LATEST UPDATES

26, సెప్టెంబర్ 2015, శనివారం

Important Formulae in Mathematics

Message from whatsapp
" It is for d first time,   one of best uses,  of 'WhatsApp' in  its history, to circulate  some important formulae in Mathematics"..!!    
(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα
1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α

» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ
Important

These r  all  d formulae of Maths for classes
9th,10th,11th,12th
Kindly share d same with all parents n students, teachers as much as u can do...

4, ఏప్రిల్ 2015, శనివారం

How to Create a New Blog @ Blogger.com

How to Create a New Blog like www.naabadi.org, www.teachersbadi.in, www.apteachers.in

మొదట మనం http://blogger.com ని open చేయాలి. చిత్రం-1 లో చూపిన విధంగా Sign In window వస్తుంది. అందులో మీకు ఇదివరకు ఉన్న జీమెయిల్ ఐడి, పాస్ వర్డ్ ఇచ్చి Sign In పై క్లక్ చేయాలి.

చిత్రం-2 లో చూపిన విధంగా పేజీ వస్తుంది. అందులో New Blog బటన్ పై క్లిక్ చేయాలి. అపుడు మరియొక పేజీ వస్తుంది.


చిత్రం-3 లో చూపిన విధంగా పేజీ వస్తుంది. అందులో title ఇవ్వాలి.
తరువాత వెబ్ address ముఖ్యమైనది. మనం ఇచ్చే address ని వెంటనే check చేస్తుంది. ఇదివరకే వాడుకున్నారా లేదా చెబుతుంది. available ఉన్నట్లైతే blog address చూపుతుంది.
ఉదాహరణకు naabadipcnu అని ఇచ్చాననుకోండి. అపుడు blog address http://naabadipcnu.blogspot.com అవుతుంది.

తరువాత template ని select చేయాలి. template ని తరువాత కూడా మార్చకొనే అవకాశం ఉంది.
Create Blogపై క్లిక్ చేయాలి.
కొంత సమయం తరువాత బ్లాగ్ Create అయినట్లు conformation Message వస్తుంది.

How to Create Google site with Gmail ID in simple steps

How to create Google site - step by step description

మనం ఇదివరకు బ్లాగర్ బ్లాగ్ ఎలా create చేయాలో నేర్చుకున్నాము. కాని బ్లాగర్ లో PDF, excel, docs లాంటి files upload చేయడం కుదరదు. కావున మనకు ఈ Googles site , files upload చేయడానికి ఉపయోగపడుతుంది.

నేను mobile నుండి Googlesite https://sites.google.com/site/pogusnuthika/ or www.snuthika.tk లోకి upload చేసాను చూడండి. దీని సైజ్ 100MB ఉంటుంది. మరికొన్ని కూడా అదే అకౌంట్లో Google sites అవసరాన్ని బట్టి create చేసుకొనవచ్చును.

అసలు విషయానికి వస్తే మొదట https://sites.google.com పేజీ open చేయాలి. చిత్తం-1 లో మాదిరి sign in screen వస్తుంది. అందులో Gmail Id , password ఇచ్చి Sign In పై Click చేయాలి.

తరువాత చిత్రం-2 లో మాదిరి పేజీ వస్తుంది. అందులో CREATE బటన్ పై click చేయాలి.
తరువాత మరియొక పేజీ వస్తుంది. అందులో చిత్తం-3.1 చూపినట్లు మనకు కావలసిన templete ను ఎన్నుకోవాలి. Preview కూడా చూడవచ్చు.

తరువాత ముఖ్యమైనది వెబ్ నేమ్ ఇవ్వాలి ఉదాహరణకు naabadipcnu అని ఇచ్చాననుకోండి అపుడు వెబ్ అడ్రస్ https://sites.google.com/site/naabadicnu/ అవుతుంది. కింది బాక్స్ లో కనిపిస్తుంది.

చిత్రం-3.2 లో మాదిరి theme select చేసుకోవాలి. ఆ తరువాత site description ఇవ్వాలి. ఆ తరువాత అక్కడ కనిపించే కోడ్ ను బాక్స్ లో ఎంటర్ చేయాలి.

చివరగా top పైన CREATE బటన్ click చేయాలి. Google site create అవుతుంది.


ధన్యవాదములు.........

How to Unprotect MS-Excel workbook/sheets with OpenOffice 3.4.1 Software

 
ముందుగా http://www.openoffice.org/download/index.html పేజీ నుండి Apache Openoffice 3.4.1 software download చేసి install చేసుకోవాలి.
కావలసిన EXCEL ఫైల్ మీద Right Click చేసి Open with option ద్వారా OpenOffice.Calcలో ప్రోగ్రామ్ ను Open చేయాలి. దానికి సంబంధించిన చిత్రం కిందినివ్వబడినది.

ప్రతి Sheet open చేసి Menu లో Tools select చేసి, Protect Document click చేస్తే, Sheet , Document options ని uncheck చేయాలి. (టిక్ తీసివేయాలి). ప్రతి Sheet ని open చేసి uncheck చేయాలి. దానికి సంబంధించిన చిత్రం..

తరువాత file ను save చేయడానికి ట్రైస్తే, పటంలో చూపిన విధంగా window వస్తుంది. అందులో keep current format పై click చేసి save చేయాలి. ఇపుడ MS-EXCEL లో open చేయాలి. ఇపుడు Edit చేయవచ్చు. కానిచో excel, close చేసి Openoffice calc లో open చేసి edit చేయవచ్చు. చిత్రం - 3

How to download Youtube videos without any software in PC

Youtube dowonloader || Free downloader for Youtube videos || Extension in Firefox browser for dowload Youtube download || Youtube download without any software

only for Firefox Browser (తెలుగులో)


మొదట Firfox browser ని open చేయాలి.
STEP 1 : Top left లో orange colour లో Firfox అనే button ని click చేయాలి. ఒక menu open అవుతుంది.
STEP 2 : ఆ menu లో Add-ons పై click చేయాలి.

New DA Calculation for CPS Employees

Method
  1. First, We enter New DA 
  2. Second, We enter Old DA
  3. Next, We enter No of months
  4. Then, Click on Calculation Button
  5. If we wish to Print, Click on Print Button

DA DIFFERENCE CALCULATOR FOR ALL BASICS for GPF Employees

It's for only GPF Employees. How to calculate new DA from this table ? Process
  1. First enter New DA in New DA % column.
  2. After that enter Old DA in Old DA % column.
  3. Next row, Enter No of months credited into GPF, Enter the Number of months.
  4. Enter No of months credited Net Amount into our Bank A/c
  5. Finanlly click on Calculation button.
  6. If you want print out the result, click on print button.

Ham Honge Kamyaab (हम होंगे कामयाब) 8th Class Hindi

होंगे कामयाब, होंगे कामयाब
हम होंगे कामयाब, एक दिन
हो, हो! मन में है विश्वास,
पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन ||

होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, 
होगी शांति चारों ओर एक दिन||
हो! हो! मन में है विश्वास, पूरा है विश्वास,
होगी शांति चारों ओर एक दिन||

हम चलेंगे साथ-साथ, डाल हाथों में हाथ,
हम चलेंगे साथ-साथ एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
हम चलेंगे साथ-साथ एक दिन||

नहीं डर किसी का आज, नहीं डर किसी का आज,
नहीं डर किसी का आज, एक दिन
हो, हो! मन में है विश्वास, पूरा है विश्वास,
नहीं डर किसी का आज, एक दिन||

10th Class TELUGU Paper-II - March 2015 - Telangana

www.naabadi.org

New Syllabus(2014-15)
02T
TELUGU, Paper - II
(First Language)

Time: 2.45 hours]                                                        [Maximum Marks : 40
-----------------------------------------------------------------------------------

సూచనలు:
  1. మొదటి 15ని.లు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2 గం. 30 ని.ల సమయంలో జవాబులు రాయండి.
  2.  అన్ని ప్రశ్నలకు జవాబులు  సమాధాన పత్రంలోనే రాయండి.
I.  అవగాహన ప్రతిస్పందన : చదవడం - అవగాహన చేసుకోవడం  (20 మార్కులు)

(అ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.   5x1=5 

జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేయుంది? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో ‘‘నేను మహాసముద్రాలను అవలీలగా దాటగనని’’ ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

1. జాంబవంతుడు హనుమంతుణ్ణి ఎలా ప్రేరేపించాడు?
2. ప్రేరణ వలన ఏమి బయట పడుతుంది?
3. హనుమంతుడు వానరులతో ఏమన్నాడు?
4. హనుమంతుడి మాటలు ఏమి తెలియజేస్తున్నాయి?
5. పై పేరాకు తగిన శీర్షక సూచించండి.
(ఆ) కింది పేరా చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి. 5x1=5
గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీనంగర్ జిల్లాల్లోని గిరిజనులు వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. ‘‘చిన్నయ్య పెద్దయ్య చిలుకల భీమయ్య’’ అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు. పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు, అని స్పష్టమవుతుంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలువడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు.
 ప్రశ్నలు:
6.
7.
8.
9.
10

(ఇ) కింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావం సొంత మాటల్లో రాయండి.            1x5=5

11. బీదల కన్నవస్త్రములు ..........................
......................వివేక ధనంబిది నమ్ము చిత్తమా!

(ఈ) కింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.   5x1=5

తల నుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ !
12. పాముకు విషం ........................ లో ఉంటుంది.
13. వృశ్చికమనగా ..........................
14. శరీరమంత విషం ......................... కి ఉంటుంది.
15. పై పద్య మకుటం .......................
16. పై పద్యాన్ని రచించిన కవి ...................
II. సృజనాత్మకత - వ్యక్తీకరణ: సృజనాత్మకత       (10 మార్కులు)
(అ) కింది వానిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి.   2x5=10
17. ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పతనాన్ని గూర్చి వ్యాసం రాయండి.
18. ‘‘మాణిక్య వీణ’’ వచన కవితలో మీకు నచ్చిన అంశాలను వివరిస్తూ మిత్రునికి/మిత్రురాలికి లేఖ రాయండి.
19. చరిత్ర నిర్మాణంలో స్త్రీల పాత్రను వివిరిస్తూ కరపత్రం తయారు చేయండి.
III. భాషాంశాలు (వ్యాకరణం)      (10 మార్కులు)
20. ‘మృదుమధురం’ పదానికి విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. (1మార్కు)
21. ‘విద్య చేత అధికుడు’ విగ్రహ వాక్యాన్ని సమాస పదంగా మార్చి సమాసం పేరు రాయండి. (1మార్కు)
22. ‘ముత్యపు చిప్ప’ పదాన్ని విడదీసి, సంధిపేరు రాయండి. (1మార్కు)
23. ‘సరభస+ఉత్సాహం’ కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి. (1మార్కు)
  24. ‘యూయూస్సూత్రము తోవ త్రుంచుకొనెదో? యౌద్ధత్య మోర్వన్ జుమీ’
పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.  (2మార్కులు)
25. 
‘‘తల్లి ఒడివంటి 
పల్లెసీమల్నొదిలి
తరలి వచ్చిన పేద రైతులూ
ఇనప్పెట్టెలాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులు’’
పై కవితలోని అర్థాలంకారాన్ని గుర్తించండి. (1మార్కు)
26. అర్థంతరన్యాసాలంకార లక్షణాల్ని తెల్పండి. (1మార్కు)
27. గోపి హైదరాబాద్ వెళ్ళాడు.
సీ హైద్రాబాద్ వెళ్ళింది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చి రాయండి.   (1మార్కు)
28. ‘‘ధన లోభము సర్వాపదలకు మూలము’’ ఈ వాక్యాన్ని ఆధునికి వ్యవహార భాషలోకి మార్చి రాయండి.   (1మార్కు)
----------End--------

10th Class TELUGU Paper-1 - March-2015 - Telangnan

www.naabadi.org

New  syllabus(2014-15)
01T
Telugu, Paper-I
(First Language)

Time : 20:45 hoours]                                               [Maximum Marks: 40
---------------------------------------------------------------------------------
సూచనలు:
  1. మెదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2.30 గం.ల సమయంలో జవాబులు రాయండి.
  2. అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రంలోనే రాయండి.
I.  వ్యక్తీకరణ - సృజనాత్మకత - స్వీయరచన           (30 మార్కులు)

(అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.        4x3=12

1. ప్రకృతి ఒడిని పాఠశాలగా మార్చుకొన్న మీరు మీ కళాభిరుచిని ఎలా పెంపొందించుకుంటారు?
2. ‘‘బాలికల చదువు -  తరతరాలకు వెలుగు’’ అన్న నానుడిపై మీ అభిప్రాయం తెల్పండి.
3. ‘పి.వి. నరసింహారావు గారు - గొప్ప సాహితీవేత్త’ అని ఎట్లా చెప్పగలరు?
4. ‘‘ఆకలి దప్పికలు కోపానికి కారణాలు’’ అని ఎట్లా సమర్థిస్తావు? 

(ఆ) కింది వాటిలో ప్రతి భాగం నుండి తప్పని సరిగా ఒక ప్రశ్నకు 10 వాక్యాలలో జవాబులు రాయండి.                3x6=18

5. ‘‘వీధి బాలలు, అనాథ పిల్లలు’’ - లేకుండా ఉండాలంటే మీరేం చేస్తారు? వివరించండి.
(లేదా)
5. ‘‘మంచి వాళ్ళ స్నేహం కంటే లోకంలో గొప్పది ఏదీ లేదు’’ - దీనిని విశ్లేషిస్తూ అభిప్రాయాలను రాయండి.


6. ‘నగరంలోని మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు ఉంటాయి’ -  అనే కవి మాటల్లోని అంతరార్థాన్ని వివరించండి.
(లేదా)
6. శివాజీ, సోన్ దేవుని మధ్య జరిగిన సంభాషణ ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు’’ సమర్థించండి.


7. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
(లేదా)
7. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధం తెలపండి.

II. భాషాంశాలు (పదజాలం)              (10మార్కులు)

 (అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి.       2x1=2

8. శ్రద్ధాసక్తులు
9. ప్రయాణ సౌకర్యం

(ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.             4x(1/2)=2

10. సీత, గీతలు జాతరలో సూడిగములు కొన్నారు.
(A) బొమ్మలు
(B) గజ్జెలు
(C) బట్టలు
(D) గాజులు

11. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలే ఉద్యమం చేశారు.

(A) పోరాటం
(B) ప్రయత్నం
(C) ఊరేగింపు
(D) దీక్ష

12. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏమరుపాటుగా ఉండరాదు.
(A) సంతృప్తిగా
(B) అసంతృప్తిగా
(C) అజాగ్రత్తగా
(D) అహంకారంగా

13. మబ్బులు ఇనుణ్ణి కప్పేసాయి.
(A) మెరుపులను
(B) చుక్కలను
(C) చంద్రుణ్ణి
(D) సూర్యుణ్ణి

(ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి              4x(1/2)=2

14. గాంధీజీ నూలు వస్త్రం ధరించేవాడు.
 (A) పుట్టము - పులుగు
(B) పుట్టము - పట్టము
(C) పుట్టము - చేలము
(D) పుట్టము - విలువ

15. కప్ప భూమిపైన, నీటిలోన నివాసం ఉంటుంది.

(A) దర్దరం - దుర్దినం
(B) దర్దురం - మండూకం
(C) దర్దురం - మహతి
(D) దర్దురం - దర్భలు

16. అనలం అరణ్యాన్ని దహించి వేసింది.

(A) అగ్ని - వేడి
(B) అగ్ని - అడవి
(C) అగ్ని - కాన
(D) అగ్ని -  మంట

17. మిన్ను విరిగి మీద పడ్డట్లు.

(A) ఆకాశం - చంద్రుడు
(B) ఆకాశం - మబ్బు
(C) ఆకాశం - గగనం
(D) ఆకాశం - సూర్యుడు

(ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు-వికృతులు, వికృతులకు-ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.  
4x(1/2)=2

18. ధర్మం నాలుగు పాదాల నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.

(A) దయ
(B) దమ్మం
(C) దానం
(D) దాక్షిణ్యం

19. అయ్యా ! మాకు సెలవులు ఇప్పించండి.

(A) తండ్రీ
(B) నాన్నా
(C) తాతా
(D) ఆర్యా

20. కుల మతాలకు మనుషుల మధ్య కుడ్యం కాకూడదు.

(A) గోడ
(B) ఇల్లు
(C) భవనం
(D) తలుపు

21.  పులిని చూసే నేను చిత్తరువు వేశాను.

(A) చిత్రం
(B) బొమ్మ
(C) పటం
(D) సినిమా

(ఉ) కింది వాక్యాల్లో గీత గీసి పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.    2x(1/2)=1

22. కాలంతో పాటే మనమూ మారాలి.
(A) సమయం - సందర్భం
(B) సమయం - చావు
(C) సమయం - సహకారం
(D) సమయం - చలనం

23. ఆకాశం ఘోష పెడుతుంది.

(A) ఉరుము - నక్షత్రం
(B) ఉరుము - మెరుపు
(C) ఉరుము - మేఘం
(D) ఉరుము - ఆవుల మంద

(ఊ) కింది వ్యుత్పత్త్యర్థాలకు సరియైన పదాన్ని గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.

24. వనము నందు పుట్టినది.

(A) చేప
(B) కప్ప
(C) వనజం
(D) తాబేలు

25.  స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు.

(A) నారదుడు
(B) బ్రహ్మ
(C) విష్ణు
(D) ఈశ్వరుడు

-----------End-------------

Dharithappina Balu (దారితప్పిన ‘బాలు’) 3rd Class Telugu



      ఒక అడవిలో ‘బాలు’ అనే ఎలుగుబంటి పిల్ల ఉండేది. అది ఒక రోజున దాని స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది. స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడడం మొదలుపెట్టింది. బాలు ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని వాళ్ళ దగ్గరనుంచి చాలా దూరం వచ్చేసింది. తన స్నేహితులు ఎంతసేపటికి రాకపోయేసరికి బండ వెనక దాగిఉన్న బాలు ఇవతలికి వచ్చింది. స్నేహితులను పిలిచింది. ఎవరూ పలకలేదు. అలా స్నేహితులను వెదుక్కుంటూ బాలు అడవి దాటి రోడ్డు మీదకు వచ్చింది. 

      రోడ్డుమీద కార్లు, మోటరు సైకిళ్ళు, బస్సులు రయ్ ....... రయ్ మని పోతున్నాయి. రోడ్డుపైన ఆగి ఉన్న బస్సు ఒకటి బాలుకు కనిపించింది. బాలు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. దానికి ఆశ్చర్యంగా ఉంది. బాలు మెల్లగా బస్సు దగ్గరకు వచ్చింది. బస్సును అంత దగ్గరగా ఎప్పుడూ చూడని బాలుకు అంతా వింతగా అనిపించింది. బస్సులోకి చూద్దామని బస్సు కిటికీ ఊచలు పట్టుకొని లోపలికి తొంగిచూసింది. లోపల చాలా మంది మనుషులు కూర్చుని ఉన్నారు. పిల్లలున్నారు. పెద్దవాళ్ళున్నారు. బస్సుముందరినుంచి డుర్..... డుర్..... అని శబ్దం వస్తోంది. అక్కడ చక్రం ముందు ఒకతను కూర్చొని కనిపించాడు. అతని ముందున్న అద్దంలోనుంచి ముందు రోడ్డంతా పొడవుగా కనిపిస్తోంది. అతను తల తిప్పి బాలును చూశాడు. అంతే -- ఒక్క ఉదుటున బస్సులోనుంచి బయటకు దూకాడు.

      బాలు బస్సులోపలికి వెళ్ళంది. బస్సులోని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ బస్సు వెనక సీట్లలోకి పారిపోయారు. పెద్దవాళ్ళు భయంతో అరవడం మొదలెట్టారు.  చిన్నపిల్లలు ఈ చిన్ని బాలువైపు ఆసక్తిగా వింతగా చూస్తున్నారు. బాలుకు వీళ్ళంతా తనను చూసి అలా ఎందుకు భయపడుతున్నారో అర్థంకాలేదు. వీళ్ళ అరుపులకు బాలుకు కూడా భయంవేసింది. బాలు మెల్లగా బస్సు దిగి దానికింది దాక్కుంది. 

      బస్సుకిందకు చేరిన బాలుకు కింద చాలా వేడిగా అనిపించింది. పొగవాసన వేసింది. బాలు అక్కడ ఉండలేక పోయింది. ఇంతలో బస్సులోవాళ్ళంతా బస్సు దిగి దూరంగా పోయారు. కొందరు దూరంనుంచే బస్సుకిందకు వంగి చూస్తున్నారు. బాలు మళ్ళీ బస్సు ఎక్కింది. బస్సులో చక్రం ఉన్నచోటికి వెళ్ళి కూర్చుంది. అక్కడనుంచి దానికి ముందు రోడ్డు, చెట్లు, కొండలు అన్నీ కనిపించాయి. చక్రంమీద చేతులు వేసి అటూ ఇటూ కదిపింది. అలా చేయడం బాలుకు చాలా సరదగా అనిపించింది. ఇంతలో ఎదురుగా ఒక బస్సు రావడం చూసింది. అందులో కూడా చాలామంది మనుషులు ఉన్నారు. బాలు వెనక్కి తిరిగి చూసింది. తాను కూర్చున్న బస్సులో వెనకంతా ఖాళీగా కనిపించింది. ‘‘అరే! ఆ బస్సులో అంతమంది ఉంటే తన బస్సులో వాళ్ళంతా ఎందుకు కిందికి దిగి వెళ్ళిపోయారబ్బా!’’ అని ఆలోచిస్తూ కూర్చుంది.

      ఈ బస్సు దిగిన వారందరూ సెల్ ఫోన్ లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. అటుగా పోతున్న వాహనాలన్నీ అగిపోయాయి. వాహనాల్లో వాళ్ళంతా ఈ బస్సుకేసి చూస్తున్నారు. బాలు అడవంతా తిరిగి తిరిగి అలిసిపోయిందేమో నిద్ర ముంచుకొచ్చేసింది. నిద్ర ఆపుకోలేక బాలు ఆ చక్రం మీదే అలాగే నిద్రపోయింది.

      తరవాత ఏం జరిగి  ఉంటుందో ఊహించి చెప్పండి.

Baala Bheemudu (బాల భీముడు) 3rd Class Telugu


     ఒకనాడు కుంతీదేవి తన కొడుకును భుజంమీదికి ఎత్తుకొని పూలతోటలోకి వెళ్ళింది. నడుస్తూ ఉంటే కాలి కొక రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతుల పట్టు తప్పింది. పిల్లవాడు కింద పడ్డాడు. ‘‘అయ్యో!’’ అని కుంతీదేవి బిగ్గరగా అరిచింది. రాజమందిరంలోని వాళ్ళందరూ పరుగెత్తుతూ వచ్చారు. ‘‘అయ్యో ... నా చిట్టితండ్రి కేమయిందో!’’ అంటూ కుంతీదేవి కంగారుపడుతూంది. బాలుణ్ణి కుంతీదేవి దుఃఖంతో ఆత్రుతగా ఎత్తుకుంది. కుంతీదేవి చేతుల్లోనుంచి మరోసారి జారి  ఆ బాలుడు అక్కడే ఉన్న పెద్ద బండపైన పడ్డాడు. ఆశ్చర్యం! ఆ బాలుడికి ఏమి కాలేదు. బాలుడు పడ్డ బండ మాత్రం పగిలి ముక్కలైంది. బాలుడు మాత్రం హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి కుంతీదేవి ఆ బాలుణ్ణి ఎంతో మురిపెంతో ముద్ధాడింది. ఆబాలుడే మన బాలభీముడు.

     ‘‘బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా!’’ అంటూ చుట్టుపక్కలవాళ్ళు ముక్కున వేలు వేసుకున్నారు. పెద్దవాడైతే కొండల్నే పిండిచేసే ఘనుడౌతాడని పొగిడారు. తండ్రి పాండారాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని  చూసి మురిసిపోయాడు.

    పాండురాజుకు గల ఐదుగురు కుమారులలో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు భీముని తమ్ముళ్ళు. ఈ ఐదుగురినీ పంచపాండవులంటారు. పాండురాజు అన్నయ్య ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు. వీరినే కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు.

   బాల్యంలో కౌరవులు, పాండవులు కలిసి చదువుకునేవారు. ఆడుకునేవారు. భీముడు ఆటల్లో కౌరవులందరినీ ఓడించేవాడు. ఆటల్లో బాగా అలిసిపోయి ఆకలి ఆకలి అంటూ మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. ఇంట్లో ఉన్న పదార్థాలను భీముడు కడుపునిండా తినేవాడు. మళ్ళీ చదువుకు, ఆటలకు పోయేవాడు.

      ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు కోసుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కుతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీముడికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టుమీద ఉన్న కౌరవబాలలు పండ్లలాగా కిందరాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. భీముడు వారందరినీ చితకబాదాడు. రోషంతో కౌరవులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భీముడిపైన ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు.  కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిమీద చాలా కోపం పెంచుకున్నాడు.

      ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడం దుర్యోధనుడు చూశాడు. దురాలోచనతో అతనికి విషాహారం తినిపించాడు. భీముడు స్పృహ కోల్పోయాడు. కౌరవులు అందరూ తాళ్ళతో భీముణ్ణి బంధించారు. ఎత్తుకెళ్ళి నదిలో పడవేయాలనుకున్నారు.  కానీ అందరూ కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ వెళ్ళారు. నదిలోకి తోశారు. నదిలోని విషసర్పాలు భీముణ్ణి కాటు వేశాయి. ఆ విషంవల్లకూడా అతనికెటువంటి అపాయం కలగలేదు. కొంతసేపటికి భీముడికి తెలివి వచ్చింది. కట్లు తెంపుకొని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళాడు. 

      ఒకరోజు గురువు ద్రోణాచార్యులవారు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టారు. అందులో దుర్యోధనుడికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లోకూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. తల్లి, ‘‘నాయనా! నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు,’’ అని హితవు చెప్పింది. ‘‘అలాగేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్ళను శిక్షిస్తాను, మంచి వాళ్ళను రక్షిస్తాను’’ అన్నాడు భీముడు. 

Maa Aatalu (మా ఆటలు) 3rd Class Telugu



భలె భలె భలె భలె బాలలమండి
భలేగ ఆటలు ఆడెదమండి

చెట్లు చేమలు ఎక్కేస్తాం
కోతికొమ్మచ్చులు ఆడేస్తాం
చెమ్మా చెక్కా, చిర్రాగోనె
చెడుగుడు ఆటలు ఆడేస్తాం!

బొంగరాలు భలే తిప్పేస్తాం
బొమ్మరిళ్ళనే కట్టేస్తాం
పరుగుపందెం, పచ్చీసాట
పతంగులను మేం ఎగరేస్తాం!

బంతీ బ్యాటూ పట్టేస్తాం
సిక్సర్లు, ఫోర్లు కొట్టేస్తాం
రాజు - రాణి, దొంగ - పోలీస్, 
దాగుడుమూతలు ఆడేస్తాం!

అష్టాచెమ్మా ఆడేస్తాం
బస్సు, రైలు నడిపేస్తాం
కళ్ళగంతలు, కప్పగంతులు
ఒప్పులకుప్ప ఆడేస్తాం!

దూకుళ్లాటలో దూకేస్తాం
కుంటుళ్ళాటలో ముందొస్తాం
దస్తీలాట, కస్తీలాట
దిగుడుపుల్ల ఆడేస్తాం!

గోళీలతో గురిపెట్టేస్తాం
బొమ్మబొరుసు వేసేస్తాం
తాకుళ్ళాట, తొక్కుడబిళ్ళ
ముక్కుగిల్లుడు ఆడేస్తాం!

ఊడల ఊయల లూగేస్తాం
ఊహల్లో మేం విహరిస్తాం
గవ్వలాటలు, గుజ్జనగూళ్ళు
వామనగుంటలు ఆడేస్తాం!

కత్తిపడవలు చేసేస్తాం
వాగులు వంకలు విహరిస్తాం
వేలిముద్రలతో చిత్రాలూ
మట్టితో బొమ్మలు చేసేస్తాం!

సమతా మమతలు పంచేస్తాం
సమభావంతో మెలిగేస్తాం
నేస్తాలతో మేం సర్దుకుపోతూ
చెలిమిని చక్కగ చేసేస్తాం!

అభినందిస్తే ఆనందిస్తాం
ప్రేమను పంచితే స్వాగతిస్తాం
స్వేచ్ఛను మాకు మీరిస్తే
చంద్రమండలమే చుట్టొస్తాం!

Emavuthundo... (ఏమవుతుందో...) 3rd Class Telugu



బాలల్లారా వినరండి.
ఏమవుతుందో చెప్పండి.

సూర్యుడు ఉదయించకుండా
వెలుగు, వేడి ఇవ్వకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగి ఉంటే 
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

విత్తులు మొలకెత్తకుండా
భూమిలోనే దాగిఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

పంటలేవి పండకుండా
పుడమితల్లి అడ్డుకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

నీరు మనకు అందకుండా
నదులే ప్రవహించకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

ఇరుగుపొరుగు లేకుండా
తోడు ఎవరు లేకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
ఏమవుతుందో చెప్పండి.

రచన: నాళం కృష్ణారావు
మూలం: గోరుముద్దలు 

Tholakari Chirujallulu (తొలకరి చిరుజల్లులు) 3rd Class Telugu



కిలకిలమను పిల్లలం
తొలకరి చిరుజల్లులం
అల్లరితో ఎల్లరినీ
అలరించే పిల్లలం...

తెలుగుతల్లి తోటలోని
వెలుగులీను పువ్వులం
జగమంతా పరిమళాలు
ఎగజిమ్మే పువ్వులం...

భారతి చిరుపెదవులపై
పరవశించు నవ్వులం
విశ్వమెల్ల వెన్నెలను
వెదజల్లే నవ్వులం..

భరతమాత హారంలో
మెరియుచున్న రవ్వలం
ధగద్ధగలు నలుదిశలా
ఎగజిమ్మే రవ్వలం..

రత్నగర్భ పదములపై
రవళించే మువ్వలం
విశ్వానికి నర్తనగతిని
వివరించే మువ్వలం

పాలపుంతలందు వేగ
పరుగులెత్తు గువ్వలం
మంచితనం మనసులలో 
పంచిపెట్టు గువ్వలం

భారతమ్మ బొమ్మరిండ్ల
పాలుపెరుగు బువ్వలం
ఆనందము చేకూర్చే
అమృతంపు బువ్వలం...

రచన : జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి
మూలం : మల్లెల మందారాలు, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ

Sahakaram (సహకారం) - 3rd Class Telugu


అందమైన కుందేలు
ఆటలాడుకుందామని
ఒంటరిగా రాతినెక్కి
గంతులేయబోయింది

ఎగిరి జారి పడిపోయే
కాలేమో విరిగిపోయే
లబలబమని మొత్తుకుంది
కదలలేక ఏడ్చింది

పిచ్చుకమ్మ చూసింది
పిల్లికెళ్లి చెప్పింది
పిల్లిమామ పరిగెత్తి
కొంగమ్మకు చెప్పింది

అందరు పరుగెత్తుకొచ్చి
కుందేలును లేవదీసి
తన ఇంటికి చేర్చిరి
వైద్యుని పిలిపించిరి

డాక్టరు ఎద్దన్న వచ్చి
సిస్టరు చిలుకమ్మ వచ్చి
గాయాలను కడిగేసి
పసరు మందు వేసిరి

కర్రముక్క కట్లు కట్టి
కాలిచుట్టు బట్ట చుట్టి
కంగారుపడకనిరి
కదలకుండ ఉండమనిరి

కోడిపిల్ల, కొంగపిల్ల
కాకిపిల్ల, కొంటెకోతి
పలకరించ వచ్చాయి
పండ్లు తెచ్చి ఇచ్చాయి

కొంటెకోతి ముందుకొచ్చి
కాలు పట్టి లాగిచూసి
కలవరమే వద్దంటూ
కబుర్లన్నో చెప్పబోయె

పరామర్శ ఏమోగాని
ప్రాణాలే పోయాయని
గిలగిలమని కొట్టుకొని
వలవల కుందేలు ఏడ్చె

ఇరుగు పొరుగు, నేస్తాలను
బంధువులను చూసి చెప్పె
మీరందరు లేకపోతె
నా గతి ఏమగునో కదా !

పులిరాజో, వనరాజో
నన్ను చేయు ఫలహారం
మీ సాయంవల్ల నేను
బతికి బట్ట కట్టాను

ఎప్పటికీ మరువనమ్మ
మీ అందరి మమకారం
కష్టసుఖములయందు
కావాలి సహకారం

Laddu Badha (లడ్డూ బాధ) 3rd class Telugu

ఉన్నట్లుండి బెల్లంలడ్డుకు
ఉడుకుబోత్తనం వచ్చేసింది.
రెక్కలు కట్టుక విధాత దగ్గర
కొక్క పరుగులో వచ్చిపడింది.

ఎగా దిగా ఆశ్చర్యంతో
చూచెను దేవుడు బెల్లంలడ్డును
విశేషమేమని అడిగేలోగా
విసురుగా ఏకరుపెట్టెను లడ్డు

బెల్లం లడ్డు:
మూలన జేరిన ముసలమ్మలకీ
దంతాలూడిన తాతయ్యలకీ
ముసిముసి నవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ

ఇతరుల జోలీ శౌంఠీ ఎరుగక
కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే
వచ్చే పోయే ప్రతివాళ్ళూ నను
నోట్లో వేసుక పోవడమేనా?

మానవులెవ్వరు మర్యాదెరుగరు
మునుముందుగ నా అనుమతి కోరరు
గోళ్లని గిల్లీ పళ్లను కొరికీ
నే నగుపిస్తే నిలువు దొపిడీ!

ఈగలు, చీమలు, దోమలు, నుసమలు
యాక్కురారీ పెను బొద్దెంకలు
సకల కీటకములు యథాశక్తి నను
సతాయించుకొని తింటూ ఉంటవి.

బుద్ధీ, జ్ఞానం లేని కీటముల
పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం
జ్ఞానం కలిగిన మానవజాతికి
సైత మిదెక్కడి పొయ్యేకాలం?

బుగ్గలలోపల మగ్గుచునుందును
నోటిరోటిలో నుగ్గగుచునుందును
ఎవ్వరికెన్నడు నెగ్గదలంపని
నను వేధించుట సబబంటావా?

సమస్త వస్తు ప్రపంచకంబును
పరికల్పించిన బ్రహ్మదేవుడా!
నా ఆక్రోశము నాలకింపవా?
ఈ అన్యాయము నాపజాలవా?

బ్రహ్మదేవుడు:
‘‘పసిడి ఛాయలో మిసమిసలాడే
పేరు వినగనే నోరూరించే
ఏడుపు నవ్వుతా ఇట్టే మార్చే 
పిల్లలు మెచ్చే బెల్లంలడ్డూ!

ఎల్లరు మెచ్చే బెల్లంలడ్డూ
వెళ్ళవె త్వరగా ఇక్కడినుంచి
వెళ్ళకపోతే నిన్ను నోటిలో
వేసుకొనాలనిపించును, నాకే.’’

Jenda Panduga (జెండా పండుగ) - 2nd Class Telugu

      ఆ రోజు ఆగష్టు 15. జెండా పండుగ రోజు. పిల్లలు, టీచర్లు పొద్దున్నే బడికి వచ్చారు. అందరూ కలిసి ఊరిలోకి ఊరేగింపుగా వెళ్ళారు. నినాదాలు చేస్తూ వాడవాడలు తిరిగారు. గ్రామపంచాయితీ ఆఫీసు దగ్గర ఆగారు. అక్కడ గ్రామ సర్పంచి గంగారాం జాతీయ జెండాను ఎగరవేశారు. అక్బరు, రాబర్టు, సుల్తానా, రమ్య, శ్రీరాం జాతీయగీతం పాడారు. ఆ తర్వాత అంతా కలిసి మళ్ళీ బడికి వచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు, పంచాయితీ సభ్యులు, సర్పంచి కూడా వచ్చారు.       సంయుక్త టీచరు జెండా ఎగరవేశారు. జాతీయగీతం పాడుతూ అందరూ జెండాకు వందనం చేశారు. దేశభక్తి గేయాలు పాడారు. పోటీలలో గెలిచినవారికి బహుమతులు ఇచ్చారు. పిల్లలకు, పెద్దలకు మిఠాయిలు పంచారు. ఆనందంగా గంతులు వేస్తూ పిల్లలు ఇళ్లకు వెళ్లారు.

Rathaiah - Jaggaiah (రత్తయ్య - జగ్గయ్య ) - 2nd Class Telugu

అనగనగా ఒక ఊరు.       ఆ ఊరిలో రత్తయ్య అనే రైతు ఉండేవాడు.       ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు.       వాడి పేరు జగ్గయ్య. ఒట్టి అమాయకుడు. రత్తయ్య ముసలివాయినాడు. జబ్బుచేసింది. దగ్గి దగ్గి అలసిపోయేవాడు. డాక్టరు వచ్చాడు. మందులు ఇచ్చాడు. మందుసీసా మీద ‘‘బాగా ఊపి తాగండి’’ అని ఉంది.       జగ్గయ్య దానిని చదివాడు. మందు తాగించాడు. కానీ రత్తయ్యకు దగ్గు తగ్గలేదు. మళ్ళీ డాక్టరు వచ్చాడు. మందు తాగించావా అని అడిగాడు. ‘‘ఓ... నాన్నను బాగా ఊపి మందు తాగించాను’’ అన్నాడు జగ్గయ్య. జగ్గయ్య తెలివి తక్కువతనానికి డాక్టరు నవ్వుకున్నాడు. నాన్నను కాదు, సీసాను బాగా ఊపి మందు తాగించాలని చెప్పాడు. జగ్గయ్య తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు.

Bhairavudu (భైరవుడు) - 2nd Class Telugu

      అనగనగా ఒక రాజు. ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. తనను ఢీకొనేవాడెవడూ లేడనుకునేవాడు. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఎలుగుబంటితో భీకరంగా పోరాడాడు. పోరులో అతని కంఠానికి బలమైన గాయమయింది.       తన గాయం నయంచేసిన వారికి బహుమతి ఇస్తానని రాజు దండోరా వేయించాడు.       ఆ దండోరాను భైరవుడు అనే యువకుడు విన్నాడు. రాజును కాపాడాలనుకొని బయలుదేరాడు. కొండకోనలు తిరిగాడు. శిఖామణి అనే మునిని కలిశాడు. ఆయన ‘సుగంధ మూలిక’ ఒకటి ఇచ్చాడు. దానిని తీసుకొని రాజును చేరాడు. గాయం నయంచేశాడు.       సుధాముడు సంతోషించాడు. భైరవుడికి బహుమతిని ఇచ్చాడు.

Ruthuvulu (ఋతువులు) 3rd Class Telugu

    వసంత ఋతువు వచ్చింది     వసుధకు అందం తెచ్చింది     పచ్చపచ్చని చిగుళ్ళతో     పరవశాన్ని కలిగించింది. గ్రీష్మఋతువు వచ్చింది ఎండలు మెండుగ తెచ్చింది మండే సూర్యుని జ్వాలలతో మలమల జగతిని మాడ్చింది.     వర్ష ఋతువు వచ్చింది     వానలు వరదలు తెచ్చింది     ఊటల నీటిని నింపింది     ఉర్వికి ఊరటనిచ్చింది. శరదృతువు వచ్చింది చల్లని వెన్నెల నిచ్చింది కార్తికదీపం వెలిగింది పుడమిన కాంతులు నింపింది.     హేమంత ఋతువు వచ్చింది     హిమబిందువులను తెచ్చింది     ముత్యపు ముగ్గులు పరిచింది     ముద్దూ మురిపెము పంచింది. శిశిరఋతువు వచ్చింది చెట్ల ఆకులను రాల్చింది వనమున మోడుల నింపింది వసంతలక్ష్మిని పిలిచింది

Kothi Gounu (కోతి గౌను) 2nd Class Telugu

కోతి పుట్టిన రోజంట ఢాం ఢాం ఢాం కొత్త గౌను వేసెనంట ఢాం ఢాం ఢాం తలను చక్కగ దువ్వెనంట ఢాం ఢాం ఢాం పౌడరు తెల్లగ పూసెనంట ఢాం ఢాం ఢాం సైకిలెక్కి టౌనుకు వెళ్ళె ఢాం ఢాం ఢాం దారిలోన పైసలు దొరికె ఢాం ఢాం ఢాం పైసలు తెచ్చి సైదులుకిచ్చె ఢాం ఢాం ఢాం సైదులు ఇచ్చె రైలుబొమ్మ ఢాం ఢాం ఢాం సైకిలు పైన రయ్యిన వచ్చె ఢాం ఢాం ఢాం రైలుబొమ్మతో ఆడెనంట ఢాం ఢాం ఢాం          

Deepavali (దీపావళి) 2nd class Telugu

దీపావళి వచ్చెరా సందడినే తెచ్చెరా పిల్లలు భలే మెచ్చెరా పెద్దలకిది నచ్చెరా సీత ప్రమిద తెచ్చెరా దీపం వెలిగించెరా దీపాలను చూడరా వెలుగులనే నింపెరా చిలిపి శీను వచ్చెరా చిచ్చుబుడ్డి కాల్చెరా టపాకాయ చూడరా ఢాం ఢాం అని పేలెరా చంటిపాప చేతితో కాకరొత్తి పట్టెరా చురచుమని వెలిగెరా అమ్మ వచ్చి అందరికీ అడ్డూ మిఠాయి పంచెరా

Sandhade Sandhadi (సందడే సందడి ) 2n class Telugu

వంకాయ పెండ్లి కుదిరింది
  కూరగాయల సందడి చూడండి
ఆనపకాయ రంగులు వేసింది
మునగకాయ ముగ్గులు పెట్టింది
     పాలకూర పందిరి వేసింది
      అరటికాయ అన్నం పెట్టింది
       బంగాళదుంప బజ్జీలు చేసింది
      తమలపాకు తాంబూలమిచ్చింది
జామకాయ జడలు వేసింది
పనసపండు పూలు పెట్టింది  
బత్తాయి బట్టలు తెచ్చింది  
బెండకాయ బ్యాండు కొట్టింది
       టమాటా తాళి కట్టింది
       ఉల్లిపాయ ఊరేగించింది
      నన్నూ పిలిచారని
       గుమ్మడికాయ గంతులు వేసింది