది.