మరణించిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుంటే (Legally Married) ఫ్యామిలీ పెన్షన్ ఎలా చెల్లిస్తారు?
జ॥ 1) ఫ్యామిలీ పెన్షన్ సమాన వాటాలుగా ఇద్దరికీ చెల్లించాలి.
2) ఒకవేళ ఒక భార్య చనిపోయినా/ తిరిగి పెళ్ళి చేసుకొన్నా ఆమె వాటా ఆమె ద్వారా జన్మించిన పిల్లలకు చెల్లించాలి.
3) పిల్లలు లేకపోతే ఆమె వాటా రద్దు చేస్తారు.
4) చనిపోయిన ఉద్యోగికి ఇద్దరు భార్యలు వుండి, అందులో ఒకరు ముందుగానే మరణిస్తే, ఆమె ద్వారా కలిగిన పిల్లలకు ఆమె బ్రతికి వుంటే ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ వాటా చెల్లించాలి.
రూలు 50 (6) (2) (i)(ii)(బి)
చనిపోయిన ఉద్యోగి / పెన్ననరుకు కుమారులు, కుమార్తెలు వుంటే ఫ్యామిలీ పెన్షను ఎలా చెల్లిస్తారు?
జ॥ 1) మొట్ట మొదటగా కుమారులకు వరుసగా వారికి 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు చెల్లించాలి.
2) ఆ తరువాత కుమార్తెలకు వరుసగా వారికి పెళ్ళి అయ్యేంత వరకు చెల్లించాలి.
3) పెద్దవాడు 25 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత చిన్న వానికి చెల్లించాలి.
4) పిల్లలు మైనరు అయితే గార్జియన్ ద్వారా చెల్లించాలి.
రూలు 50 (7) (ii) 8,9.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి