అదొక విషాదం-సంక్షోభం-పోరాటం
ఉన్న వ్యవస్థ........
అనేక అసమానతలు....
దుర్మార్గాల వేదిక....
ప్రాకృతిక వైపరీత్యామూ......
మానవ దుర్మార్గమూ........
అవసాన దశ......
కరుణించని నిర్భంధం...,
మనస్సులో మానవీయతా.....
శిఖరాయమానంగా.......
వెలుగుతున్న దృశ్యాలూ....
స్వార్థంతో అల్లాడిపోతూ......
మృత్యు వ్యాపారం.......
శ్వాసల ఎగపోతలు .....
ఆసుపత్రి గుమ్మాలు.....
ఎక్కిదిగే రోగులు.........
ఆదుకొమ్మని ఆర్తనాదాలు.....
అనాధలయ్యే పిల్లలు.......
ఒకే ప్రాణావాయువు........
పంచుకునే ఇద్దరు రోగులు...
సీల్ చేసిన మృత దేహాలు.....
ఒకే చితిలో మండిపోయ్యే.....
అనేకానేక దేహాలు......
అదొక-విషాదం-సంక్షోభం-పోరాటం
షేక్ రంజాన్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి