LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Sandhade Sandhadi (సందడే సందడి ) 2n class Telugu

This is a simple translate button.

వంకాయ పెండ్లి కుదిరింది
  కూరగాయల సందడి చూడండి
ఆనపకాయ రంగులు వేసింది
మునగకాయ ముగ్గులు పెట్టింది
     పాలకూర పందిరి వేసింది
      అరటికాయ అన్నం పెట్టింది
       బంగాళదుంప బజ్జీలు చేసింది
      తమలపాకు తాంబూలమిచ్చింది
జామకాయ జడలు వేసింది
పనసపండు పూలు పెట్టింది  
బత్తాయి బట్టలు తెచ్చింది  
బెండకాయ బ్యాండు కొట్టింది
       టమాటా తాళి కట్టింది
       ఉల్లిపాయ ఊరేగించింది
      నన్నూ పిలిచారని
       గుమ్మడికాయ గంతులు వేసింది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి