వసంత ఋతువు వచ్చింది
వసుధకు అందం తెచ్చింది
పచ్చపచ్చని చిగుళ్ళతో
పరవశాన్ని కలిగించింది.
గ్రీష్మఋతువు వచ్చింది
ఎండలు మెండుగ తెచ్చింది
మండే సూర్యుని జ్వాలలతో
మలమల జగతిని మాడ్చింది.
వర్ష ఋతువు వచ్చింది
వానలు వరదలు తెచ్చింది
ఊటల నీటిని నింపింది
ఉర్వికి ఊరటనిచ్చింది.
శరదృతువు వచ్చింది
చల్లని వెన్నెల నిచ్చింది
కార్తికదీపం వెలిగింది
పుడమిన కాంతులు నింపింది.
హేమంత ఋతువు వచ్చింది
హిమబిందువులను తెచ్చింది
ముత్యపు ముగ్గులు పరిచింది
ముద్దూ మురిపెము పంచింది.
శిశిరఋతువు వచ్చింది
చెట్ల ఆకులను రాల్చింది
వనమున మోడుల నింపింది
వసంతలక్ష్మిని పిలిచింది
Ruthuvulu (ఋతువులు) 3rd Class Telugu
This is a simple translate button.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి