అనగనగా ఒక రాజు. ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. తనను ఢీకొనేవాడెవడూ లేడనుకునేవాడు. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఎలుగుబంటితో భీకరంగా పోరాడాడు. పోరులో అతని కంఠానికి బలమైన గాయమయింది.
తన గాయం నయంచేసిన వారికి బహుమతి ఇస్తానని రాజు దండోరా వేయించాడు.
ఆ దండోరాను భైరవుడు అనే యువకుడు విన్నాడు. రాజును కాపాడాలనుకొని బయలుదేరాడు. కొండకోనలు తిరిగాడు. శిఖామణి అనే మునిని కలిశాడు. ఆయన ‘సుగంధ మూలిక’ ఒకటి ఇచ్చాడు. దానిని తీసుకొని రాజును చేరాడు. గాయం నయంచేశాడు.
సుధాముడు సంతోషించాడు. భైరవుడికి బహుమతిని ఇచ్చాడు.
Bhairavudu (భైరవుడు) - 2nd Class Telugu
This is a simple translate button.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి