LATEST UPDATES

12, మే 2021, బుధవారం

ఆరోగ్యం ఎంత బాగుండెను

This is a simple translate button.

ఆరోగ్యం ఎంత బాగుండెను

సైకిల్ టైరును
కర్రతో కొడుతూ
గరగిర తిప్పుకుంటూ
చింత చెట్టు క్రింద
రాలిన చింత కాయ
తింటూ.....
ఎగిరెగిరి అందుకున్న
గుబ్బ కాయ
తింటూ......
ముల్లు గుచ్చుకున్న
మొదల్లో ఉన్న
ఈత పండు
తింటూ.......
అల్లుకపోయిన
చేయీదూరని కంప
పరిక పండు
తింటూ.......
తగిలితే
వదలని కంప
రేగి పండు
నిగనిగ లాడె
బలుసు పండు
తింటూ.......
పండి పండని
బొప్పడి కాయ
లేలేత ముంజను
తింటూ......
కొమ్మన దొరికే
బంక బంక లాడె
ఇరికి పండు
తింటూ....
గురిచూసి కొట్టిన
మామిడి కాయ
ఆకుచాటున్న
జామకాయ
తింటూ.......
సైకిల్ టైరును
కర్రతో కొడుతూ
గరగిర తిప్పుకుంటూ
ఆడిన ఆటలతో
తిన్న తిండితో
ఆరోగ్యం ఎంత బాగుండెను

                    షేక్ రంజాన్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి