LATEST UPDATES

2, జూన్ 2021, బుధవారం

** ఏం మిగిలింది ? - శ్రీ గంజి దుర్గాప్రసాద్ **

This is a simple translate button.

** ఏం మిగిలింది ?**

ఏం మిగిలింది?
అత్మగౌరవ పోరులో 
గానుగెద్దు బానిసత్వం తప్ప!
బలిదానాల పునాదులపై
తిష్టవేసిన చుట్టంలా
అధికార భూతం

నినాదాలతో మారుమోగిన
మనోభావాల గొంతుకలు
పచ్చినిజాల పల్లెరుకాయలను
కక్కలేక మింగలేక...

అబద్ధాల భూతద్దంలో
వాపును బలుపుగా భ్రమింపజేస్తూ
అప్పుల సత్తుచిప్పకు
బంగారం కోటింగ్.

గళమెత్తిన కలం కుత్తుకలు
అంక్షల అడకత్తెరల్లో నలుగుతు...
వెలకట్టి కళ ను అమ్ముకుంటూ కొందరు
కళ ను నమ్ముకొని కలలు కల్లలై ఎందరో 

పట్టాలపై నిలిచిపోయిన పొగబండ్లలా
గమ్యం తెలియని
డిగ్రీ,పిజి,PHD పట్టాలు 
ఆవేదన అక్రోషాల సెగలతో రగిలిపోతు...

కడుపునింపని
బెల్లం మాటలు
భరోసాల బూరెలు 
ఇకచాలు.
మరొక్కసారి..,
ముప్పిరిగొన్న ఉప్పెనలు ముంచెత్తాలి
తిరుగుబాటు భూకంపాలు కదం తొక్కాలి
అసంతృప్త అగ్నిపర్వతాలుబ్రద్ధలు కావాలి.


                                           గంజి.దుర్గాప్రసాద్
                                             9885068731

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి