LATEST UPDATES

8, మే 2021, శనివారం

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

This is a simple translate button.

విద్యాహక్కు చట్టం- 2009 - Some Sections

 సెక్షన్-25
-చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థులు-ఉపాధ్యాయుడి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చూడాలి.

సెక్షన్-26
-చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీని చేపట్టాలి.

సెక్షన్-27
-ప్రతి పదేండ్లకు నిర్వహించే జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ విధులు, పార్లమెంట్, శాసనసభ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్ప ఏ ఇతర పనులకు ఉపాధ్యాయుడిని పంపకూడదు.

సెక్షన్-28
-ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్లను, బోధన పనులను చేపట్టరాదు.*

సెక్షన్-29
-సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్ సంస్థ ప్రాథమిక విద్య కోసం పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. అయితే పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, బాలల సర్వతోముఖ వికాసం, బాలల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాలు, బాలల శారీరక, మానసిక అభివృద్ధులను, పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన విధానాల్లో కార్యక్రమాలు, పరిశోధనలు, బాలల మాతృభాషను, భయం, ఆందోళనకు గురిచేయని వాతావరణం, పిల్లల సామర్థ్యాన్ని అంచనావేసే విధానం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

సెక్షన్-30
-ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పిల్లలు ఎలాంటి బోర్డు పరీక్షలకు హాజరుకావాల్సిన అవసరం లేదు. పిల్లలు ప్రాథమిక విద్య పూర్తిచేసిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందించాలి.

సెక్షన్-31
-బాలల హక్కులను పరిరక్షించడం

సెక్షన్-32
-సెక్షన్-31లో పేర్కొన్న దానితో సంబంధం లేకుండా ఈ చట్టం కింద పిల్లలకున్న హక్కులకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలిపే అధికారం ఉన్నది.

సెక్షన్-33
-కేంద్రప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) జాతీయ సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-34
-రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు 15 మంది సభ్యులతో కూడిన స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్సీపీసీఆర్) రాష్ట్రస్థాయి సంఘాన్ని నియమించాలి.

సెక్షన్-35
-కేంద్రప్రభుత్వం, సందర్భానుసారంగా చట్టానికి దోహదపడే రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వానికి తగిన సూచనలు జారీచేసే అధికారాలు ఉన్నాయి.

సెక్షన్-36
-సెక్షన్-13(2), సెక్షన్-18(5), సెక్షన్-19(5) కింద నిర్ధారించిన దండనీయ నేరాలను సంబంధిత ప్రభుత్వం, ప్రత్యేక విజ్ఞప్తి ద్వారా, దీనికోసం నియమించిన అధికారి ఆజ్ఞ లేకుండా నిలిపే అధికారం లేదు.

సెక్షన్-37
-ఈ చట్టంలోని నియమావళిని సద్భావనాపూర్వకంగా చూడాలి.

సెక్షన్-38
-సంబంధిత ప్రభుత్వం, చట్టం నియమావళిని కార్యాచరణ రూపం దాల్చడానికి చేపట్టే చర్యలకు సూచనలు జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.....

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి