LATEST UPDATES

8, జులై 2021, గురువారం

సందేహాలు - సమాధానాలు

This is a simple translate button.

సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగంలో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను. మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా?

జవాబు:
ఇద్దరు జీవించి ఉన్న పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది. బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా? వచ్చిన తరువాతా? అనే దానితో నిమిత్తం లేదు. కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవుకి మీకు అవకాశం లేదు.


2. ప్రశ్న:
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి?

జవాబు:
అభ్యర్థి దరఖాస్తు, 250రూ ల చలానా, నోటరీ చే ధృవీకరించిన 50రూ.ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, SSC రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.


3. ప్రశ్న:
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి?

జవాబు:
103-జీడీ ఫారంలో సంబంధిత పత్రాలు జతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన DDO ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.


4. ప్రశ్న:
ఉపాధ్యాయులకు ఒక్క రోజు కూడా మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

జవాబు:
చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు. కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.


5. ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా?

జవాబు:
అలా కుదరదు. ఇద్దరు పెద్ద పిల్లలకి 18 ఇయర్స్ నిండే లోపు 90 రోజులు మాత్రమే వాడుకోవాలి. అనగా టీచర్ కి 90 రోజులు అని అర్థం.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి