సందేహాలు - సమాధానాలు
ప్రశ్న:
3 రోజుల క్రితం నా స్నేహితురాలు ఒకరు ప్రమాద జరిగి మరణించారు. తను అటవీ శాఖలో 4వ తరగతి ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ మరణించారు. తనకి ఇంకా వివాహం కాలేదు. తనకి ఉద్యోగం కూడా బ్యాక్ లాగ్ ద్వారా నియామకం చేయడం జరిగింది. ఇప్పుడు తను మరణించారు కనుక తను కుటుంబ సభ్యులు ఎవరికయినా కారుణ్య నియమకం ఇస్తారా ఇది నా సందేహం. దీని గురించి చెప్పగలరు.
జవాబు:
తప్పకుండా ఇస్తారు. తన కన్నా చిన్న వారు తమ్ముడు చెల్లెలు అర్హత కలిగి ఉంటే కారుణ్యా నియమకం ఇస్తారు. తల్లిదండ్రులకు నియామకానికి అర్హత లేదనుకుంటాను.
ప్రశ్న:
మా ఏరియాలో ప్రభుత్వ టీచర్ ఒకరు ముఖ్యమంత్రి గార్కి వ్యతిరేకం ఉన్న పోస్ట్ తో whatsapo DP పెట్టుకున్నాడు. గ్రామస్తులు తన పై ఉన్నతాధికారులు కు కంప్లెయింట్ ఇచ్చారు. టెన్షన్ పడుతున్నాడు. అలా పెట్టుకోవడం తప్పా?
జవాబు:
కండక్ట్ రూల్ 17 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించకూడదు. దీనికి ఒక మినహాయింపు ఏమిటంటే ఉద్యోగులు వారికి చెందిన సమస్యల పట్ల కేవలం ఉద్యోగులే ఉన్న వేదికలపై తన అభిప్రాయాలు పంచుకొవచ్చు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ ని DP గా పెట్టుకోవడం అంటే ఈ రూల్ క్రింద తప్పుగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే DP అనేది పబ్లిక్ గా అందరికీ display అయ్యేది. అలాగే ఉద్యోగి రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ ప్రచారాలు కానీ పెట్టుకోకూడదు, ప్రచారం చేయకూడదు (అధికారంలో ఉన్న పార్టీ తరపున అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరపున అయినా సరే). దీనిని కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది.
ప్రశ్న:
నేను 2018 డి.యస్.సి. లో ex-serviceman కోటలో రెసిడెన్షియల్ స్కూల్ లో పి.ఈ. టి. గా సెలెక్ట్ అయితిని, నాకు ఆర్మీ లో ఇచ్చిన pay scale ఇక్కడ పొందుటకు ఏమి అయిన జి. ఓ. లు గాని ఎలా పొందాలో తెలుపగలరు.
జవాబు:
మీకు GO MS No. 95 Finance (FR II) Dept DT. 03.04.2012 is applicable for Ex Service men pay fixation
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి