LATEST UPDATES

8, మే 2021, శనివారం

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

This is a simple translate button.

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవకాశం ఉన్న‌ టాప్ 5 నగదు లావాదేవీలు:

👉1.పొదుపు / క‌రెంట్ ఖాతా: ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ. 1 లక్ష‌. పొదుపు ఖాతాలో ఒక ల‌క్ష రూప‌యాల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

👉2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు: క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు, రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాలి.

👉3.బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్): బ్యాంక్ ఎఫ్‌డీలో నగదు డిపాజిట్ రూ. 10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కు మించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.


👉4. మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్ లేదా డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు న‌గ‌దు పెట్టుబ‌డులు రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను తనిఖీ చేస్తుంది.


👉5. రియల్ ఎస్టేట్: ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి