🌴సమరభేరిని మోగించాలి🌴
1. జగతిలో సగమైసృష్టికి మూలమై
ఎవరెస్టు శిఖరం ఎక్కినా
అంతరిక్షంలో అడుగుపెట్టినా
అన్ని రంగాల్లో రాణించినా
ఏమిటీ గృహహింస
. ఎందుకీ చిత్రహింస
2. నాగరిక సమాజంలో
అనాగరిక చేష్టలతో
చిగురుటాకులా వణుకుతుంది
మానవ మృగాల చేతిలో
చిన్ని జీవితం చితుకుతుంది
3. పురుషాధిక్యత పడగ నీడలో
చీదరింపులు, బెదిరింపులతో
సమానత్వం కరువాయె
మనసంతా బరువాయే
ప్రజాస్వామ్యంలో పవరొస్తే
పేరేమో నీదాయే
అధికారం వాల్లదాయే
అమ్మ కాల కోసం
ఆట బొమ్మను చేయడంతో
మగువ ప్రతిష్ట మసక బారుతుంది.
4. ఉవ్వెత్తున ఉప్పెనై
సముద్రంలో కెరటమై
చీకట్లను చీల్చే సూర్య కిరణమై
స్వేచ్ఛ వాయువుల కోసం
వివౕక్ష సంకెళ్లను తెంపడం కోసం
చీమల దండులా కదిలి
సమర శంఖం పూరించాలి
సమరభేరీ ని మోగించాలి
----------‐-‐---‐------‐----------‐-'
✍✍✍ తాటిపాముల రమేష్ ,
ZPHS వర్ధన్నపేట .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి