సందేహం
సర్వీసులో Interruption అంతరాయము వుంటే, పెన్నన్‌కు అర్హమగు సర్వీసు ఎలా లెక్కించాలి?
సమాధానం
✍️సర్వీసులో అంతరాయము కలిగిన కాలాన్ని పెన్సనుకు పరిగణించరు, కాని ఈ క్రింది సందర్భాలలో పరిగణిస్తారు.
(1) గైర్హాజరు కాలానికి సెలవు మంజూరు చేసినప్పుడు
(2) సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగములో నియమించినప్పుడు
(3) జాయినింగ్ టైము వినియోగించినప్పుడు
(4) పోస్టులు రద్దు అయినప్పుడు లేక కార్యాలయమే రద్దు కాబడినప్పుడు
(5) పెన్షను మంజూరు అధికారి వివిధ రకాల Interruption అసాధారణ సెలవుగా పరిగణించినప్పుడు
రూలు 27 (ఎ) నుండి (ఎఫ్) (2)
సందేహం
Invalid Pension ఎప్పుడు చెల్లిస్తారు?
సమాధానం
✍️ఒక ఉద్యోగి,అతను చేస్తున్న ఉద్యోగము చేయలేడని మెడికల్ అధారిటీ డిక్లేరు చేస్తే అతనికి రూలు 45 లోబడి Invalid Pension మంజూరు చేస్తారు.
అయితే మెడికల్ అధారిటి ఉద్యోగి ఇప్పుడు చేస్తున్న పనికంటే తక్కువ శ్రమ కల్గిన పనిచేయగలడు అని భావిస్తే అతనిని ఆ పోస్టులో నియమించవచ్చు.ఆ పని చేయడానికి అతనికి ఇష్టం లేకపోతే అప్పుడు అతనికి Invalid Pension మంజూరు చేస్తారు.
ఉద్యోగి దుర అలవాట్ల కారణంగా అతనికి అనారోగ్యం సంభవిస్తే అతనికి Invalid Pension మంజూరు చేయబడదు.
రూలు 37 (1) (2) (3)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి