LATEST UPDATES

4, ఏప్రిల్ 2015, శనివారం

Laddu Badha (లడ్డూ బాధ) 3rd class Telugu

This is a simple translate button.

ఉన్నట్లుండి బెల్లంలడ్డుకు
ఉడుకుబోత్తనం వచ్చేసింది.
రెక్కలు కట్టుక విధాత దగ్గర
కొక్క పరుగులో వచ్చిపడింది.

ఎగా దిగా ఆశ్చర్యంతో
చూచెను దేవుడు బెల్లంలడ్డును
విశేషమేమని అడిగేలోగా
విసురుగా ఏకరుపెట్టెను లడ్డు

బెల్లం లడ్డు:
మూలన జేరిన ముసలమ్మలకీ
దంతాలూడిన తాతయ్యలకీ
ముసిముసి నవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ

ఇతరుల జోలీ శౌంఠీ ఎరుగక
కుదురుగ గూట్లో కూర్చుని ఉంటే
వచ్చే పోయే ప్రతివాళ్ళూ నను
నోట్లో వేసుక పోవడమేనా?

మానవులెవ్వరు మర్యాదెరుగరు
మునుముందుగ నా అనుమతి కోరరు
గోళ్లని గిల్లీ పళ్లను కొరికీ
నే నగుపిస్తే నిలువు దొపిడీ!

ఈగలు, చీమలు, దోమలు, నుసమలు
యాక్కురారీ పెను బొద్దెంకలు
సకల కీటకములు యథాశక్తి నను
సతాయించుకొని తింటూ ఉంటవి.

బుద్ధీ, జ్ఞానం లేని కీటముల
పద్ధతి ఇంతే లెమ్మనుకుందాం
జ్ఞానం కలిగిన మానవజాతికి
సైత మిదెక్కడి పొయ్యేకాలం?

బుగ్గలలోపల మగ్గుచునుందును
నోటిరోటిలో నుగ్గగుచునుందును
ఎవ్వరికెన్నడు నెగ్గదలంపని
నను వేధించుట సబబంటావా?

సమస్త వస్తు ప్రపంచకంబును
పరికల్పించిన బ్రహ్మదేవుడా!
నా ఆక్రోశము నాలకింపవా?
ఈ అన్యాయము నాపజాలవా?

బ్రహ్మదేవుడు:
‘‘పసిడి ఛాయలో మిసమిసలాడే
పేరు వినగనే నోరూరించే
ఏడుపు నవ్వుతా ఇట్టే మార్చే 
పిల్లలు మెచ్చే బెల్లంలడ్డూ!

ఎల్లరు మెచ్చే బెల్లంలడ్డూ
వెళ్ళవె త్వరగా ఇక్కడినుంచి
వెళ్ళకపోతే నిన్ను నోటిలో
వేసుకొనాలనిపించును, నాకే.’’

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి