01T
Telugu, Paper-I
(First Language)
Time : 20:45 hoours] [Maximum Marks: 40
---------------------------------------------------------------------------------
సూచనలు:- మెదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవండి. అర్థం చేసుకోండి. మిగితా 2.30 గం.ల సమయంలో జవాబులు రాయండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రంలోనే రాయండి.
(అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. 4x3=12
1. ప్రకృతి ఒడిని పాఠశాలగా మార్చుకొన్న మీరు మీ కళాభిరుచిని ఎలా పెంపొందించుకుంటారు?
2. ‘‘బాలికల చదువు - తరతరాలకు వెలుగు’’ అన్న నానుడిపై మీ అభిప్రాయం తెల్పండి.
3. ‘పి.వి. నరసింహారావు గారు - గొప్ప సాహితీవేత్త’ అని ఎట్లా చెప్పగలరు?
4. ‘‘ఆకలి దప్పికలు కోపానికి కారణాలు’’ అని ఎట్లా సమర్థిస్తావు?
(ఆ) కింది వాటిలో ప్రతి భాగం నుండి తప్పని సరిగా ఒక ప్రశ్నకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. 3x6=18
5. ‘‘వీధి బాలలు, అనాథ పిల్లలు’’ - లేకుండా ఉండాలంటే మీరేం చేస్తారు? వివరించండి.
(లేదా)
5. ‘‘మంచి వాళ్ళ స్నేహం కంటే లోకంలో గొప్పది ఏదీ లేదు’’ - దీనిని విశ్లేషిస్తూ అభిప్రాయాలను రాయండి.
6. ‘నగరంలోని మనుషుల వెనుక ఆనందాలు, విషాదాలు ఉంటాయి’ - అనే కవి మాటల్లోని అంతరార్థాన్ని వివరించండి.
(లేదా)
6. శివాజీ, సోన్ దేవుని మధ్య జరిగిన సంభాషణ ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు’’ సమర్థించండి.
7. హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతాదేవికి నివేదించిన విధం చెప్పండి.
(లేదా)
7. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధం తెలపండి.
II. భాషాంశాలు (పదజాలం) (10మార్కులు)
(అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి. 2x1=2
8. శ్రద్ధాసక్తులు
9. ప్రయాణ సౌకర్యం
(ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి. 4x(1/2)=2
10. సీత, గీతలు జాతరలో సూడిగములు కొన్నారు.
(A) బొమ్మలు
(B) గజ్జెలు
(C) బట్టలు
(D) గాజులు
11. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలే ఉద్యమం చేశారు.
(A) పోరాటం
(B) ప్రయత్నం
(C) ఊరేగింపు
(D) దీక్ష
12. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏమరుపాటుగా ఉండరాదు.
(A) సంతృప్తిగా
(B) అసంతృప్తిగా
(C) అజాగ్రత్తగా
(D) అహంకారంగా
13. మబ్బులు ఇనుణ్ణి కప్పేసాయి.
(A) మెరుపులను
(B) చుక్కలను
(C) చంద్రుణ్ణి
(D) సూర్యుణ్ణి
(ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి 4x(1/2)=2
14. గాంధీజీ నూలు వస్త్రం ధరించేవాడు.
(A) పుట్టము - పులుగు
(B) పుట్టము - పట్టము
(C) పుట్టము - చేలము
(D) పుట్టము - విలువ
15. కప్ప భూమిపైన, నీటిలోన నివాసం ఉంటుంది.
(A) దర్దరం - దుర్దినం
(B) దర్దురం - మండూకం
(C) దర్దురం - మహతి
(D) దర్దురం - దర్భలు
16. అనలం అరణ్యాన్ని దహించి వేసింది.
(A) అగ్ని - వేడి
(B) అగ్ని - అడవి
(C) అగ్ని - కాన
(D) అగ్ని - మంట
17. మిన్ను విరిగి మీద పడ్డట్లు.
(A) ఆకాశం - చంద్రుడు
(B) ఆకాశం - మబ్బు
(C) ఆకాశం - గగనం
(D) ఆకాశం - సూర్యుడు
(ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు-వికృతులు, వికృతులకు-ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.
4x(1/2)=2
18. ధర్మం నాలుగు పాదాల నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.
(A) దయ
(B) దమ్మం
(C) దానం
(D) దాక్షిణ్యం
19. అయ్యా ! మాకు సెలవులు ఇప్పించండి.
(A) తండ్రీ
(B) నాన్నా
(C) తాతా
(D) ఆర్యా
20. కుల మతాలకు మనుషుల మధ్య కుడ్యం కాకూడదు.
(A) గోడ
(B) ఇల్లు
(C) భవనం
(D) తలుపు
21. పులిని చూసే నేను చిత్తరువు వేశాను.
(A) చిత్రం
(B) బొమ్మ
(C) పటం
(D) సినిమా
(ఉ) కింది వాక్యాల్లో గీత గీసి పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి. 2x(1/2)=1
22. కాలంతో పాటే మనమూ మారాలి.
(A) సమయం - సందర్భం
(B) సమయం - చావు
(C) సమయం - సహకారం
(D) సమయం - చలనం
23. ఆకాశం ఘోష పెడుతుంది.
(A) ఉరుము - నక్షత్రం
(B) ఉరుము - మెరుపు
(C) ఉరుము - మేఘం
(D) ఉరుము - ఆవుల మంద
(ఊ) కింది వ్యుత్పత్త్యర్థాలకు సరియైన పదాన్ని గుర్తించి, వాటి సంకేతాన్ని (A/B/C/D) రాయండి.
24. వనము నందు పుట్టినది.
(A) చేప
(B) కప్ప
(C) వనజం
(D) తాబేలు
25. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు.
(A) నారదుడు
(B) బ్రహ్మ
(C) విష్ణు
(D) ఈశ్వరుడు
-----------End-------------
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి