ప్రశ్న:
2008 నవంబర్ లో జాయిన్ అయినప్పుడు PRC 2005 ప్రకారం మా basic pay 9285 scale లో ఉన్నాం కానీ. 2007 బ్యాచ్ వారికి పే 9520 వుంది
2010 లో PRC వచ్చిన తరువాత మా scale తగ్గించారు.
Fitment ప్రకారం 2007 బ్యాచ్ వారికి 18520 basic అయ్యింది మాకు ఒక increment తక్కువగా 18030 వుండాలి కానీ మాకు 17050 ఫిక్స్ చేశారు. అందు వల్ల మేము నష్టపోయామము. దీనికి పరిష్కారం ఏమైనా ఉన్నదా?
సమాధానం:
మీరు ఏ క్యాడర్ ఓ తెలియదు. మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు అర్థం అయిన దానిని బట్టి చూస్తే.
01.07.2018 ముందు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే PRC ఫిట్మెంట్ 39% అనేది వర్తిస్తుంది. ఆ తరువాత జాయిన్ అయిన వాళ్లకి MINIMUM TIME SCALE మాత్రమే 27% fitment వర్తిస్తుంది. అది ప్రతి PRC లో జరుగుతుంది.
2007 లో జాయిన్ అయిన వాళ్ళకి, 2008 లో జాయిన్ అయిన వాళ్ళకి 3 INCREMENTS తేడా రావచ్చు.
A fitment benefit of 39% would be given for fixing the pay in the
Revised Pay Scales, 2010 as against the fitment benefit of 27%
recommended by the Ninth Pay Revision Commission.
అలాగే ఇప్పుడు తెలంగాణ లో ఇచ్చిన PRC తీసుకుంటే ఒక అటెండర్ 01.07.2018 (13000 pay) (01.06.2018 జాయిన్ అయ్యాడు అనుకోండి) కి ముందు జాయిన్ అయ్యి ఉంటే అతనికి 30% ఫిట్మెంట్ తో కొత్త PRC ప్రకారం 20920 పే ఫిక్స్ అవుతుంది.
అలా కాకుండా 01.07.2018 తరువాత అంటే ఉదాహరణకు 02.07.2018 కి జాయిన్ అయ్యి ఉంటే అతని పే 13000 నుండి 19000 కి ఫిక్స్ అవుతుంది.
అంటే 1 నెల తేడా తో జాయిన్ అయిన వాళ్ళకి 3 increments తేడా వస్తుంది.
దానికి ఏమీ పరిష్కారం ఉండదు.
01.07.2018 నాటికి మీరు సర్వీస్ లో లేరు.
కాబట్టి మీకు పే ఫిక్సషన్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇలాంటి తేడాలు రాకూడదు అంటే మన సంఘాలు ఫిట్మెంట్ విషయంలో బేరాలాడి ఎక్కువ ఫిట్మెంట్ పొందకూడదు. ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన ప్రతీసారి ఇలాంటివి తప్పదు.
అలాగే 01.07.2008 న ఇవ్వాల్సింది 2010 లో ఇవ్వడం వల్ల మీకు పాత స్కేల్, కొత్త స్కేల్ తేడా, పాతవారికి, కొత్తవారికి తేడా అనేది తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో 01.07.2018 నే PRC అమలు చేసి ఉంటే 11/2018 లో చేరిన మీకు ఈ తేడా తెలీదు (ఆ ఆలోచనే రాదు)
2010 PRC లో ఇచ్చిన భారీ ఫిట్మెంట్ వల్ల నష్టం కలిగినట్లుగా భావించిన మీరు 2015 లో భారీ ప్రయోజనం పొంది ఉంటారు. అప్పుడు కూడా ఇలాగే 2013-2015 మధ్య చేరిన వారికి ఇదే పరిస్థితి ఉత్పన్నం అయింది. 1999 లో కూడా ఇదే పరిస్థితి.
ఒక్క 2005 లో మాత్రం, తక్కువ ఫిట్మెంట్ కారణంగా కొత్తగా చేరిన వారికి ఎక్కువ లబ్ది, పాత వారికి తక్కువ లబ్ది కలిగింది.
ఇలాంటి తేడాలు రాకూడదు అంటే ఫిట్మెంట్ కి అనుగుణంగా మాస్టర్ స్కేల్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ మాస్టర్ స్కేల్ పెంచితే సాపేక్షంగా మీకు ఇతరులతో పోల్చి లబ్ది కలిగినట్లు కనిపిస్తుంది. కానీ, మాస్టర్ స్కేల్ పెంపు వల్ల కేంద్రం తో పోల్చినపుడు మనకు వచ్చే DA తగ్గిపోతుంది. దాని ప్రభావం తదుపరి PRC లపై కూడా పడుతుంది. అందరితో పాటు ఆ నష్టం మీకు కూడా కలుగుతుంది.
ఉదాహరణకి 2010 లో మాస్టర్ స్కేల్ 39% కి అనుగుణంగా పెంచినట్లయితే 2015 నాటికి DA 63% మీ బదులుగా ఏ 40% ఉండేది.
అలాగే 2015 మాస్టర్ స్కేల్ కనుక 43% ఫిట్మెంట్ కి అనుగుణంగా పెంచినట్లయితే ఇప్పుడు prc లో కలపాల్సిన DA 30% కి బదులు 20% గా ఉండేది. అంటే ఇప్పుడు మన డ్రా చేస్తున్న బేసిక్ పే లకన్నా ఎంతో తక్కువ ఉంటాయి. (మీతో సహా)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి