సందేహం - సమాధానం
ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?
👉 సమాధానం:
వైద్య కారణాలతో (మెడికల్ గ్రౌండ్స్) కమ్యూటేషన్ సెలవుగానీ, ఎరండు లీవును గాని తీసుకుని పూర్తి జీతము పొందవచ్చు. అందుకు డాక్టర్ సర్టిఫికేట్ జతపరచాలి. G.O. Ms.No. 386, DT: 6-9-1976;; G.O. 268, DT: 28-10-1991 and G.O. 29, DT: 9-3-2011.
ప్రశ్న:
దాదాపు6 సంవత్సరాల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై, అక్కడ కూడా 2 సం,, రాలు పనిచేసి తిరిగి పాత పోస్ట్ లో చేరిన ఉపాధ్యాయుని 2 సం,,రాల సర్వీసును ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?
👉సమాధానం:
FR -26(i) ప్రకారం ప్రస్తుత పోస్ట్ పై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్ట్ కంటే తక్కువ కాని పోస్ట్ లో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును. G.O.Ms.No. 117, F&P, DT: 20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2 సం,,. ఇతర పోస్ట్ సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
ప్రశ్న:
6 సంవత్సరాల 3 నెలల కాలం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి Proper Channel ద్వారా విడుదల అయ్యి TSWRDC డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైన ఉపాధ్యాయురాలు 18 నెలలు పనిచేసి తిరిగి పాత ఉద్యోగంలో చేరితే సర్వీసు ఏవిధంగా లెక్కిస్తారు ? ఇంక్రిమెంట్ ఏవిధంగా లెక్కిస్తారు ? డిగ్రీ లెక్చరర్‌గా పనిచేసిన సర్వీసు పాత S.A సర్వీసుకు సాలరీ ప్రొటెక్షన్ వర్తిస్తుందా ? లేదా పాత సర్వీసులోని ఇంక్రిమెంట్ ని కలుపుతూ సాలరీ కొనసాగిస్తారా ?
👉సమాధానం:
వెనక్కి రావచ్చు. ఆ సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కిస్తారు. Regular Post కు మూడేళ్ల లీన్ ఉంటుంది. కనుక వెనక్కి వస్తే పాత పోస్ట్ యొక్క అన్ని Benefits వర్తిస్తాయి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి