ఏ ఆట నీకిష్టమే చెల్లెలా ?
ఏ ఆట నీకిష్టమూ తమ్ముడా?
గురిపెట్టి కొట్టేటి
గోటీల ఆటనా!?
గవ్వలతో ఆడేటి
పచ్చీసు ఆటనా!?
పెంకాసు ఏసేటి
తొక్కుడూ బిళ్లనా!?
|| ఏ ఆట ||
గుండ్రంగ తిరిగేటి
బొంగరం ఆటాన!?
కట్టెతో కొట్టేటి
చిర్రగోనె ఆటనా!?
చేతులతో చప్పట్ల
చెమ్మ చెక్క ఆటనా!?
|| ఏ ఆట ||
అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క!
ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి!
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి